E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కనిపెట్టిన నందు 

Brahmamudi Serial Today Episode April 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కనిపెట్టిన నందు 
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు గురించి ఆపర్ణ ఏడుస్తుంటే.. నందు వెళ్లి ధైర్యం చెప్తుంది. కిడ్నాపర్లు డబ్బు కోసమైనా ఇందు అక్కను ఏమీ అనరు అంటూ చెప్తుంది. దీంతో అపర్ణ నువ్వు ధైర్యం చెప్తుంటే.. నా కొడుకు చెప్పినట్టే ఉందమ్మా అంటూ అపర్ణ ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో స్వాతి మరి అక్క ఎక్కడుందో తెలిసిందా అని అడగ్గానే.. తెలియలేదు.. కానీ తప్పకుండా కనుక్కుంటాను అని చెప్తుంది నందు.

మరోవైపు రూంలో కట్టేసిన ఇందు దగ్గరకు రాజు, లక్కీ భోజనం తీసుకుని వెళ్తారు. రాజు నీ పనే బాగుంది కూర్చున్న దగ్గరకే అన్ని వస్తున్నాయి. భోజనం తీసుకొచ్చాను తిను అంటాడు. దీంతో ఇందు కోపంగా నాకు ఏమీ వద్దు అంటుంది. అప్పుడే లక్కీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ముందుకు వచ్చిన అన్నాన్ని కాదనకూడదు తిను అని చెప్పగానే.. ఇందు కోపంగా మీరు తీసుకొచ్చిన దాన్ని కూడా భోజనం అంటారా..? ఇందాకా తీసుకొచ్చిన అన్నం ఉడకనేలేదు.. నోట్లో పెట్టుకుంటే మెతుకులు గుచ్చుకుంటున్నాయి. పప్పును తుప్పు పట్టించారు. కూరనేమో కకృతిగా వండారు. రసం పేరుతో నీళ్లు పోశారు అనగానే.. లక్కీ కూడా తను చెప్పేది నిజమే మామ నాకు కూడా తినబుద్ది కావడం లేదు అని చెప్పగానే.. రాజు కోపంగా ఏంట్రా బిర్యానీ కోసం సపోర్టు చేస్తున్నావా..? అనగానే.. ఇందు నాకు బిర్యానీ కూడా ఏమీ వద్దు అనగానే.. రాజు కోపంగా మరి ఇంకేం కావాలమ్మా అని అడగ్గానే..

Advertisement

ఇందు నాకు ఇంటి ఫుడ్డు కావాలి అని చెప్పగానే. రాజు అత్తారింటి పుడ్డు ఏమీ వద్దా అంటాడు. దీంతో లక్కీ సూపర్‌ ఐడియా  మామ మీ అమ్మకు చెప్పి వండించి తీసుకొస్తే అంటాడు. దీంతో రాజు చెప్పు తీసుకుని కొడుతుందిరా..? మనకు తిండి పెట్టడమే దండగ అని మా నాన్న ఫీల్ అవుతున్నాడు. మళ్లీ దీనికి కూడానా..? అనగానే.. ఇందు కోపంగా నీలాంటి కొడుకు ఉంటే అలానే ఫీల్ అవుతాడు. నాకు ఇంటి ఫుడ్డే కావాలి.. అదైతేనే తింటానుద అనగానే.. రాజు కోపంగా అయితే తినకు మానేయ్‌ అనగానే.. ఇందు కూడా కోపంగా హలో నాకు ఏమైనా అయితే మీకు డబ్బులు కాదు కదా చిల్లర కూడా రాదు అనగానే.. లక్కీ మామ తను చెప్పింది కూడా నిజమే కదరా..? ఒకసారి ఆలోచించు.. ఎంత ఆలోచించినా మనకు వండటం రాదు కదా..?తనకు వచ్చు కదా అంటూ ఇద్దరూ కలిసి ఇందు చేత వంట చేయించాలని అనుకుంటారు. కట్లతో అలాగే ఇందును కిచెన్‌లోకి తీసుకెళ్లి నీకు ఇంటి భోజనం కావాలి అన్నావు కదా..? నువ్వు చెబుతూ ఉండు.. మేము వంట చేస్తాము అంటారు. ఇందు చెప్తుంటే.. రాజు, లక్కీ వంట చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ రాదు దీంతో ఇందు కట్లు విప్పి ఇందుతో వంట చేయిస్తారు.

మరోవైపు ఇందు కిడ్నాప్‌ విషయం గురించి ఆలోచిస్తూ.. ఆ ఇంట్లోనే అక్క ఉన్నట్టుంది. అని అనుమానంతో వెళ్తుంది. మరోవైపు ఇందు వంట చేయగానే..   లక్కీ లొట్టలేసుకుంటూ భోజనం చేయబోతుంటే.. రాజు అనుమానంగా మనం తినే అన్నంలో ఏ విషమో మందో కలిసి మనం తిని పడిపోతే మేడం తప్పించుకోవాలని ప్లాన్‌ చేసి ఉండొచ్చు అనగానే.. అలా చేయలేదు అయినా మీరు నమ్మాలంటే నేనేం చేయాలి అంటుంది ఇందు. అయితే ముందు నువ్వు తిను తర్వాత మేము తింటాము అంటాడు రాజు. దీంతో ఇందు ముందు భోజనం చేస్తుంది. ఇందు భోజనం చేస్తుంటే.. ధైర్యంగా రాజు, లక్కీ భోజనం చేస్తారు. ముగ్గురూ కలిసి భోజనం చేస్తుంటే.. అప్పుడే నందు బయటి నుంచి వచ్చి కిటికీ ఓపెన్‌ చేసి చూస్తుంది. అక్కేంటి వీళ్లతో కలిసి భోజనం చేస్తుంది. బెదిరించి భోజనం చేయిస్తుంటారు. ఎలాగైనా అక్కతో మాట్లాడాలి అని మనసులో అనుకుంటుంది.

Advertisement

మరవైపు ఇంట్లో వంట చేయలేకపోతున్నానని భ్రమరాంబ రేఖతో బాధపడుతుంది. ఎవరైనా వంట మనిషిని పనిలో పెట్టమని చెప్తుంది. పోలీసులకు వంట చేయలేక చచ్చిపోతున్నానని చెప్తుంది. దీంతో ఐశ్వర్య అసలు కాసేపు అన్ని పక్కన పెట్టండి ఆంటీ ఆ ఇందు ఎక్కడుందో తెలియక ఆంటీ టెన్షన్‌ పడుతుంది అని చెప్పగానే.. భ్రమరాంబ సైలెంట్‌ అయిపోతుంది. ఇంతలో అప్పు ఇచ్చిన డబ్బు కోసం చక్రి వస్తాడు. డబ్బులు మొత్తం ఎప్పుడు ఇస్తారు.. డబ్బులు ఇవ్వకపోతే మీ నగలు మొత్తం ఇస్తారా..? ఇవ్వరా అంటూ ఆల్టిమేటం పెడతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×