E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ మాటతో కన్నా ఎమోషనల్.. మహా టూర్ ప్లాన్ సక్సెస్.. నారాయణ గెటప్ అదుర్స్.. ఇదే ట్విస్ట్..

Podarillu Today Episode : మాధవ్ మాటతో కన్నా ఎమోషనల్.. మహా టూర్ ప్లాన్ సక్సెస్.. నారాయణ గెటప్ అదుర్స్.. ఇదే ట్విస్ట్..
Advertisement

Podarillu Today Episode May 5th : ఉదయం లేవగానే కన్నా చాలా బాధపడిపోదు కనిపిస్తాడు. అది చూసిన మహా విని ఆ మూడ్లోంచి బయటికి తీసుకురావాలి అని అనుకుంటుంది.. పెద్ది ఉప్మా అని చెప్పగానే ఈ ఉప్మా నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అని కన్నా మహాలక్ష్మి ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతారు.. చక్రి అడ్డంగా దొరికిపోయి ఉప్మా తినేందుకు రెడీ అవుతాడు.. ఇక మహాలక్ష్మి నువ్వు ఎప్పుడు ఇలా చెయ్యొద్దు ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం అని చాలా గొప్పగా చెప్తుంది.. నువ్వు వేరే తల్లికి పుట్టిన కూడా ఏ రోజు వాళ్ళు నిన్ను వేరే తల్లికి పుట్టావు అని చూడలేదు.. నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన అప్పటినుంచి చూస్తున్నాను నిన్ను వాళ్ళు ప్రాణంగానే చూసుకున్నారు అని మహాలక్ష్మి కన్నా ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా నువ్వు సంతోషంగా ఉండి అందరిని సంతోషంగా ఉండేలా చూడు అని మహాలక్ష్మి కన్నాకి చెప్తుంది..

మాధవ్, కన్నా ఎమోషనల్ సీన్..

ఉప్మా వద్దని ఇందాక అనగా బయటికి వెళ్లారు వీళ్లిద్దరు ఇంకా రాలేదేంటి అని మాధవ్ ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మి పెద్ది అని వంటగదిలోకి వస్తుంది. ఎప్పుడో వెళ్లారు ఇంకా రాలేదని మీ గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు మాధవ్.. వాడు మనసుని ఎలాగ మార్చలేము కదా అమ్మ వాడి కోసం బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ అంటే వాడికి చాలా ఇష్టమని మాధవ్ అంటాడు. మనసు మార్చడానికి వాడిని బయటకు తీసుకుని వెళ్లాను చెప్పాల్సిన విధానంలో చెప్పాను మారాడు అని అనుకుంటున్నాను అని మహా అనగానే మాధవ్ కన్న దగ్గరికి వెళ్లి నీకోసం బిర్యాని చేశాను రా నువ్వు అన్ని మర్చిపోయి ఉండాలి అని అంటాడు. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ డైలాగులు ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తాయి. అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం ప్రేక్షకులను ఏడిపించేలా ఉంటుంది..

మహాతో చక్రీ పులిహోర..

Advertisement

మహా ఒంటరిగా కూర్చుని నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన చక్రి ఈవిడ ఎంతగా నవ్వుతుంది అంటే ఏదో జరిగింది ఒంటరిగా ఉంది కదా పులిహోర కలిపి ప్రయత్నం చేయాలి అని అనుకుంటాడు. మాతో మాట్లాడుతూ ఫోన్ కి థాంక్స్ అని చెప్పడంతో మహా ఎందుకు చెప్తున్నారు అని అడుగుతుంది. కన్నా ఎక్కడున్న విషయం మీరు ఈ ఫోన్ తోనే కదా చెప్పారు అందుకే మీకు థాంక్స్ అని చక్రి అంటాడు.. కన్నా అలాగే పెద్ది కూడా బాధపడుతున్నారు.. వాళ్ళిద్దర్నీ ఎక్కడికైనా బయటికి తీసుకుని వెళ్తే బాగుంటుంది అని మహాలక్ష్మి అంటుంది.. ఏదైనా రిసార్ట్ కి వెళ్దామని చక్రి అంటాడు.. నేను రాను మీరందరూ వెళ్ళండి అని మహాలక్ష్మి అంటుంది..

మాధవ్ కు చక్రి పై డౌట్..

మాధవ్ దగ్గరికి చక్రి జ్యూస్ తీసుకొని రావడంతో మాధవ్ కి అనుమానం వస్తుంది.. నువ్వు ఏదో చేశావు అందుకే జ్యూస్ తీసుకొచ్చావు ఏం చేసావో చెప్పరా అని అడుగుతాడు.. కన్నా నువ్వు బాధపడుతున్నారు కదా ఎక్కడికైనా బయటికి తీసుకుని వెళ్తే బాగుంటుందని మహాలక్ష్మి ఐడియా ఇచ్చింది. నువ్వు ఒప్పుకుంటావో లేదో అని ఈ జ్యూస్ తీసుకొచ్చాను అన్నయ్య అని అనగానే ముందు ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఒప్పుకుంటాడు మాధవ్.. ఇక చక్రి మిగిలిన వాళ్ళందరినీ కూడా అలానే ఒకరికి తెలియకుండా ఒకరిని ట్రిప్ కోసం ఒప్పిస్తాడు..

మాధవ్ మాటతో ఒప్పుకున్న మహా..

Advertisement

అందరం ట్రిప్ కు వెళ్దామని అనుకుంటున్నాం నువ్వు కూడా రామ్మా అని పెద్ది పిలుస్తాడు.. మీరందరూ సరదాగా వెళ్తుంటే నేనెందుకు పెద్ది అని మహాలక్ష్మి అంటుంది. ఇంట్లో ఒక్కదాన్నే ఆడపిల్లను ఉంచి మేమందరం వెళ్లలేం కదమ్మా నువ్వు కూడా రావాల్సిందే అని అనగానే నువ్వు పిలిస్తే నా తర్వాత రాకుండా ఎలా ఉంటాను వెళ్దామని మహా అంటుంది. మీ నాన్నను కూడా పిలిస్తే బాగుంటుంది అని మహాలక్ష్మి అనగానే.. ముందు ఆయన వద్దు అని అన్నా కూడా ఆయన కూడా తీసుకొని వెళ్దామని అందరూ కలిసి అంటారు..

నారాయణ గెటప్ సూపర్ అంతే..

మీ నాన్నగారు వస్తే బాగుంటుంది. పూలు ఆయనని ఒంటరిగా వదిలేసి వెళ్తే ఆయన తాగడానికి హద్దు అదుపు లేకుండా వెళ్ళిపోతుంది. వంట కూడా చేసుకోవడం చేతకాదు కదా మరి ఆయన చాలా ఇబ్బందులు పడతారు అని మహాలక్ష్మి అంటుంది.. నేను ఆల్రెడీ పిలిచాను అమ్మ కానీ ఆయన రాలేను అన్నాడు అని మాధవ్ అంటాడు. అందరూ కూడా తమ లగేజ్ లు తీసుకొని బయటికి వచ్చేస్తారు. నారాయణ లేకపోవడం చూసి ఎక్కడికి వెళ్లాడా అని అనుకుంటారు. ఎదురుగా కారు వచ్చి ఆగడంతో నారాయణ అదిరిపోయే గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు. అది చూసి అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు.. ఇక అందరూ కలిసి ట్రిప్ కి బయలుదేరుతారు. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్ గా మిగులుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లోంచి వెళ్లిపోతున్న నడిపోడు.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. ఫిట్టింగ్ పెట్టేసిన ధీరజ్..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Karthika Deepam 2 Serial Today Episode September 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు మాలిని షాక్ – హాస్పిటల్ లో దీప          

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ రివర్స్.. తాయారును రెచ్చగొట్టిన నారాయణ..పంతులు ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు పల్లవి ప్లాన్.. అయ్యో పార్వతి.. సీన్ రివర్స్..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి భద్ర వార్నింగ్.. ధీరజ్ కు మైండ్ బ్లాక్.. రామరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 పరిస్థితి ఏంటి..?

Big Stories

Advertisement
×