E-Paper
Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఏప్రిల్ 2 : భాగ్యం ప్లాన్ సక్సెస్.. చందుకు నిజం చెప్పిన శ్రీవల్లి.. అమూల్య నిజాలు బయటపెడుతుందా..?

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఏప్రిల్ 2 : భాగ్యం ప్లాన్ సక్సెస్.. చందుకు నిజం చెప్పిన శ్రీవల్లి.. అమూల్య నిజాలు బయటపెడుతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. అల్లుడు కూతురిని ఎంత బాధ పెడుతున్నాడో అని భాగ్యం ఆనందరావు పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు.. ఆ తర్వాత అందరూ కలిసి రామరాజు విషయం తెలిసిపోయింది అని అనగానే వాళ్ళిద్దరూ ఎక్కడ చంపేస్తారు అని భయపడి కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగుతారు. తర్వాత విషయం తెలియదు అని తెలుసుకొని ఇద్దరు కూడా 10 లక్షల డబ్బులు గురించి మాట్లాడతారు.. ఇక మొత్తానికి నర్మదా ప్రేమలో దెబ్బకి ఆనంద్ రావు భాగ్యం అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు.. ఇక రామరాజు కొబ్బరికాయలు వలుస్తూ ఉండగా వేదవతి చెమట తుడుస్తూ ఉంటుంది వీరిద్దరి రొమాంటిక్ సీన్ ఎపిసోడ్కి హైలైట్ గా మారుతుంది.. ఇక ప్రేమ ధీరజులు మాత్రం గొడవ పడుతూనే ఉంటారు. వీరిద్దరిని ఎలాగైనా కలపాలి అని వేదవతి ప్రయత్నాలు చేస్తుంది.. రాత్రి అవ్వగానే శ్రీవల్లి నీ ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఒక చోటికి తీసుకొని వెళ్తారు.. నీ డైలాగులతో ఎవరికి నిద్ర లేకుండా చేశావు కదా… ఈ రాత్రి నువ్వు నిద్రపోకుండా ఉండాలి అదే నీకు శిక్ష అని శ్రీవల్లితో అంటారు. మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను అని శ్రీవల్లి అంటుంది. ఫోన్లోని రికార్డు ను డిలీట్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ వాయిస్ రికార్డు డిలీట్ అయిందని టెన్షన్ పడిపోతుంది. నర్మద వేరే ప్లాన్ చేశాను అని చెప్తుంది. ఆ వాయిస్ రికార్డు కేవలం వల్లిని భయపెట్టడానికి మాత్రమే.. వల్లి ఎంతట వల్లి నిజం చెప్పడానికి వేరే ప్లాన్ వేశాను అని నర్మదా చెప్తూ ఉండగా చందు అక్కడికి వస్తాడు. నర్మదా ఎమ్ ఏ సర్టిఫికేట్ ఫేక్ అని నీకు ఎలా తెలుసు నర్మదా అని అడుగుతాడు.. అంతే కాదు బావగారు అమూల్యను ఆ విశ్వం ని ప్రేమించమని చెప్పింది.. సాగర్ ఉద్యోగం గురించి బయటపడడానికి కారణం ఎవరు అన్నది వల్లికి తెలుసు అని అనగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. అయితే ఏంటి నర్మద నువ్వు చెప్పేది అని అనగానే వల్లి అక్కకు తెలుసు బావగారు అని మళ్ళీ మాట మార్చి చెప్తుంది..

Advertisement

ఇక భాగ్యం ఆనందరావు వల్లికి ఏమైందో ఏంటో అర్థం కావడం లేదు. ఆనందరావు తన మాటలతో ఇంకాస్త ఇబ్బంది పెట్టేస్తాడు. అమ్మాయి అక్కడ అబ్బాయి ఇరుక్కుపోయింది ఏమైందో అర్థం కావడం లేదు నాకు చాలా టెన్షన్ గా ఉంది మీరేంటి ఇలా గోల చేస్తున్నారు. అని భాగ్యం ఆనంద్ రావు పై సీరియస్ అవుతుంది. అప్పుడే బల్లి ఫోన్ చేసి అమ్మ మన ప్లాను బీభత్సంగా సక్సెస్ అయిపోయింది అని అంటుంది. నువ్వు ట్రైనింగ్ ఇచ్చి పంపించావు కదా ఎలా నేను వెనకడుగు వేస్తానమ్మ సక్సెస్ అయిందని చెప్పగానే భాగ్యం ఆనందరావు ఫుల్ ఖుషి అవుతారు.. ఇప్పటివరకు నిన్ను ఒక ఆట ఆడుకున్నారు ఇప్పటినుంచి ఆ నర్మదా ప్రేమ కళ్ళల్లో రక్తపు కన్నీరు వచ్చేలా నేను చేస్తానని భాగ్యం అంటుంది.. మీరు పూజకి బేగి రండి అని చెప్పగానే సరే అమ్మ మేము వచ్చేస్తావని భాగ్యం అంటుంది..

చందు నీతో ఒక విషయం మాట్లాడాలి అని బల్లిని బలవంతంగా పక్కకు తీసుకుని వెళ్తాడు. అమూల్యని విశ్వక్తో ప్రేమించమని చెప్పింది ఎవరు అని అడుగుతాడు.. ఆ మాట వినగానే శ్రీవల్లి ఫీజులు ఎగిరిపోతాయి.. అయితే ఎవరు చేశారు నీకు తెలుసు కదా చెప్పు అని చందు అడుగుతాడు. ఎలాగైనా సరే చందు దగ్గర నుంచి తను తప్పించుకోవాలని మళ్లీ అనుకుంటుంది. గట్టిగా కసురుకోవడంతో ప్రేమనే ఇదంతా చేసింది అని అబద్ధం చెప్తుంది.. ఆ మాట వినగానే ప్రేమ నర్మదా ఇద్దరు కూడా షాక్ అవుతారు.. పక్కనే ఉన్న అమూల్య ఆ మాట విని వదినని గట్టిగా అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ వదినా నీకు కాపురం బాగుండాలని ప్రేమ, నర్మద వదినలు ఇద్దరూ కూడా మాట తీసుకున్నారు అందుకే ఆగిపోయాను. చేసినంత నువ్వే… ఇప్పుడు నీ మీదకి వస్తుందని నువ్వు వాళ్ళిద్దరు ఇరికిస్తున్నావా అని అమూల్య చెందుతో అసలు నిజం చెప్పేస్తుంది.

Advertisement

అవునన్నయ్య వల్లి వదినే నన్ను ఆ విశ్వం ని ప్రేమించమని పోర్స్ చేసింది. ఇక ఆ మాట వినగానే చందు ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. ఇక వేదవతి రామరాజు ఇద్దరు కూడా కళ్యాణం కోసం అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు.. పూజారిగారు రావడంతో వేదవతి అందరిని పిలుస్తుంది. అయితే చందు మాత్రం వల్లి బట్టల్ని బ్యాగులో సద్దేసి మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు.. తీసుకో నీ పుట్టింటికి నువ్వు ఇప్పుడు వెళ్లాల్సిందేనని వల్లికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. ఇక చందు వల్లిని వాళ్ళ పుట్టింటికి దగ్గరుండి తీసుకొని వెళ్లి వదిలిపెడతాడు..

Also Read :పల్లవి ప్లాన్ రివర్స్.. మీనాక్షికి నిజం తెలుస్తుందా..? రాజేశ్వరి బిడ్డ ఏమయ్యాడు..?

నువ్విక మీ పుట్టింటికి వెళ్ళిపో అని చందు ఎంత చెప్తున్నా సరే.. వల్లి మాత్రం నేను వెళ్ళను బావ నువ్వంటే నాకు ప్రాణం బావ అని బాధ పడిపోతూ ఉంటుంది.. వల్లి బాధపడి ఎంతగా చెప్తున్నా సరే చందు మాత్రం అస్సలు వినడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా అని మళ్లీ ఎంత చెప్తున్నా సరే చందు మాత్రం అస్సలు వినడు. ఆ విశ్వక్ తో చేతులు కలిపి నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేయాలని చూసావు ఇది మాత్రమే నేను అసలు మర్చిపోను అని చందు అంటాడు. అబద్దాలతో మోసాలతో పెళ్లి చేస్తే నీ జీవితం ఏమవుతుందో అని నీ వాళ్ళకి చెప్పు అని చెందు అక్కడి నుంచి చందు వెళ్లిపోతాడు. వల్లి కన్నీళ్లు పెట్టుకుని బాధ పడిపోతూ ఉంటుంది.

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×