E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై మీనాకు అనుమానం.. మనోజ్ కు షాకిచ్చిన రవి.. రేవతి ఎంట్రీతో మనోజ్ మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై మీనాకు అనుమానం.. మనోజ్ కు షాకిచ్చిన రవి.. రేవతి ఎంట్రీతో మనోజ్ మైండ్ బ్లాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May5th: 70 లక్షలు లేకుండా ఎలా ఇంటిని కొనగలం అత్తయ్య అని రోహిణి అడుగుతుంది. ఎందుకు కొనలేం కొనడానికి ఒక మార్గం ఉంది అని ప్రభావతి అంటుంది. జైల్లో ఉన్న మీ నాన్నని ఆ 70 లక్షలు అడుగు అని ప్రభావతి అనగానే రోహిణి ఫీజులు ఎగిరిపోతాయి. మీ నాన్న లేకుండా ఉంటే ఏమీ మీ మామయ్య ఉన్నాడు కదా ఆయన అడుగు అని  అంటుంది. అటుచి ఇటు వచ్చి నేనే అడ్డంగా ఇరుక్కున్నానా అని రోహిణి అనుకుంటుంది.. విద్య కు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్తుంది.. డబ్బులు లేవు అని తన మలేషియా మావయ్య చెప్పాడు అని రోహిణి ప్రశ్నలు సమాధానాలు తానే చెప్పడంతో మీనా బాలుకి అనుమానం వస్తుంది. మరి రోహిణి బండారం బాలు బయట పెడతాడా లేదా అన్నది చూడాలి…

శృతి మాటతో మనోజ్, రోహిణి కి షాక్..

మీనా, బాలుకి రోహిణి పై అనుమానం వస్తుంది. రోహిణి ఏదో తేడాగా ప్రవర్తిస్తుందండి నాకెందుకు తనని చూస్తే తేడాగా అనిపిస్తుంది అని మీనా అనగానే అవును మీనా నాకు కూడా ఇదే అనుమానం వచ్చింది. మనం ఎలాగైనా సరే ఆ రోహిణి బండారం గురించి బయట పెట్టాలి అని బాలు అంటాడు. మనోజ్ రోహిణి ఇద్దరూ మాట్లాడుకుని ప్లాన్ ప్రకారం రవి శృతిల దగ్గరికి వెళ్తారు. శృతి అసలు మనోజ్ ఇలాంటి పని చేస్తాడని అస్సలు ఊహించలేదు.. ఎప్పుడు తమ స్వార్థం గురించి ఆలోచిస్తాడా శృతి అంటుంది. వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మనోజ్ రోహిణి రావడం చూసిన శృతి మీ అన్నయ్య వచ్చి నిన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తాడు నువ్వు మాత్రం అస్సలు తగ్గదు రవి అని అంటుంది. మనోజ్ రోహిణి ఇద్దరు వచ్చి శృతి వాళ్ళ అమ్మని డబ్బులు అడగమని చెప్తారు.. నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నానని వాళ్ళు బాధలో ఉన్నారు ఇప్పుడు నేను వెళ్లి వాళ్ళని డబ్బులు ఎలా అడుగుతున్నాను అనుకుంటారు. నేను అస్సలు అడగను అని శృతి అలాగే రవి కూడా అనగానే మనోజ్ రోహిణి షాక్ అవుతారు..

మనోజ్ ను రెచ్చగొట్టిన రోహిణి..

Advertisement

వీళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయరని అర్థం అయిపోయింది రోహిణి.. వీళ్ళ గురించి ఇంకేది నేను ఆలోచించకూడదు హెల్ప్ చేయమంటే నేను హెల్ప్ చేయలేదని దెప్పి పొడుస్తున్నారు అంటూ మనోజ్ తెగ ఫీల్ అయిపోతారు. నువ్వేం బాధపడకు మనోజ్ నాకు మొదటి నుంచి బిళ్ళ మీద ఎటువంటి ఆశలు లేవు ఇకమీదట మన గురించి మనం ఆలోచించుకుందామని రోహిణి అంటుంది.. ఆ ముఖేష్ ని అడిగి ముందు సేల్స్ బాగా అయ్యేలా చేసి డబ్బులు అడుగుదాం. నన్ను నేను నిరూపించుకోవాలి అని మనోజ్ ఛాలెంజ్ చేస్తాడు..

మీనా కోరికను బాలు తీరుస్తాడా..?

మనోజ్ ఎంత ధైర్యంగా ఇంటిని అమ్మేయాలని అడిగాడు అంటూ ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు.. ఎప్పుడూ పెద్ద కొడుకు అని సపోర్ట్ చేసే అత్తయ్య కూడా మనోజ్ కి సపోర్ట్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది అని నేను అంటుంది. అమ్మకి అదొక జ్ఞాపకం. దాన్ని ఎందుకు వదిలేయాలి అని అనుకుంటుంది.. ఒకవేళ అత్తయ్య ఆ ఇంటిని ఇవ్వడానికి ఒప్పుకున్న సరే మామయ్య ఒప్పుకునే వాడు కాదు కదా అని మీనా అనుకుంటుంది. ఆ ఇల్లు మాకు ఒక సెంటిమెంట్ లాంటిది. నేను ఇంకా రా ట్రిప్ నుంచి రాలేదని మా నాన్న ఎదురు చూసేది ఆ ఇంట్లోనే. అందుకే ఆ ఇంటిని అమ్మే ప్రసక్తే లేదు అని బాలు అంటాడు. ఇక మీనా కి ఎలాంటి ఇల్లు కావాలి అని అడుగుతాడు.. ఇంత పెద్ద ఇల్లు నాకు అక్కర్లేదు కానీ చుట్టూ మనుషులు ఉండేలా మంచి ఇల్లు అయితే బాగుంటుంది అని మీ నాన్నగానే సరే నీ కోరిక నేను తీరుస్తాను అని బాలు భరోసా ఇస్తాడు..

రోహిణిని నీళ్ళల్లో తోసేసిన ప్రభా..

Advertisement

రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా గదిలోకి వచ్చి నిద్రపోతూ ఉంటారు. బయటినుంచి ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే రోహిణి వెళ్లి తలుపు తీయగానే ప్రభావతి ఎదురుగా కనిపిస్తుంది. ఏంటి అత్తయ్య మీరు ఈ టైంలో వచ్చారు ఏమైనా కావాలా అని అడుగుతుంది రోహిణి. ఏం అవసరం లేదు నీ గురించి బండారం మొత్తం బయటపడింది అని చెప్పగానే రోహిణి షాక్ అవుతుంది.. ఇన్ని రోజులు నువ్వు బికారి దానివి అని తెలియక నేను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. అంటే కోడలు నా ఇంట్లోనే వద్దు అనేసి బయటికి లాక్కొని వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తుంది ప్రభావతి.. రోహిణి కాపాడండి కాపాడింది అంటూ గట్టిగా కేకలు వేస్తుంది.. అయితే అది రోహిణి కన్నా కల. మనోజ్ ని ఒక్కసారిగా కాల్తో తన్నడంతో కింద పడిపోయి లేస్తాడు.. అది కేవలం నక్కలేనా ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు అని రోహిణి అనుకుంటుంది.

బాలును కలిసిన రేవతి..

కెనడా నుంచి ఇండియాకు వచ్చిన రేవతి కారుని బుక్ చేసుకుంటుంది.. మీకోసం ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిన బాలు ఏంటి మేడం మళ్ళీ వచ్చారు ఏదైనా పని పడిందా అని అడుగుతాడు. అవును బాలు ఇక్కడ నేను ఒక ఇంటిని కొన్నాను దాన్ని రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది. పోయినసారి జరగాల్సింది ఓ దొంగ వెధవ నా దగ్గర 45 లక్షలు కొట్టేసాడు.. ఇప్పుడు మళ్లీ రిజిస్ట్రేషన్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది. బాలు రేవతి ఇద్దరు కూడా చాలా సరదాగా ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటారు. మరి రేవతి మనోజ్ గురించి బాలుకు నిజం చెప్తుందా..? ఒకవేళ నిజం చెప్తే 40 లక్షలు మనోజ్ వెంటనే కట్టిస్తాడా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : మాధవ్ మాటతో కన్నా ఎమోషనల్.. మహా టూర్ ప్లాన్ సక్సెస్.. నారాయణ గెటప్ అదుర్స్.. ఇదే ట్విస్ట్..

Related News

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Big Stories

Advertisement
×