BigTV English

Gundeninda GudiGantalu Today Episode : బాలును మోసం చేసిన రవి.. శృతితో పెళ్లి..బాలు ఆపుతాడా?

Gundeninda GudiGantalu Today Episode : బాలును మోసం చేసిన రవి.. శృతితో పెళ్లి..బాలు ఆపుతాడా?

Gundeninda GudiGantalu Today Episode : నిన్నటి ఎపిసోడ్ లో మనోజ్ పార్క్ లో దొరికిన కుపన్స్ ను ఇంటికి తీసుకొస్తాడు. వాటిని ఆఫీస్ లో ఇచ్చారని అపద్దాలు చెబుతాడు. వీటితో బట్టలు కొనొచ్చు అని అంటాడు. రోహిణికి బట్టలు కొనాలి అంటాడు. సత్యం అందరికీ బట్టలు కొనాలని అంటాడు. అందరికీ వద్దు అంటుంది ప్రభావతి.. బాలు మీనాలకు ఎందుకు అని అంటుంది. ఇక అందరు కలిసి షాపింగ్ మాల్ కు వెళ్తారు. అప్పుడే కూపన్ మీనాక్షి కూడా అక్కడకు వస్తుంది. ఇక అదే షాప్ కు సంజు శృతిని తీసుకొని వస్తాడు. వీళ్ళతో కలిసి రవి కూడా వస్తాడు. అయితే ఇద్దరు కలిసి లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇక ఇంట్లో వాళ్లు చూసి రవి షాక్ అవుతాడు. వాళ్ళతో కలిసి బట్టలు కోనేదగ్గరే ఉంటాడు. ఇక బాలు పంచులు ఎపిసోడ్ కు హైలెట్ అవుతాయి. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


రోహిణి, ప్రభావతి, మనోజ్ కలిసి షాపింగ్ చేస్తుంటారు. బాలు, మీనా విడిగా చీరలు సెలెక్ట్ చేసుకుంటుంటారు. వారిని చూసి మీ రేంజ్‌కు తగ్గ చీరలు సెలెక్ట్ చేయడం పూర్తయిందా అంటూ మీనాను ఎగతాళి చేసి మాట్లాడుతుంది ప్రభావతి. తక్కువ రేటు చీరలు కట్టుకోవాల్సిన ఖర్మ ఈ బాలుగాడి పెళ్లానికి పట్టలేదంటూ కాలర్ ఎగరవేస్తూ తల్లికి సమాధానమిస్తాడు బాలు. ఇక రోహిణి చీరలు చూస్తుంది. మంచి కాస్లీ లో చీరలు చూపించమని అడుగుతుంది. అప్పుడే ప్రభావతి మీనాకు చీరలు చూసుకో అని ఏవో ఛీప్ గా ఉండేవి చూపించమని అడుగుతుంది. ఇంట్లో ఉండేది కదా దాని మొహానికి ఇదే ఎక్కువ అన్నట్లు ఎత్తి పొడుస్తుంది. అది విన్న మీనా కౌంటర్ వేస్తుంది. మా ఆయన ఉండగా ఇలా చీఫ్ గా ఎందుకు.. తన డబ్బులతోనే మంచి చీరలు కొనిస్తాడు అంటుంది. కరెక్టే గా చెప్పావు మీనా నీకు ఏది నచ్చితే అది తీసుకో నేను నా డబ్బులతో కొంటాను వాళ్ల కుపన్స్ వాళ్లే ఉంచుకోనివ్విలే అంటాడు. ఛీ ఛీ అడవి మనుషులు అని రోహిణి మీనా, బాలును అంటుంది. బాలు మళ్లీ రోహిణి, డబ్బావతికి సెటైర్లు వేస్తాడు. ఇక నచ్చినవి చూస్తుంటారు.

ఇకపోతే అటు సంజు కూడా శృతిని ఎక్కడుందో అని వెతుకుతాడు. రవి నువ్వు ఇలాంటి రావడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు రావు అనుకున్నా వచ్చావు. అవును శృతి ఇక ఎవరి గురించి ఆలోచించాలని అనుకోలేదు. ఇక మీదట ఏం చెయ్యాలో తెలియలేదు అంటాడు. శృతి కంగారు పడకు ఇక మొత్తం నేను చూసుకుంటాను అను చెబుతుంది. అలాగే రవిని బాలు చూస్తాడు. అరె ఏంట్రా నల్ల భీమా ఇలా వచ్చావు అంటాడు. మీకోసం వెతుకుతున్నా అంటాడు. నిజం చెప్పారా అంటే నిజమే చెబుతున్న అంటాడు. ఇక రా అక్కడ అందరు ఉన్నారు అని తీసుకెళ్తాడు. శృతి రవి కోసం పిలుస్తుంది. అటు సంజు కూడా శృతిని వెతుకుతాడు.


ఇకపోతే రవి తీరు పై బాలుకు డౌట్ వస్తుంది. ఎక్కడికి వెళుతున్నావని తమ్ముడిని నిలదీస్తాడు. రవి తడబాటుగా సమాధానం చెప్పడంతో అతడి అనుమానం మరింత బలపడుతుంది. రవి, శృతిలు బాలుకు రెడ్ హ్యాండెడ్‌గా షాపింగ్ మాల్‌లో దొరికిపోతారు. తన వార్నింగ్‌ను పట్టించుకోకుండా శృతిని రవి కలవడంపై బాలు ఫైర్ అవుతాడు. తాను శృతిని పెళ్లిచేసుకోబోతున్నట్లు బాలుకు రవి చెప్పనున్నట్లు తెలుస్తోంది. రవి, శృతి పెళ్లిని బాలు వ్యతిరేకించగా మీనా మాత్రం సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మీనా శృతిని చూసి షాక్ అవుతుంది. పెద్దలకు తెలియకుండా రవి, శృతి సీక్రెట్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపించబోతున్నారు.. వీరిద్దరి విషయం తెలుసుకున్న మీనా షాక్ అవుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మరోవైపు షాపింగ్ కూపన్స్ విషయంలో మనోజ్ ఆడిన అబద్ధం కూడా బయటపడుతుంది. దాంతో రోహిణి హర్ట్ అవుతుంది. తనను పెళ్లి పేరుతో మోసం చేసిన శృతిపై సంజు పగను పెంచుకున్న సంజు రవిని చంపేస్తాడా లేదా శృతిని బలవంతంగా పెళ్లి చేసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.  బాలు వీళ్ళ పెళ్లిని ఆ పే ప్రయత్నం చేస్తాడా ? లేక వీళ్ళ పెళ్లిని దగ్గరుండి చేస్తాడా అన్నది రేపటి ఎపిసోడ్ లో ఆసక్తి గా ఉండబోతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×