E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: భాగ్యంకు బడిత పూజ.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాకిచ్చిన ధీరజ్.. ప్రేమకు సర్ప్రైజ్..

Illu Illalu Pillalu Today Episode: భాగ్యంకు బడిత పూజ.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాకిచ్చిన ధీరజ్.. ప్రేమకు సర్ప్రైజ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 18th: భాగ్యంను చూడటానికి వాళ్ల ఇంటికి వెళ్తారు.. రామరాజు కుటుంబం.. అంతేకాదు.. శ్రీవల్లిని ఇంటికి తీసుకొని వెళదామని అనుకున్నాం అని రామరాజు అంటాడు. వల్లి ఇదే మంచి ఛాన్స్ అని ఎంతగా ప్రయత్నించినా సరే.. మిగిలిన వాళ్ళందరూ కూడా మీ అమ్మకి ఇలా ఉంటే ఎలా వస్తావు అక్క అని అంటారు. దాంతో వల్లి షాక్ అయిపోతుంది.. అయితే రామరాజు పదండ్రా ఇంకా వెళ్దామని అనగానే ఆగు నాన్న నేను ఒక చిన్న కేరళ వైద్యం గురించి చెప్పేసి వస్తాను నువ్వు వెళ్ళు అని ధీరజ్ అంటాడు. వెళ్లి అక్కడ ఉన్న ఒక కర్రను తీసుకొని వచ్చి కొట్టబోతాడు. అయితే నేను కాదు వదిన ఈ వైద్యం చేస్తుంది అని చెప్పగానే వల్లి భాగ్యం ఇద్దరు కూడా షాక్ అవుతారు. భాగ్యంకి ఎంత కొట్టినా సరే నొప్పి లేదు అని అంటుంది. దాంతో వాళ్ళు ఇంకా చితక్కొట్టేస్తారు..

ధీరజ్ దెబ్బకు భాగ్యం మైండ్ బ్లాక్..

భాగ్యంకు కర్రతో బుద్ధి చెప్పాలి అని ధీరజ్ చేసిన ప్లాను దాదాపు వర్కోట్ అయినట్లే.. భాగ్యం గురించి తెలుసుకున్న ధీరజ్ అలాంటి ప్లాన్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కానీ నర్మదా కొట్టిన దెబ్బలకి భాగ్యం ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో శ్రీవల్లిని కొడితే బాగుంటుంది అని ధీరజ్ చెప్పగానే భాగ్యం ఒక్కసారిగా బెంబేలెత్తుతుంది… వద్దు అమ్ముడు అని ఎంతగా చెప్తున్నా సరే శ్రీవల్లి మాత్రం ఎక్కడ డౌట్ వస్తుందో అని కర్రతో వాళ్ళ అమ్మని చితక్కొట్టేస్తుంది.. అది చూసిన భాగ్యం కెవ్వుమని లేస్తుంది. నాకు నొప్పి తెలుస్తుంది అని అందరూ కూడా ఈ వైద్యం బాగా పనిచేస్తుంది దెబ్బకు తెలుస్తుంది అని అనుకుంటారు.

ధీరజ్ కు నిజం తెలుస్తుందా..? 

Advertisement

ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదు అని మా నాన్న నేర్పిన సంస్కారం నాకు అడ్డొస్తుంది. లేదంటే మా కోసం మీరు చేసిన ద్రోహాలన్నీ కూడా నాకు తెలిసిపోయే అని చెప్పగానే భాగ్యం శ్రీవల్లి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇప్పటికైనా మంచిగా మారండి లేదంటే మాత్రం ఇలాంటివి మీకే ఎదురవుతాయి అని ధీరజ్ చెప్పగానే శ్రీవల్లి ధీరజ్ కి నిజం తెలిసిపోయిందని కంగారు పడిపోతూ ఉంటుంది.. ఏంటి నిజం తెలిసినా కూడా ధీరజ్ ఏమీ మాట్లాడడం లేదు అని వల్లి బాధ పడిపోతూ ఉంటుంది. ఇక భాగ్యంకి మళ్లీ ఒకసారి బడితే పూజ చేస్తుంది శ్రీవల్లి.

లారీ డ్రైవర్ ను ధీరజ్ పట్టుకుంటాడా..? 

భాగ్యం వాళ్ళింట్లోంచి బయటికి రాగానే నర్మదకు ఒక మెసేజ్ వస్తుంది. లారీ డ్రైవర్ డీటెయిల్స్ వచ్చాయి ఇతనే యాక్సిడెంట్ చేసింది అని నర్మద అనగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది ఎవరో కావాలని చేయించినట్లు ఉంది అని ప్రేమ పదేపదే అనడంతో ఆ డ్రైవర్ ని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని ధీరజ్ అనుకుంటాడు.. ఈ డ్రైవర్ ని పట్టుకుంటే అసలు దొంగ ఎవరు అన్నది తెలిసిపోతుంది అని అనుకుంటాడు.. ప్రేమ అన్నట్లుగా అతని ఎవరో పట్టుకుంటే అసలు నిజాలు బయటికి వస్తాయి ఆ తర్వాత ఏం చేయాలో అది చేస్తాను అని అంటాడు.

ప్రేమ ధీరజ్ సర్ప్రైజ్.. 

Advertisement

ప్రేమను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి ధీరజ్ చేస్తడు.. ప్రేమనే ఎన్ని రోజులు ఎంత బాధ పెట్టాను అని ధీరజ్ బాధ పడిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు ప్రేమని నేను ఎందుకు దూరం పెట్టాను అని ధీరజ్ ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్రేమ ఇచ్చిన గిఫ్ట్ని తను బాగు చేయాలని అనుకుంటాడు. ఆ గిఫ్ట్ ని తీసుకుని మళ్లీ ఎంతో అందంగా రెడీ చేస్తాడు ధీరజ్.. ప్రేమ నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఈ గిఫ్ట్ని నేను మరింత అందంగా తయారు చేయాలి అనుకొని దాన్ని అలాగే చేస్తాడు.. ప్రేమ ఉలిక్కిపడి భయపడుతూ ఒక్కసారిగా నిద్రలోంచి లేస్తుంది. అయితే ప్రేమ ఏమైంది అని అడుగుతాడు. నాకు పదేపదే ఆక్సిడెంట్ ఏ కళ్ళేకొస్తుంది అని చెప్పగానే నువ్వేం కంగారుపడకు దాని గురించి నేను తెలుసుకుంటాను. నీకు ఒక సర్ప్రైజ్ అని తన బొమ్మని ఎలా చేశాడో చూపిస్తాడు.. అది చూసిన ప్రేమ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది..

లారీ డ్రైవర్ కోసం ధీరజ్ వేట.. 

లారీ డ్రైవర్ ని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని ధీరజ్ తన ఫ్రెండ్స్ అందరికీ అతని గురించి డీటెయిల్స్ ని షేర్ చేస్తాడు. ప్రేమని కావాలని గుద్దాడ లేదా అన్నది తెలుసుకోవాలి అని ధీరజ్ చాలా ప్లాన్ చేస్తాడు. యాక్సిడెంట్ గురించి ప్రేమ ఇప్పటికీ భయపడుతుంది అని ధీరజ్ అనగానే తన ఫ్రెండ్స్ అందరూ తనకి సపోర్ట్ చేస్తారు. ఎలాగైనా సరే ఆ డ్రైవర్ని వెతకాలి అని అనుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనా కోసం వెంటపడ్డ కుర్రాడు.. కంగారు పడ్డ మీనా.. చివరిలో బాలు ట్విస్ట్..

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×