E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు షాకిచ్చిన రామరాజు.. చందు పై అనుమానం.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు షాకిచ్చిన రామరాజు.. చందు పై అనుమానం.. భాగ్యంకు మైండ్ బ్లాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 17th: ప్రేమకు ధీరజు జడవేస్తూ ఉంటాడు. కానీ ప్రేమ అటు ఇటు కదలడంతో ధీరజ్  అలా కదిలితే నేను జడ వేయలేను అని అంటాడు.. ప్రేమ మొత్తానికి కామ్ గా కూర్చోవడంతో జడలు వేసి దయ్యం లాగా తయారు చేస్తాడు ధీరజ్. అది చూసిన ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ధీరజ్ని తరుముకుంటూ బయటకు వెళ్తుంది వీళ్లిద్దరి కన్వర్జేషన్ కాస్త ఎపిసోడ్ కి హైలెట్గా నిలుస్తుంది..

నర్మదను దూరం పెట్టిన రామరాజు..

నర్మదా తిరుపతి రామరాజు అమూల్య మాట్లాడుకుంటూ కాఫీ తీసుకొని వస్తుంది.. అయితే రామరాజు మాత్రం చాలా కోపంగా ఉంటాడు. మావయ్య గారు కాఫీ తీసుకోండి అని నర్మదా అనగానే అయీష్టంగా అక్కడ పెట్టమ్మా అని అంటాడు.. తిరుపతి కూడా కాఫీ అడగ్గానే నర్మద కాఫీ ఇస్తుంది.. మావయ్య గారు మీరు రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా అని నర్మదా అడుగుతుంది. లేదు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటాడు. అయితే నర్మదా దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న సరే రామరాజు మాత్రం మాట్లాడకుండా ఉండడంతో ఫీల్ అవుతుంది. అమూల్య కాలేజీకి వెళ్తుంటే నువ్వు మీ అమ్మ వచ్చే అంతవరకు ఇంట్లోనే ఉండమ్మా అని అంటాడు.. నర్మదా ఎంత చెప్తున్నా సరే.. రామరాజు మాత్రం మాట వినడు.

చందుపై అనుమానం..

Advertisement

చందు నేను రైస్ మిల్ కి వెళ్ళొస్తాను నాన్న అని అంటాడు.. అదేంట్రా ఒకసారి మళ్ళీ దగ్గరికి వెళ్లి మీ అత్తయ్య గారికి ఎలా ఉందో కనుక్కొని రావచ్చు కదా అని రామరాజు అడుగుతాడు. చందు మాత్రం వల్లి పేరు వినగానే తడబడుతూ కోపంగా ఉంటాడు. ఏంట్రా వల్లి పేరు చెప్పగానే అలా భయపడుతూ కంగారు పడుతూ ఉన్నావు. ఏం జరిగింది మీరిద్దరు గొడవపడ్డారా ఏంటి అని రామరాజు అడుగుతాడు. గొడవలు అదేం లేదు నాన్న వాళ్ళ అమ్మగారికి బాగోలేదు కదా అక్కడే ఉంది అని చందు ఎంత చెప్తున్నా సరే రామరాజు మాత్రం అనుమానంగానే ఫీల్ అవుతాడు.. మరి వాళ్ళ అమ్మని చూడ్డానికి నువ్వెందుకురా అంత కంగారు పడుతున్నావ్ పెళ్లి వాళ్ళ అమ్మని చూసి రావచ్చు కదా అనేసి రామరాజు అడుగుతున్న సరే నాకు మిల్లులో పని ఉందని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

ధీరజ్ మాటతో చందు సేఫ్..

ఏంట్రా వీడు వాళ్ళ అత్తయ్య గారికి బాగోలేదు అంటే చూసి వల్లిని తీసుకురమ్మని చెప్తున్నా సరే ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని రామరాజు డౌట్ పడతాడు.. వాళ్ళ అమ్మకి బాగాలేదు కదా నాన్న అందుకు ఇప్పుడు మనం తనని తీసుకొని వస్తే తన మనసంతా అక్కడే ఉంటుంది కదా అని అన్నయ్య ఫీలవుతున్నాడేమో అని ధీరజ్ అంటాడు. అయితే రామరాజు వాడి వల్లకపోయినా మనం వెళ్ళాలి కదరా మనం ఒకసారి వెళ్లి అక్కడ ఏం జరిగిందో చూసేసి వద్దామని అంటాడు.. సరే నాన్న వెళ్లేసొద్దాం పదండి అక్కడ నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని ధీరజ్ అంటాడు.

భాగ్యం ప్లాన్ రివర్స్.. 

Advertisement

భాగ్యం వల్లికి కాలు విరిగింది అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. ఏంటమ్మా ఈ కర్రీ ఏంటి కత్తి ఏంటి అని మళ్ళీ అడుగుతుంది.. నీ కాలికి గాయం అయింది లేదా కాలు విరిగింది అని చెప్తే నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు కదా అందుకే ఈ ప్లాన్ చేస్తున్నాను అని అంటుంది.. ఏం సారి ఒక ప్లాన్ చేశావు. అది బెడిసి కొట్టి దాంట్లో మనం ఎక్కడ దొరికిపోతాం అని భయంగా ఉంది అని అంటుంది.. ఇకపోతే అందరూ కలిసి భాగ్యమును చూడ్డానికి అని అక్కడికి వెళ్తారు. అది చూసిన ఆనందరావు మనం చేయాలి అనుకుంటే మన కన్నా ముందే వాళ్ళు వస్తున్నారు కదా.. ఎలాగైనా సరే ఈ నాటకం రెట్టి కట్టించాలని అందరూ కలిసి భాగ్యంకి దెబ్బ తగిలినట్టు ప్లాన్ చేస్తారు.

దీరజ్ మాటతో వల్లి షాక్..

ఇక రామరాజు వాళ్ళు రాగానే భాగ్యం నిజంగానే కాలు నొప్పి వచ్చి బాధపడిపోతున్నట్లు యాక్ట్ చేస్తుంది. అయితే రామరాజు అక్కడికి వెళ్లి ఎలా ఉంది అమ్మ అని పలకరించి మాట్లాడుతాడు. అయితే ఇంతకీ ఏ కాలికి దెబ్బ తగిలిందని రామరాజు వాడగానే వాళ్ళు ముగ్గురు కూడా పొంతనలేని సమాధానం చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఇక ఇవిగోనమ్మ ఆపిల్స్ మీ అమ్మకి జ్యూస్ చేసి ఇవ్వు అని రామరాజు ఇవ్వగానే నాన్న ఆపిల్స్ గురించి మీకు తెలియదు అని ధీరజ్ పెద్ద స్టోరీ చెప్తాడు. మాట వినగానే వల్లి షాక్ అవుతుంది. సర్లే మా అది ఇది అంటున్నారు కదా ఈ ఆపిల్స్ నేనే తీసుకొని వెళ్తాను అని రామరాజు అంటాడు.

ధీరజ్ కేరళ వైద్యం అదుర్స్..

ఇంక తగ్గిపోయిందేమో మాకు కోడల్ని మా ఇంటికి తీసుకెళ్దాం అని నేను అనుకున్నాను. అని అనగానే మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మళ్లీ ఇదే మంచి ఛాన్స్ అని ఎంతగా ప్రయత్నించినా సరే మిగిలిన వాళ్ళందరూ కూడా మీ అమ్మకి ఇలా ఉంటే ఎలా వస్తావు అక్క అని అంటారు. దాంతో వల్లి షాక్ అయిపోతుంది.. అయితే రామరాజు పదండ్రా ఇంకా వెళ్దామని అనగానే ఆగు నాన్న నేను ఒక చిన్న కేరళ వైద్యం గురించి చెప్పేసి వస్తాను నువ్వు వెళ్ళు అని ధీరజ్ అంటాడు. వెళ్లి అక్కడ ఉన్న ఒక కర్రను తీసుకొని వచ్చి కొట్టబోతాడు అయితే నేను కాదు వదిన ఈ వైద్యం చేస్తుంది అని చెప్పగానే వల్లి భాగ్యం ఇద్దరు కూడా షాక్ అవుతారు. భాగ్యంకి ఎంత కొట్టినా సరే నొప్పి లేదు అని అంటుంది దాంతో వాళ్ళు ఇంకా చితక్కొట్టేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ ధీరజుల మధ్య దూరం పూర్తిగా దూరం అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: భరత్ ఫుల్ హ్యాపీ.. ఇంట్లోంచి వెళ్లిపోయిన శ్రీయ.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×