BigTV English

GundeNinda GudiGantalu Today Episode : రోహిణికి సారీ చెప్పిన బాలు.. మీనా, బాలును కలపనున్న సత్యం..

GundeNinda GudiGantalu Today Episode : రోహిణికి సారీ చెప్పిన బాలు.. మీనా, బాలును కలపనున్న సత్యం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా సత్యంకు ఎలాగైనా తాయత్తు కట్టాలని హాస్పిటల్ లోనే ఉంటుంది. ప్రభావతి నా నగలను తీసుకో అని మొత్తం నగలను ఇస్తుంది. నాకు ఆయనకన్నా ఈ నగలను తీసుకో.. ఆయన కొన్నవే ఇవి ఆయన ప్రాణాల కన్నా ఇవి ఎక్కువ కాదు అని అంటుంది.ఈ బంగారు తీసుకొని వెళ్లి కట్టు అని అంటుంది. ఇవి ఆయన చేయించినవే.. తీసుకెళ్ళు కట్టు సరిపోకుంటే పుస్తెలు కూడా తీసుకెళ్ళు అంటుంది. ఇక ఆపరేషన్ కోసం రెడీ చేస్తారు.. అందరు గుడికి వెళ్లారు.. మీనా తాయత్తు కట్టాలని హాస్పిటల్ కు వస్తుంది. ఇక రంగా సాయంతో తాయత్తు కట్టేస్తుంది. ఇక అక్కడ నుంచి మీనా వెళ్ళిపోతుంది. ఇక అందరు సత్యం ను చూసి ఏడుస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవి ఇంటికి వెళ్లి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే శృతి వస్తుంది.. ఏమైంది రవి ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది. రవి శృతిని పట్టుకొని ఏడుస్తాడు. ఇక నాన్నకు సీరియస్ గానే ఉంది నన్ను చూడనివ్వలేదు నేను వాళ్లకు వద్దంట, డబ్బులు ఇచ్చినా తీసుకోలేదని చెబుతాడు..శృతి నేను ముందే ఊహించాను అంటుంది. రవిని ఓదారుస్తుంది. కొద్ది రోజులు ఓపిక పట్టు అని చెబుతుంది. అమ్మ కూడా తనను అర్థం చేసుకోవడం లేదని, నన్ను ఎందుకు దూరం పెడుతున్నారో తెలియడం, నేను ఏం పాపం చేశానని రవి ఆవేదనకు లోనవుతాడు. శృతి అతడిని ఓదార్చుతుంది. నువ్వేం నేరం చేయలేదని, ప్రేమించి పెళ్లిచేసుకున్న నిన్ను మీవాళ్లు అర్థం చేసుకోలేకపోయారని శృతి అంటుంది. నీకు నేను, నాకు నువ్వు ఉన్నామని, కొన్నాళ్లలోనే ఇవన్నీ సర్ధుకుంటాయని భర్తను ఓదార్చుతుంది శృతి..

ఇక సత్యం దగ్గర ప్రభావతి ఉంటుంది. సత్యం స్పృహలోకి వస్తాడు. అది చూసి ఆనందం తట్టుకోలేక ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను బాగానే ఉన్నానని సత్యం అంటాడు. మీకు ఇలా కావడంతో ప్రపంచం ఆగిపోయినట్లుగా అనిపించిందని ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక అప్పుడే బాలు అక్కడకు వస్తాడు. సత్యంను చూసి ఆనందంతో పొంగిపోతాడు. ప్రభావతి మీద సెటైర్స్ వేస్తాడు. అమ్మ కూడా మీరు కోలుకోవాలని కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూసిందని తండ్రితో చెబుతాడు. ఇన్నాళ్లు నాకు నువ్వే దేవుడికి అనుకున్నాను..కానీ మొదటిసారి మీ కోసం గుళ్లో దేవుడికి దండం పెట్టుకున్నానని తండ్రితో అంటాడు బాలు.. నా వల్లే ఇదంతా జరిగింది అని తండ్రికి క్షమాపణలు చెబుతాడు. నిన్ను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు అన్నారని, ఇంటికి వెళ్లిపోదాం అని తండ్రితో అంటాడు బాలు. రవి రాలేదా బాలును అడుగుతాడు సత్యం. వచ్చి ఉండకుండా వెళ్లిపోయాడా. మీనా ఏదని అంటాడు. మనం వద్దు అనుకున్న వాళ్ల గురించి తలచుకొని బాధపడటం ఎందుకొని ప్రభావతి బదులిస్తుంది.. ఇక అమ్మకు టిఫిన్ తెచ్చి ఇస్తాడు. దానికి బాలును చూసి ఎమోషనల్ అవుతుంది.


సత్యాన్ని డిశ్చార్జ్ చేస్తారు. కారు ఎక్కబోతూ నీ కారు ఇంకా రిపేర్ కాలేదా…ఇంకా ఎన్నాళ్లు అద్దె కారు నడుపుకుంటూ తిరుగుతావని బాలును అడుగుతాడు సత్యం. ఇంటికెళ్లిన తర్వాత అవన్నీ మాట్లాడుకుందామని తండ్రికి సర్ధిచెప్పుతాడు బాలు. సత్యం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం మీనా చూస్తుంది. మామయ్య క్షేమంగా ఉన్నాడు అని అనుకుంటుంది. ఇక హాస్పిటల్ బిల్లు కోసం డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారని అందరిని అడుగుతాడు సత్యం. డబ్బులు సర్ధుబాటు కాక బాలు తన కారు అమ్మేశాడని, పై ఖర్చుల కోసం తన నగలు కూడా తాకట్టు పెట్టాల్సివచ్చిందని ప్రభావతి అంటుంది.. ఇక సత్యం మీకు బుద్ది లేదా ఇంటి పత్రాలు పెట్టేసి తీసుకోవాల్సింది అన్నాడు. అప్పుడు ప్రభావతి ఇంకెక్కడా పాత్రలు ఆ పూలు అమ్ముకొనేది తీసుకొని వెళ్లిందని అంటుంది. ఇక మారవా నువ్వు అదే రోజు పత్రాలను మీనా నాకు తెచ్చి ఇచ్చింది అనగానే అందరు షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనా కోసం బాలు వెళ్తాడు.. మీనా అతనితో వెళ్తుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Big tv Kissik Talks: బిగ్ బాస్ హౌస్ పాములు.. పులుల అరుపులు షాకింగ్ విషయాలు బయటపెట్టిన హరితేజ!

Big tv Kissik Talks: ఎన్టీఆర్ తో హరితేజ గొడవ…  డైరెక్టర్లకు వార్నింగ్ ఇచ్చిన తారక్?

Big tv Kissik Talks: ప్రెగ్నెన్సీ టైంలో కోవిడ్.. హరితేజ ఇంత నరకం అనుభవించిందా..దేవుడా?

Rekha Boj: మొన్న గాజులు.. నేడు కిడ్నీలు.. పాపం పట్టించుకోండయ్యా!

Illu Illalu Pillalu Today Episode: కొడుకుల కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. నర్మదతో సాగర్ గొడవ.. ప్రేమకు గుడ్ న్యూస్..

Intinti Ramayanam Today Episode: పల్లవిపై కమల్ సీరియస్.. అవని మాటతో కూల్.. పల్లవి షాకింగ్ నిర్ణయం..?

Nindu Noorella Saavasam Serial Today october 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పిల్లలను మిస్సమ్మ మీదకు రెచ్చగొట్టి పంపిస్తున్న మనోహరి

Brahmamudi Serial Today October 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు షాక్‌ ఇచ్చిన తాగుబోతు  

Big Stories

×