BigTV English

Gundeninda Gudigantalu: మీనా పై కక్ష్య పెంచుకున్న ప్రభావతి.. రోహిణి నిజస్వరూపం ఇదే..

Gundeninda Gudigantalu: మీనా పై కక్ష్య పెంచుకున్న ప్రభావతి.. రోహిణి నిజస్వరూపం ఇదే..

Gundeninda Gudigantalu: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాతో రోహిణి ప్రభావతి మీనాతో గొడవ పడతారు. పూరి చేసిందని పెద్ద యుద్ధమే చేస్తారు. పూరి హెల్త్ కు మంచిది కాదని రోహిణి చెప్పడంతో అందరు పూరి తినకుండా వెళ్తారు. బాలు మీనాను కోపంగా తిడతాడు. తాను ఏం చేసిన తినను అని చెప్తాడు. దానికి మీనా ఫీల్ అవుతుంది. సత్యం చెప్పినా బాలు వినడు.. ఈ వారం మొత్తం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..


ఈ వారం మొదటి రోజు సోమవారం ఎపిసోడ్లో తన తండ్రి హాట్ ఆపరేషన్ కొరకు బాలు తన తల్లి ప్రభావతి గాజులను తాకట్టు పెట్టి డబ్బులను తీసుకొని వస్తాడు. తమ మామయ్య ఆపరేషన్ సక్సెస్ కావాలని మీనా గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటుంది. ప్రభావతి,రోహిణిలు దేవుడ్ని ప్రార్థించడానికి అదే గుడికి వస్తారు. అక్కడికి వెళ్లి తన మామయ్యకు బాగుండాలని కోరుకుంటుంది. డాక్టర్ బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని చెబుతారు. అదే సమయంలో తన తండ్రి ఆరోగ్యం గురించి మాట్లాడాలని బాలు మనోజులను డాక్టర్ వారిని పిలుస్తాడు. సత్యంకు బాగుండాలని తాయత్తు కట్టాలని అనుకుంటుంది. రంగా సాయంతో తాయత్తు కడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక మంగళవారం ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. రవిని సత్యంను కలవడానికి, మాట్లాడటానికి లోపలికి పంపరు.. అది గుర్తు చేసుకొని బాధ పడుతూ ఉంటాడు. శృతి అతన్ని ఓదారుస్తుంది. ఆపరేషన్ సక్సెస్ కావడంతో సత్యం స్పృహలోకి వస్తాడు. దీంతో ప్రభావతి సంతోషం పట్టలేక ఏడుస్తుంది. ఆ తరువాత సత్యం ఆరోగ్య పరిస్థితి గమనించి, డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. ఇలా ఇంటికి చేరుకున్న సత్యం.. మొదటగా బాలుతో రోహిణికి సారీ చెప్పిస్తాడు.. డబ్బుల కోసం బాలు కారును అమ్మేసాడని తెలుసుకొని సీరియస్ అవుతాడు. ఇంటి పత్రాలు పెట్టి తీసుకొని రావాల్సింది అని అడుగుతాడు. మీనా వాటిని తీసుకొని పారిపోయిందని అంటే సత్యం అసలు నిజం బయటకు చెప్తాడు. మీనా ఆ పత్రాలను నాకు ఇచ్చేసిందని చెబుతాడు.


ఇక బుధవారం ఎపిసోడ్ లో తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బాలు తన అత్తగారింటికి వెళ్లాడు. మీనాను పంపించానని అడుగుతాడు. కానీ, తాను మాత్రం ఆ ఇంట్లో కాలు పెట్టనని, చెయ్యనీ తప్పుకు తనని నిందిస్తున్నారని బాధపడుతుంది మీనా. పోలీస్ స్టేషన్లో తనపై చేయి చేసుకున్నావనీ, ఇంట్లో నుండి గెంటేయించావనీ, హాస్పిటల్లో అవమానించావని బాలుపై ఆగ్రహానికి గురవుతోంది మీనా.. ఇంట్లో వస్తువులు ఎలా ఉన్నాయో నువ్వు అంతే అని బాలు మీనాను బాధ పెట్టొద్దు అని బాలుకు సత్యం హిత బోధ చేస్తాడు. అలాగే అని సత్యంకు చెప్పి మళ్లీ అదే చేస్తాడు బాలు..

ఇక తర్వాత రోజు గురువారం ఎపిసోడ్‌లో ఇంటికి తిరిగి వచ్చిన మీనాపై ప్రభావతి నానా నిందలు వేస్తూ అవమానిస్తుంది. ఇంట్లో జరుగుతున్న అన్ని అనర్ధాలకు మీనానే కారణమంటూ తిడుతోంది. ఇక బెడ్రూం లోకి వెళ్లిన తరువాత బాలు కుడా మీనాపై నిందలు వేస్తూ.. నానా మాటలు అంటూ అవమానిస్తాడు. తనతో మాట్లాడవద్దని వార్నింగ్ ఇస్తాడు. రవి పెళ్లి తాను చేయలేదని.. మీనా చెప్పిన బాలు అసలు వినిపించుకోడు.. ఇక మీనా ఫీల్ అవుతుంది. త్వరలోనే నా గురించి తెలుసుకుంటాడని మీనా అనుకుంటుంది.

శుక్రవారం ఎపిసోడ్ లో మీనా ఇంట్లో అందరికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని అనుకుంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర రోహిణి రెచ్చిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ లో పూరీలు లాంటి ఆయిల్ ఫుడ్ చేయొద్దని, అలాంటివి ఆరోగ్యానికి మంచిది కాదని మీనా పై ఫైర్ అవుతోంది. ఈ సమయంలో ప్రభావతి తన పెద్దకోడలు రోహిణికి సపోర్టుగా మాట్లాడుతుంది. ఆయిల్ ఫుడ్ తినడం వల్లే తన భర్త ఆరోగ్యం కూడా చెడిపోయిందని రోహిణికి వత్తాసు పలుకుతుంది. తాను బాలు కోసం పూరీలు చేశానని చెప్పగా.. నేను పూరి చెయ్యమని చెప్పలేదు నాకొద్దు అంటాడు.

ఇక శనివారం ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా చేసిన పూరి వల్ల ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. ఇక రోహిణి కూడా మీనా చేసిన పూరి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంది. ప్రభావతి సెటైర్స్ ఎపిసోడ్ కు హైలెట్ అవుతాయి. ఇక పూరి వద్దని జ్యుస్ ఇస్తాను అని ప్రభావతి, మనోజ్ లను తీసుకొని వెళ్తుంది.నీ చేతితో చేసిన పూరీలు తినే అద్రుష్టం లేదులే అంటు సత్యం సర్థి చెప్పుతాడు సత్యం. మరోసారి బాలు ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు.ఈ సమయంలో మీనాకు బాలుకు మధ్య వాద్వాగ్దం జరుగుతోంది. మీనా తన తల్లితో ఫోన్ మాట్లాడడానికి చూసిన ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది.. ఇంట్లో నుంచి నువ్వు ఎప్పుడైన బయటకు వెళ్ళాల్సిందే అని హెచ్చరిస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×