Inzamam ul haq: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా ఫైనల్ కు దూసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England) మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏడు పరుగులు తేడాతో విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది టీమిండియా. ఈ రెండో సెమీ ఫైనల్ లో టీమిండియా గెలవడం వెనుక జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) కృషి ఉంది. అతడి అద్భుతమైన బౌలింగ్ నేపథ్యంలో టీమిండియా గెలిచింది. అందరూ పరుగులు ఇచ్చినప్పటికీ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం పొదుపుగా బౌలింగ్ చేసి, ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించాడు. ఈ తరుణంలోనే జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam ul haq ) సంచలన ఆరోపణలు చేశారు. బుమ్రా బాల్ టాంపరింగ్ చేశాడు, అతన్ని బ్యాన్ చేయండి అంటూ వింత వాదన తెరపైకి తీసుకొచ్చారు ఇంజమామ్ వుల్ హక్.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్ సందర్భంగా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ విషం కక్కుతోంది. ఈ మ్యాచ్ లో బుమ్రా బాల్ టాంపరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు చేశారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 15వ ఓవర్ సందర్భంగా బంతిని మార్చేశారని.. ఆ సమయంలోనే బుమ్రా బౌలింగ్ చేసినట్లు తెలిపారు ఇంజమాం. దీని వెనుక బుమ్రా కుట్ర ఉందని ఆరోపణలు చేశారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 15వ ఓవర్ లో బంతిని కావాలనే అంపైర్ మార్చేశాడని ఇంజమామ్ వుల్ హక్ ఆరోపణలు చేశారు.
ఆ సమయంలోనే బాల్ టాంపరింగ్ ( Ball Tampering) చేసిన బంతిని బుమ్రాకు (Bumrah) ఇచ్చారని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇంజమామ్ వుల్ హక్. అప్పటికే ఆ బంతిని బుమ్రా టాంపరింగ్ చేసినట్లు తెలిపారు. దాంతో 15వ ఓవర్ నుంచి బంతి రివర్స్ రింగ్ కావడం మొదలుపెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు ఇంజమామ్ వుల్ హక్. అయితే 15వ ఓవర్ వద్ద బంతిని మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. ఇండియా గెలవాలని అంపైర్లు కూడా ట్యాంపరింగ్ చేసిన బంతిని బుమ్రాకు ఇచ్చారన్నారు. దీని అంతటికి కారణమైన బుమ్రాపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam ul haq ). దీనిపై ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
🚨 MASSIVE STATEMENT BY INZAMAM-UL-HAQ ON INDIA 🚨
Inzamam ul haq said 🗣️
"Team India committed ball tampering in front of the whole world. After the 15th over, when the umpire changed the ball, Bumrah's ball started reverse swinging. What was the need for the umpire to… pic.twitter.com/ayhoF7ziw6
— Cricket Central (@CricketCentrl) March 6, 2026