BigTV English

Fire Cracker Factory Explosion: తమిళనాడు.. టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Fire Cracker Factory Explosion: తమిళనాడు.. టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Fire Cracker Factory Explosion: తమిళనాడులోని ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లాలో చతుర్ వద్ద బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి.


ఫ్యాక్టరీ‌లో ఉన్న కార్మికులను రక్షించడానికి ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి.  అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మందుగుడు సామాగ్రి ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి ఐదు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అనేది ఇంకా తెలియాల్సివుంది.

ఈ ఏడాది మే నెలలో కూడా ఇదే జిల్లాలో బాణ సంచా ఫ్యాకర్టీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. ఆ ఘటన నుంచి ఇప్పుడిప్పు డే కార్మికులు తేరుకునే లోపు మరో ఘటన చోటు చేసుకుంది.


దీపావళి దగ్గర పడుతుండడంతో ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీ ఎలాంటి ఘటనలు జరగ కుండా ఉండేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది. అయినా వర్కర్ల కారణంగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఫైర్ క్రాకర్స్‌కు కేరాఫ్ తమిళనాడు లోని శివకాశి. అక్కడ మూడు, నాలుగు జిల్లాల్లో బాణసంచా కంపెనీలు ఉన్నాయి. అక్కడ పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు భారీ ఎత్తున వస్తుంటారు.

ALSO READ: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

దీపావళితోపాటు మిగతా ఫెస్టివల్‌కు బాణాసంచా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డర్ల నేపథ్యంలో కూలీలను రప్పించుకుని పనులు చేయిస్తాయి సంబంధిత కంపెనీ యజమాన్యాలు. బాణసంచా తయారీ కార్మికులకు తగిన నైపుణ్యం లేకపోవడంతో తరచూ అక్కడ ఘటనలు జరుగుతున్నాయి.

ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ఆయా కంపెనీలను తనిఖీ చేస్తుంటారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే కెమికల్స్ మిస్సింగ్ చేసే సమయంలో ఒక్కో కార్మికుడి భారీ ఎత్తున సామాగ్రి ఇవ్వడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతీ ఏటా వందల సంఖ్యలో అక్కడ కార్మికులు మృత్యువాత పడుతున్న విషయం తెల్సిందే.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×