E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు సాగర్ వార్నింగ్.. భాగ్యం, శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు సాగర్ వార్నింగ్.. భాగ్యం, శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 16th: సాగరు చూసావా నర్మదా ఆయన నేను ఎంతో ప్రేమతో తెచ్చిన బట్టల్ని కాల్చివేశాడు. నేను తెచ్చిన ఆ బట్టలను చూస్తుంటే ఆయనకు పదేపదే దొంగతనం గుర్తుకొస్తుందట. ఇంతగా అవమానాలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఆరోజు నువ్వు అడ్డుపడ్డావు కాబట్టి ఆగాను.. ఇప్పుడు నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి కదా పద వెళ్లిపోదామని సాగర్ ఎంత చెప్తున్నా సరే.. నర్మద మాత్రం ఏంటి సాగర్ కోపంలో ఏదో అంటే అది పట్టించుకుంటావా అని అంటుంది. నేనెంత బాధపడాలని ఆలోచించవా అని నర్మదా కూడా అంటుంది. ఏంటి నువ్వు కూడా నాకు క్లాస్ పీకుతున్నావా..? నాతో వస్తావా రావా అని సాగర్ నర్మదకు వార్నింగ్ ఇస్తాడు. అయితే సాగర్ మాత్రం ఎంత చెప్తున్నారు నర్మద వినదు.. నాతోపాటు ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తావా రావా అని సాగర్ నర్మదను అడుగుతాడు.. నువ్వు జాబ్ మానేస్తే నీతో పాటు వచ్చేస్తాను అని నర్మదా అంటుంది..

నర్మదకు వార్నింగ్.. 

నువ్వు ఎందుకు ఇప్పుడు రానంటున్నావ్? నేనైతే ఈ జాబ్ మానేయ్యను నా నిర్ణయాన్ని మార్చుకోను అని సాగర్ అంటాడు. అత్తయ్య గారు ఇప్పుడు ఇంట్లో లేరు. ఆవిడ లేనప్పుడు వెళితే అస్సలు బాగోదు ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేయాలనుకుంటుందో చూద్దాం అని నర్మదా అంటుంది. సంతోషంగా ఉండడానికి వెళ్లిన అత్తయ్య బాధపడుతూ ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు ఏదైనా సరే ఆవిడ వచ్చిన తర్వాత మాట్లాడదామని సాగర్ ని ఆపే ప్రయత్నం చేస్తుంది.. అయితే అమ్మ వచ్చిన తర్వాత చెప్పి మనం ఇకనుంచి వెళ్ళిపోవాల్సిందే అని సాగరంటాడు.

భాగ్యం,శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

Advertisement

నర్మద కాపురంలో చిచ్చు పెట్టేసాం కాబట్టి మనం చాలా హ్యాపీగా ఉన్నాము అని శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఉంటారు. నా కూతురు చేత కాళ్లు పట్టించుకోవడం మాత్రమే కాదు. కాపురంలో చిచ్చు పెట్టాలని కూడా చూస్తే నేను ఎందుకు వదులుతాను. అందుకే దాని కాపురం లోనే చిచ్చు పెట్టాను అని శ్రీవల్లి నర్మదా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అయితే నన్ను మా ఆయన ఇంట్లోంచి పంపించిన బాధపడ్డాను కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను అని శ్రీవల్లి కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది.

ప్రేమ, నర్మద ఎమోషనల్..

నర్మదా బయట కూర్చుని సాగర్ అన్న మాటని తలుచుకొని బాధ పడిపోతూ ఉంటుంది. వచ్చిన ప్రేమ బాధపడకు అక్క అంత మంచే జరుగుతుంది అత్తయ్య వచ్చిన తర్వాత అన్ని చూసుకుందాం అని ఎంత అంటునా సరే సాగర్ మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అంటున్నాడు అని అంటుంది. సాగర్ కి ఎంత చెప్పినా సరే అసలు వినడం లేదు అత్తయ్య లేదు అని ఏదో ఒకటి చెప్పి ఆపేశాను కానీ అత్తయ్య వచ్చిన వెంటనే ఇక నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు అని అంటుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే మేము ఎందుకు చూస్తూ ఉంటాము పోయినసారి ఎలాగైతే తీసుకొచ్చాము. ఇప్పుడు కూడా అలాగే తీసుకొని వస్తాము మీరు ఏమి బాధపడకండి అని ప్రేమ అంటుంది. అన్నదమ్ములు అందరూ కూడా బాధ పడిపోతూ ఉంటారు.

శ్రీవల్లిని చచ్చిపోమ్మన్న చందు..

Advertisement

అమ్మ మీద ఆశలు పెట్టుకుంటే నేను ఇట్లే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది మా ఆయనకు ఒకసారి ఫోన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంది. ఇందు కి ఫోన్ చెయ్ కానీ అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేస్తావో నాకు అసలు ఫోన్ చేయకు అని వార్నింగ్ ఇస్తాడు. శ్రీవల్లి మాత్రం తన భర్తని ఎలాగైనా దగ్గర చేసుకోవాలి అని అనుకుంటుంది.. నువ్వు లేకుండా నేను ఉండలేను బావ చచ్చిపోతాను బావ అంటే అయితే చచ్చిపో అని అంటాడు.. ఆ మాట వినగానే శ్రీవల్లి మా బావ లేకుండా నేను బతకలేను అని, ఒక కత్తి తీసుకొని ఆనందరావు భాగ్యం మీదకు వెళుతుంది ఇక భాగ్యం కంట్రోల్ చేయడంతో శాంతించిన శ్రీవల్లి తన మర్డర్ ప్లాన్ ని ఆపేస్తుంది.

ప్రేమ, ధీరజ్ ఫైట్..

ప్రేమకు ధీరజు జడవేస్తూ ఉంటాడు. కానీ ప్రేమ అటు ఇటు కదలడంతో ధీరజ్ అలా కదిలితే నేను జడ వేయలేను అని అంటాడు.. ప్రేమ మొత్తానికి కామ్ గా కూర్చోవడంతో జడలు వేసి దయ్యం లాగా తయారు చేస్తాడు ధీరజ్. అది చూసిన ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ధీరజ్ని తరుముకుంటూ బయటకు వెళ్తుంది వీళ్లిద్దరి కన్వర్జేషన్ కాస్త ఎపిసోడ్ కి హైలెట్గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో భాగ్యంకి నర్మదా ప్రేమలు చుక్కలు చూపిస్తారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Intinti Ramayanam Today Episode: అవనికి శ్రీయ వార్నింగ్.. గుడ్ న్యూస్ చెప్పిన భరత్..శ్రీకర్, శ్రీయల మధ్య గొడవ..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×