E-Paper
Advertisement

‘పాపం ప్రతాప్’ సమస్య ఉందో లేదో కానీ, ప్రేక్షకుడికి మాత్రం వచ్చింది.. అది ఏంటో తెలియాలంటే?

‘పాపం ప్రతాప్’ సమస్య ఉందో లేదో కానీ, ప్రేక్షకుడికి మాత్రం వచ్చింది.. అది ఏంటో తెలియాలంటే?
Advertisement

Papam Prathap review: ఈటీవీ విన్ (ETV Win) అనగానే మన ఇంట్లో మనిషిలాంటి కంటెంట్ వస్తుందని ఆశిస్తాం. కానీ ‘పాపం ప్రతాప్’ చూశాక, ఆ నమ్మకం కాస్త నీరుగారిందనే చెప్పాలి. తిరువీర్ లాంటి టాలెంటెడ్ నటుడు ఉండటంతో గిన్నెలు మస్తు వేడెక్కుతాయని థియేటర్‌కి వెళ్తే, అక్కడ సినిమా కంటే మన బుర్రలే ఎక్కువ వేడెక్కాయి. మంచి హైప్ ఇప్పిన ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

Read also-Illu Illalu Pillalu Today Episode: నర్మదకు షాకిచ్చిన రామరాజు.. చందు పై అనుమానం.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

కథ

Advertisement

కథ విషయానికి వస్తే.. ఇది 90వ దశకంలో సాగే ఒక పల్లెటూరి డ్రామా. ప్రతాప్ (తిరువీర్) కి బుజ్జమ్మ అంటే ప్రాణం. ఎన్నో కష్టాలు పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ విధి వైపరీత్యం ఏంటంటే.. పెళ్లైన మూడు రోజులకే బుజ్జమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. దానికి కారణం ప్రతాప్‌లో ఏదో ‘సమస్య’ ఉందంట! ఆ సమస్య ఏంటో ఆమె ఎవరికీ చెప్పదు, దీని గురించి పంచాయితీ కూడా పెట్టింది. అది ఏంటో ప్రతాప్ స్వయంగా తెలుసుకోవాలట. ఈ సిల్లీ పాయింట్ చుట్టూ సినిమా మొత్తం సాగదీయడమే డైరెక్టర్ చేసిన పెద్ద సాహసం. మరి ఆ సాహసం ఫలించిందో లేదో ప్రేక్షకులే చెప్తారు.

నటీనటులు

‘మసూద’ లాంటి సినిమాలతో మెప్పించిన తిరువీర్, ఇందులో అమాయకపు ప్రతాప్‌గా బాగానే చేశాడు. కానీ ఆయన పాత్రను రాసుకున్న తీరు వల్ల నటన కంటే టార్చరే ఎక్కువగా అనిపిస్తుంది. అజయ్ ఘోష్, గోపరాజు రమణ లాంటి దిగ్గజ నటులు ఉన్నా, వారిని సరిగ్గా వాడుకోలేదు. ముఖ్యంగా ఆ విలేజ్ క్యారెక్టర్స్ చేసే అతి, హీరో కంటే ఎక్కువ సీన్ చేస్తూ ప్రేక్షకులకు నరకం చూపిస్తుంది.

విశ్లేషణ

Advertisement

డైరెక్టర్ అసలు ఏ ఉద్దేశంతో ఈ కథను ఎంచుకున్నారో అర్థం కాదు. 90ల కాలం నాటి వాతావరణం సెట్ చేయాలని చూశారు కానీ, కథలో దమ్ము లేకపోవడంతో ఆ ప్రయత్నం వృథా అయ్యింది. స్క్రీన్ ప్లే ఎంత నెమ్మదిగా సాగుతుందంటే, సినిమా చూస్తుంటే కాలం స్తంభించిపోయిందా అన్నట్టు ఉంటుంది. కామెడీ పేరుతో చేసిన ప్రయత్నాలు వికటించాయి. ఇక షకీలా మేటర్ లాంటివి తెచ్చి, దీన్ని ఫ్యామిలీ సినిమాగా ఉంచాలో లేక బీ-గ్రేడ్ సినిమాగా మార్చాలో తెలియని అయోమయంలో పడ్డారు.

Read also-ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన హిందీ డార్క్ కామెడీ… ఇరగదీసిన రాజ్ కుమార్ రావ్

బలాలు..

  • తిరువీర్ పర్ఫార్మెన్స్
  • పల్లెటూరి వాతావరణం

బలహీనతలు..

  • సాగదీత
  • లాజిక్ లేని పాయింట్
  • కన్ఫ్యూజన్

అసలు మచ్చట.. టైటిల్ ‘పాపం ప్రతాప్’ అని పెట్టారు కానీ, నిజానికి అది ‘పాపం ప్రేక్షకులు’ అని పెట్టాల్సింది. గిన్నెలు వేడెక్కుతాయనుకుంటే, అసలు పొయ్యే ఆరిపోయింది!

Papam Prathap Movie Review And Rating  – 1.75/5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×