BigTV English

Roja Target Anitha: పవన్ కామెంట్స్.. శివాలెత్తిన ఫైర్‌బ్రాండ్ రోజా, వైసీపీ కార్యకర్తలకు కష్టాలు

Roja Target Anitha: పవన్ కామెంట్స్.. శివాలెత్తిన ఫైర్‌బ్రాండ్ రోజా, వైసీపీ కార్యకర్తలకు కష్టాలు
Advertisement

Roja Target Anitha: కూటమి ప్రభుత్వ వీక్‌నెస్‌ని తనకు అనుకూలంగా మార్చు కోవాలని వైసీపీ చూస్తోందా? ఏదో విధంగా బురద జల్లే ప్లాన్ చేస్తోందా? మినిస్టర్ అనిత రాజీనామా చేయాలని వైసీపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చినా పోలీసులు మారలేదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం, మంత్రులపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నవారిపై దృష్టి సారించారు పోలీసులు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నానిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అయ్యప్ప దీక్షలో ఉన్న నానీ, కనీసం పూజ కూడా చేయకుండా బలవంతంగా పోలీసులు లాక్కెళ్లారంటూ రాసుకొచ్చింది. అరెస్టులతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని ప్రభుత్వం భయపెట్టాలని చూస్తోందని పేర్కొంది.


సోమవారం పిఠాపురం వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు రెండోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వాలు మారినా పోలీసుల తీరు మారలేదని కుండబద్దలు కొట్టేశారు. తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే మరో విధంగా ఉంటుందని చెప్పకనే చెప్పారు.

ALSO READ:  టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ ఇక లేరు

లా అండ్ ఆర్డర్ బలోపేతం చేయలేదని, ధర్మబద్దంగా చేయాలని సూచన చేసినా పట్టించుకోలేదన్నారు పవన్ కల్యాణ్. క్రిమినల్‌కు కులం, మతం అనేది ఉండదని సూటిగా చెప్పేశారు డిప్యూటీ సీఎం. నిందితుడ్ని అరెస్ట్ చేయాలంటే కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

క్రిమినల్స్‌ను వెనుకేసుకురావాలని చట్టం చెబుతోందా అంటూ పోలీసులపై శివాలెత్తారు. సోషల్ మీడియా దారుణంగా పోస్టింగులు పెడుతుంటే దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా వైసీపీ నేతలు చెప్పడాన్ని తప్పుబట్టారు. జిల్లా ఎస్పీల నుంచి డీజీపీ వరకు విన్నవించారు డిప్యూటీ సీఎం.

ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి రోజా. మహిళలకు రక్షణ కల్పించడంలో హోం మంత్రి ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు మారినట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం, మంత్రులపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త నానిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరు ఎక్కడి నుంచి పోస్టింగులు పెడుతున్నారో డీటేల్స్ సేకరించిన పోలీసులు రంగంలోకి దిగేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ సోషల్ కార్యకర్తలకు కష్టాలు తప్పవనే చెప్పాలి.

 

 

Related News

Modi Lokesh: బాబు తర్వాత లోకేషే.. మోదీ ఆశీర్వాదం లభించినట్టేనా?

Sundar Pichai: వైజాగ్ అందమైన నగరం.. సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు వైరల్

CM Chandrababu: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. డీఏ ప్రకటన, ఎప్పటినుంచి అంటే?

Janasena Internal Fight: పవన్ వద్దకు చేరిన నెల్లూరు జనసేన పంచాయితీ.. టీ గ్లాస్ లో తుఫాన్ ఏ తీరానికి చేరుతుందో?

Investments To AP: నవంబర్ లో CII సమ్మిట్.. YCP కడుపు మంట పెరిగి పోతుందా?

AP Govt on BPS: అనుమతులు లేని ఇళ్లకు క్రమబద్దీకరణ.. బీపీఎస్ పై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Heavy Rains: రానున్న 2-3 గంటల్లో ఉరుములతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్

AP Politics: పవన్ కోసం వర్మ జీరో..? ఆ ఆడియో ఎలా లీకైంది..

Big Stories

×