E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావే.. మరోసారి మోసపోయిన మనోజ్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావే.. మరోసారి మోసపోయిన మనోజ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఏంటి పాలరమ్మ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు.. విద్య దగ్గర వడ్డీ డబ్బులు తీసుకొని వచ్చేసాను అని అంటుంది. తర్వాత రోజు ఉదయం బాలు మీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ సుమతి ఏదో గొడవ జరిగి ఉంటుందని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వచ్చిన శివ తనని ఎగ్జామ్ రాయనివ్వకుండా గుణ చేస్తున్నాడని చెప్పగానే బాలు నేను ఎగ్జామ్ రాసేలా చేస్తాను అని అంటాడు.. ఇక మీనా ఒక పార్సల్ తీసుకొని వచ్చిన వ్యక్తితో మాట్లాడుతుంది.. ఆ పార్సల్ వచ్చింది శృతి కోసం అని తెలుసుకొని దాన్ని తీసుకొని లోపల పెడుతుంది.. అయితే దాన్ని చూసిన ప్రభావతి ఆ ఏమొచ్చిందని చూడాలని ప్రభావతి అనుకుంటుంది. ఒకవైపు మీనా అలా చూడడం తప్పు కదా అత్తయ్య అని ఎంతగా చెబుతున్నా సరే మీ నా మాట వినకుండా ప్రభావతి పార్సెల్ ని ఓపెన్ చేస్తుంది.. అందులో హెడ్సెట్ ఉండడం చూసినా ప్రభావతి దీన్ని ఎలా వాడతారు ఇదేదో బాగుంది అని అనుకుంటుంది. ఇది నేను పెట్టుకుంటే చాలా బాగుంది కదూ.. అని తనలో తానే మాట్లాడుకుంటూ దాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. అది చూసిన మీనా అలా ఓపెన్ చేసి వేరే వాళ్ళది చూడడం తప్పు.. శృతికి తెలిస్తే బాధపడుతుంది కదా అత్తయ్య అని చెప్తున్నా సరే నీకెందుకు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని అంటుంది..

అయితే దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి అబ్బా పాటలు రావడం లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. అలా పెట్టుకుంటే పాటలు రావు దానికి ఫోన్ కనెక్ట్ చేస్తే వస్తాయి అని మీనా అంటుంది.. నాకు తెలుసులే ఎలా ఉంటుందని టెస్ట్ చేస్తున్నానని మీనా అంటుంది.. ప్రభావతి చేతిలో తన హెడ్సెట్ చూసి శృతి రెచ్చిపోతుంది.. అయిననా హెడ్సెట్ తీసుకోవాల్సిన అవసరం మీకేంటి అని తిడుతుంది.. ఇక ప్రభావతి ఆ కోపాన్ని మీనా పై చూపిస్తుంది. శివ నీ కాలేజీలోకి మళ్లీ తీసుకెళ్లాలని బాలు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు శివని కాలేజీలో మళ్లీ తిరిగి రప్పించేందుకు కాలేజీకి వెళ్తాడు.. కాలేజీని చూసి చాలా సంతోషంగా ఉంటాడు. కాలేజ్ అంటే ఇలా ఉంటుందా ఏ రోజు కాలేజీకి వచ్చిన మొహం కాదు నాది అందుకే ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు.. శివ గురించి మాట్లాడాలని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే అతను మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదని చెప్తాడు. ఫ్యూన్ చెప్పిన కూడా బాలు వినకుండా ఏదో ఒకటి చేయండి తాతా అని బ్రతిమళాడుతాడు.. మొత్తానికి బాలు అయితే శివని కాలేజీకి పంపించే ప్లాన్ చేస్తాడు.. అయితే ప్రిన్సిపల్ వాళ్ళ ఇంటికి వెళ్లిన బాలు మీనా ఇద్దరు కూడా ఆ ప్రిన్సిపల్ ని ఎలాగైనా నమ్మించాలని అనుకుంటారు.

అయితే బాలు తాగేసినట్టు నటిస్తాడు.. ఆ ప్రిన్సిపల్ బయటికి రావడం చూస్తున్న బాలు ఇంకాస్త ఎక్కువగా రెచ్చిపోతాడు.. మందు బాటిల్ తీసుకొని తాగినట్టు నటిస్తాడు అంతేకాదు మీనాని దారుణంగా కొట్టేనట్టు ప్రయత్నిస్తాడు. అక్కడ నాటకం మాడి మరి ప్రిన్సిపాల్ ని ఎలాగోలాగా నమ్మించేస్తాడు. తమ్ముడు శివ బ్యాగులో నేను మందు బాటిల్ దాచుకుంటే వాడు తీసుకెళ్లి ఎక్కడో పడేసాడు ఎక్కడ పడేసాడు నాకు ముందు చెప్పు అని మీనాని కొడుతున్నట్లు బాలు నటిస్తాడు. ఇక మీనా కూడా బాలుకి ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోతుంది. మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని మీనా ఒకవైపు అంటూనే. మరోవైపు నా పసుపు తాడు కూడా తాకట్టు పెట్టేసుకున్నారు మీరు తాగుడికి నేను చచ్చిపోతున్నాను అని అంటుంది..

Advertisement

అయితే ఇదంతా నిజమే నేను నమ్మిన ప్రిన్సిపల్ అయ్యో పాపం మీ అమ్మాయికి చిన్న వయసులోని ఎంత కష్టం వచది అని అనుకుంటాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన శివ ఏంటక్కా ఇక్కడికి వచ్చారు ఏమైంది అక్క అని కంగారు పడుతూ అడుగుతాడు. నువ్వేంటి రా ఇక్కడికి వచ్చావు మీ బావ ఎలా చేస్తున్నాడో చూసావా అని అడగగానే అర్థమవుతుంది. ఇంతకుముందు ఇంట్లోనే తాగేవాడు ఇప్పుడు రోడ్డు ఎక్కాడా అని శివ కూడా నమ్మేస్తాడు.. నేను ఇంత మంచి కుర్రాడిని ఎగ్జామ్ రాయనివ్వకుండా చేశానా ఎలాగైనా సరే ఇతని భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తాను అని ప్రిన్సిపల్ అనుకుంటాడు. శివ నువ్వు మందు తాగుతున్నావని నేను అపార్థం చేసుకున్నాను. ఇప్పటినుంచి నువ్వు కాలేజీకి వచ్చేసేయ్. నువ్వు రాయచ్చు అనగానే శివ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక బాలు మినాల ప్లాను వర్కౌట్ అయిందని బాలు మీనా సంతోష్ పడతారు..

Also Read :మహాకు నిజం చెప్పేసిన కన్నా.. కేశవ్ గురించి నిజం తెలుస్తుందా..? మళ్ళీ అబద్దం చెప్పిన చక్రీ..

అయితే బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సీఐ వస్తారు.. అది చూసిన ప్రిన్సిపల్ మేడం నేనే మీకు ఫోన్ చేసింది. ఇతనే అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడు. ఇతని అరెస్ట్ ఏంటి కావాలంటే నేను కంప్లైంట్ వచ్చి ఇస్తాను అని అంటాడు… బాలుని బలవంతంగా ఆ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. శివ ఏంటక్కా ఇలా చేస్తున్నాడు అని అనగానే.. అరే ఇదంతా నువ్వు నిజమని నమ్ముతున్నావా కాదురా.. మళ్లీ కాలేజీకి పంపించడానికి మీ బావ నేను ఆడిన నాటకం రాని చెప్పగానే శివ షాక్ అవుతాడు.. మీనా శివ ఇద్దరు కలిసి బాలు కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.. మనోజు మళ్లీ తన బిజినెస్ బాగోలేదని బాధ పడిపోతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×