BigTV English

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, ధీరజ్ ల మధ్య రొమాంటిక్ ట్రాక్.. శ్రీవల్లి నాటకం నర్మదాకు తెలిసిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, ధీరజ్ ల మధ్య రొమాంటిక్ ట్రాక్.. శ్రీవల్లి నాటకం నర్మదాకు తెలిసిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episode April 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. లోపల గదిలో శోభనం జరుగుతుంటే, నర్మదా సాగర్ లు కూడా ముద్దు ముచ్చట తీర్చుకుంటుంటారు. బయట ప్రేమ ధీరజ్లు దెయ్యాల స్టోరీ తో సరదాగా ఉంటారు. ధీరజ్ కు దెయ్యాలు ఉన్నాయని ప్రేమ అడిగితే ఒక పెద్ద స్టోరీ నే చెప్పి ప్రేమను భయపెట్టాడు. ఇక అప్పుడే కరెంటు పోవడంతో ప్రేమ నిజంగానే దెయ్యాలు ఉన్నాయి ఏమో అని షాక్ అవుతుంది. అందరూ సరదాగా ఒక సాంగ్ ను వేసుకుంటారు. మొత్తానికి పెద్దోడి శోభనం పూర్తవుతుంది. ఉదయం రామరాజు బయటికి వెళ్తాడు. టీ కొట్టు దగ్గరికి వెళ్లి టీ అడగ్గాని అందరూ పెద్దోడికి పెళ్లి చేశారు చాలా సంతోషంగా ఉంది కదా అనేసి అడుగుతారు. సేనాపతి వచ్చి పెద్ద కోడలు ఇంటికి రాగానే చిన్న కోడలు బయటకు పంపించేశారు ఈయన ఒక పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటాడు. నేను చెప్పింది అబద్ధం అయితే మీ ముందరే రామరాజు ఉన్నాడు కదా అడిగి తెలుసుకోండి అని అందరితో అంటాడు. అక్కడున్న పెద్ద మనుషులు ఏంటి రామరాజు గారు ఇది నిజమా అంటే రూమ్ ఒకటి కట్టేస్తున్నాము మేము మా రూమ్ లో ఉండమన్న కూడా చిన్నోడు చిన్న కోడలు హాల్లో ఉంటామని చెప్పారు. వద్దని చెప్పిన కూడా వాళ్ళు బయట ఉంటామని చెప్పారు అని రామరాజు ఎంత చెప్పినా కూడా సేనాపతి మాత్రం రామరాజు పై పెటైర్లు వేస్తాడు. కొత్త కోడలు రాగానే పాత కోడల్ని బయటకు పంపించారా రామరాజు గారు అని అందరూ అడగడంతో అవమానంగా ఫీల్ అయిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజును అందరు అవమానించారు. ఆ ఆ విషయం వల్ల సీరియస్ అయిన రామరాజు ధీరజ్ ప్రేమను మా రూమ్ లో ఉండండి అని చెప్తాడు.. శ్రీవల్లి మాత్రం నేను చేతపడేటప్పుడు స్టోర్ రూమ్ చూశానండి ఆ చిన్న గది మాకు చాలు అని అంటుంది. అదే స్టోర్ రూమ్ లో మేము ఉంటామని ధీరజ్ ప్రేమలు అంటారు. శ్రీవల్లి మాత్రం స్టోర్ రూమ్ లో మేము ఉంటాము మీరు మా రూంలో ఉండండి అనేసి అంటుంది.. ధీరజ్ స్టోర్ రూమ్ లో మేము ఉంటాము అని చెప్తాడు. మొత్తానికి శ్రీవల్లి ప్లాను వర్కౌట్ అవుతుంది. ఒక కోడల్ని స్టోర్ రూమ్ కు పంపించాను. ఇక రెండో కోడలు సంగతి చూస్తే నేనే ఇంటికి మహారాణి అని శ్రీవల్లి అనుకుంటుంది..

ధీరజ్ ప్రేమ ఇద్దరూ స్టోర్ రూములు చూసి భయంకరంగా ఉంది అని భయపడిపోతారు.. ప్రేమ మాటలకి కోపంతో రగిలిపోయిన ధీరజ్ స్టోర్ రూమ్ అంటే ఇలానే ఉంటుంది ఇద్దరం కలిసి సర్దుకోవాలి లేకుంటే ఎలా పడుకుంటామని అంటారు. అలా ఇద్దరూ మొత్తం రూముని సద్దేసి నీటిగా పెట్టేసుకుంటారు.. ఇక ప్రేమగా ప్రేమ ధీరజ్ కి కాఫీ ఇస్తుంది. శ్రీవల్లికి ఫోన్ చేసి అక్కడ విషయాలు ఏంటో కనుక్కోవాలని భాగ్యం అనుకుంటుంది.. అప్పుడే శ్రీవల్లి భాగ్యం కి ఫోన్ చేస్తుంది. నీకు నూరేళ్లు అమ్మడు నేనే ఫోన్ చేద్దామనుకున్నా నువ్వే ఫోన్ చేస్తావని అడుగుతుంది.


నువ్వు ఫోన్ చేయాలనుకున్నావా ఎందుకే అమ్మ అని శ్రీవల్లి అంటుంది.. మూడు రోజులు అయిపోయాయి కదా ఆ నగలన్నీ బంగారు కాదు డూప్లికేట్ అని తెలిస్తే ఇంట్లో ప్రాబ్లం అయిపోయి మన బండారం బయటపడుతుంది నువ్వు ఎలాగైనా సరే ఆ నగల్ని తీసుకొని ఇక్కడికి రావాలి అని శ్రీవల్లి అంటుంది. శ్రీవల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నర్మదా వస్తుంది.. ఇక ఏమీ మాట్లాడలేకుండా గమ్మున ఉంటుంది. బయటికి వెళ్లి మా అత్తమ్మ వాళ్లకి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పు అని అంటుంది. అలాగే నేను చెప్తానని భాగ్యమంటుంది.

నర్మదా ఎవరితో అక్క ఫోన్ మాట్లాడుతున్నావ్ అని శ్రీవల్లిని అడుగుతుంది. ఏంది మామ ఫోన్ చేయండి అస్సలు ఊరుకోలేదు మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత మాట్లాడడం చాలా బాగుంటుంది అని శ్రీవల్లి అంటుంది.. అయినా మీ అమ్మ నీకు ఫోన్ చేస్తుందా ప్రేమ అని అడుగుతుంది. ఆయన మీరిద్దరూ లేసిపోయి పెళ్లి చేసుకున్నారు కదా మీ అమ్మ నీకు ఎలా ఫోన్ చేస్తుంది అవన్నీ మర్చిపోవడానికి టైం పడుతుందిలే అని రివర్స్లో నర్మదని బాధపెడుతుంది శ్రీవల్లి.

రామరాజు హడావిడిగా మిల్లుకు వెళ్లాలని అనుకుంటాడు. భాగ్యం ఫోన్ చేసి వదిన గారికి ఒకసారి ఫోన్ ఇస్తారని అడుగుతుంది.. వదిన గారు 16 రోజులు పండక్కి మా ఇంటికి మీరు రావాలి మీరు చేయి కడుక్కుంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతామని భాగ్యం అంటుంది. అయినా నాలుగు రోజులనుంచి రైస్ మిల్లు తెరవలేదు కదా ఇప్పుడు చాలా డెలివరీలు ఉన్నాయి. వాటిని ఇవ్వడానికి వెళ్తున్నారు మిగతా వాళ్ళందరూ మేము వస్తామని భాగ్యంకి చెప్తుంది వేదవతి.

ఇక ఇంట్లో వాళ్ళందరినీ కేకలేసి పిలుస్తుంది. మనమందరం శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రెడీ అవ్వండి అని చెప్తుంది. నర్మదా మాత్రం నేను రాలేను నాకు సెలవులు ఉన్నవి వాడేసుకున్నానని అంటుంది. ధీరజ్ ని అడిగితే నాకు చాలా పనులు ఉన్నాయి నేను రాలేను అని అంటాడు. ఆయన రాకపోతే నేనెలా వస్తాను నాని కూడా కాలేజీకి వెళ్లాలని ప్రేమ ఉంటుంది. శ్రీవల్లి మా ఇంటి కానగని అందరూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారే అని బాధపడుతుంది.. చందు ధీరజ్ ని రమ్మని అడుగుతాడు. సరే అన్నయ్య నేను వస్తానని ధీరజ్ మాటిస్తాడు.

వేదవతి ధీరజ్ ప్రేమలను రెడీ అవమని చెప్తుంది. ప్రేమ నర్మద వెళుతుంటే నర్మద దగ్గరికి వెళ్తుంది. తేడాగా ఉన్నారు నేను వెళ్ళను అని అంటుంది ప్రేమ. వీళ్లకు తప్పదు ప్రేమ నాకు సెలవు ఉన్నా కూడా నేను వెళ్ళను అని అంటుంది నర్మదా. ప్రేమ చీర కట్టుకోవాలా డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ధీరజ్ చీర కట్టుకొని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ధీరజ్ ప్రేమల మధ్య కొత్తగా రొమాంటిక్ ట్రాక్ మొదలవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×