E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 3rd: బాలు మౌనిక వస్తుంది తనకు రాఖీ కడుతుంది అని గేటు బయట కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు ఎంతగా చెబుతున్నా సరే బాలు మాత్రం తనకు చెల్లెలు రాఖీ కట్టాలి అని బాధపడిపోతూ ఉంటాడు. మౌనికని లోపలికి తీసుకెళ్లిన సంజయ్ మీ అన్నయ్యకి రాఖీ కట్టావనుకో వాళ్ళిద్దర్నీ చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు.. ఇక దాంతో మౌనిక బయటకు వెళ్లి బాలుతో కఠినంగా మాట్లాడుతుంది. నీకోసం వచ్చానమ్మా నువ్వు రాఖీ కడితే.. ఈ చీర నేను నీకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాను అని ఆ చీర ఇవ్వగానే మౌనిక నీకు ఎన్ని సార్లు చెప్పిన బుద్ధి రాదా.. అని అంటుంది. ఆ మాట వినగానే బాలు చాలా బాధపడిపోతాడు.. ఇదొక ముష్టి చరణ మా ఇంట్లో ఇలాంటివి పని వాళ్ళకి ఇస్తాను అంటూ గోరంగా అవమానించాలా మాట్లాడుతుంది ఆ మాట వినగానే బాలు బాధపడిపోతాడు.

బాలును అవమానించిన ప్రభా..

బాలు ఇంట్లోకి రాగానే బాధపడిపోతూ ఉంటాడు. మీనా రాఖీ కట్టించుకున్నారు కదా అని చాలా సంతోషంగా ఇంట్లోని వాళ్ళందరినీ పిలుస్తుంది. కానీ బాలు మాత్రం చాలా డల్ గా ఉండడంతో ఏమైందండీ ఎందుకు మీరు అంత బాధ పడిపోతున్నారు. అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది.. చెప్పండి ఏం జరిగిందో అంత మౌనంగా ఉన్నారంటే ఏదో జరిగే ఉంటుంది అని మీనా ఎంత అడిగినా కూడా బాలు మాత్రం నోరు మెదడు కానీ ప్రభావతి మాత్రం వారిని చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేసారని… ఇంకా కొత్తగా ఏం చెప్పాలి అని ప్రభా అంటుంది. కానీ బాలు మౌనిక వాళ్ళకి రాఖీ కట్టి నాకు రాఖీ కట్టలేదమ్మా అని చెప్పగానే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని నేను అక్కడికి వెళ్ళద్దని చెప్పాను అని ప్రభావతి అంటుంది.

ప్రభకు మీనా స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

బాలు బిక్షగాడిలెక్క గేటు బయట నిల్చబెట్టి పంపించేసారా అందుకే నేను అక్కడికి వెళ్లి అవమానపడడం అవసరమా అని ముందే చెప్పాను అని ప్రభావతి అంటుంది. కానీ మీనా మాత్రం మా ఆయనని ఇంతగా అవమానించిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను.. ఎవరైతే మా ఆయనకు రాఖీ కట్టించెను అని అన్నారో వాళ్ల చేత మా ఆయనకు రాఖీ కట్టిస్తాను మౌనికని బాధపెట్టిన వాళ్ళని అస్సలు ఊరుకోను వదిలిపెట్టను. ఏంటే శబదాలు చేస్తున్నావా? నీ శబదాలకి ఇక్కడ ఎవరు భయపడరు అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు.. నువ్వు వాళ్ళింటి గేటు కూడా తొక్క లేవు అని ప్రభావతి ఎంత చెప్పినా సరే.. మీనా మాత్రం నేనేంటో నిరూపించుకునే సమయం వచ్చేసింది కచ్చితంగా వాళ్ళని తీసుకొని వస్తాను అని అక్కడికి వెళ్ళిపోతుంది. ప్రభావతి ఇది ఇంతగా మాట్లాడుతుందే ఏమైంది దీనికి? ఖచ్చితంగా చేస్తుందా లేదా అని అనుమానంగా చూస్తూ ఉంటుంది..

మీనా ప్లాన్ అదుర్స్..

మీనా ముందుగా శృతిని ఒక వీడియో తీయమని చెప్తుంది.. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టేముందు మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ తర్వాత దీన్ని సోషల్ మీడియాలో పెడదామని మీనా అంటుంది. సంజయ్ అక్కడ ఉన్న వాళ్ళకి రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు చెప్తూ ఉంటాడు. రాఖీ గురించి గొప్పగా చెప్తున్న సంజయ్ దగ్గరికి మీనా అలాగే శృతి వెళ్లి ఆ నాటకానికి ఇంకాస్త రక్తి కట్టిస్తారు.. మీనా శృతి ఇద్దరు కలిసి సంజు కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తారు. ముగ్గురు రాఖీ గురించి మాట్లాడుకుంటూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. మీనా శృతి చెప్పిన డైలాగులు నాచురల్ గా ఉన్నాయని ఆ డైరెక్టర్ తెగ పొగిడేస్తుంటాడు.. అయితే అక్కడ సంజు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటాడు.. కానీ మీనా చెప్పిన మాటతో సంజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ఇక్కడ మీ పరువు తీయడం మాకు ఇష్టం లేదు మీతో మాట్లాడాలి అని నేను అంటుంది..

సంజయ్ కు దిమ్మతిరిగే షాక్..

Advertisement

మీతో ఒకసారి మాట్లాడాలి బయటికి రండి అని అందరి ముందర చాలా మర్యాదగా మాట్లాడిన మీనా బయటికి తీసుకెళ్లగానే శృతి రికార్డ్ చేసిన వీడియోని చూపిస్తుంది. అది చూసిన సంజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఆ వీడియోని తీశారు అని చెప్పగానే నీలకంఠం కూడా ఆ వీడియోని చూసి మా వాడి రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది అని అంటాడు అయితే ఈ వీడియోని మేము సోషల్ మీడియాలో పెట్టకూడదు అంటే మౌనిక చేత మా ఇంటికి తీసుకువచ్చి మరి మా ఆయనకు రాఖీ కట్టించాలి అని మీనా అంటుంది.. ఇంట్లోకి మీనా శృతి రాగానే ప్రభావతి అవమానించేలా మాట్లాడుతుంది. కానీ సంజయ్ మౌనిక వాళ్ళు వచ్చారని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×