E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు దూరమైన ధీరజ్.. భాగ్యం కు షాకిచ్చిన శ్రీవల్లి.. రామారాజుకు చందు నిజం చెప్తాడా..?

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు దూరమైన ధీరజ్.. భాగ్యం కు షాకిచ్చిన శ్రీవల్లి.. రామారాజుకు చందు నిజం చెప్తాడా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 6th: ప్రేమకు ధీరజ్ పై ఉన్న ప్రేమని చెప్పాలి అని ధీరజ్ కోసం ఒక గిఫ్ట్ ని తీసుకొని తన దగ్గరకు వస్తుంది. తన దగ్గరికి వెళ్లి ఎంతో ప్రేమగా కౌగిలించుకొని తన మనసులోని మాటని చెప్పాలని ఆశపడుతుంది.. కానీ ధీరజ్ మాత్రం తనపై చాలా ఆవేశంగా కోపంగా ఉంటాడు.. చూసిన ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. నువ్వు నా చెల్లెలు విషయంలో తప్పుచేసి మల్లి నా దగ్గరికి ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని అంటాడు.. నా కుటుంబం పరువు పోకుండా ఉండడానికే నేను అలా చేశాను అని ప్రేమ ఎంతగా నచ్చ చెప్పిన సరే.. ధీరజ్ మాత్రం తాను చెప్పిందే కరెక్ట్ అని తను అనుకున్నదే నిజం అని అనుకుంటాడు. అమ్ము నేను ప్రేమించమని మీ అన్నయ్యకు చెప్పావా లేదా అని ధీరజు ప్రేమని అపార్థం చేసుకుంటాడు. ప్రేమ ఏం చెప్పినా సరే ధీరజ్ వినకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు నాకు ప్రపోజ్ చేసినవు మళ్లీ పెళ్లి చేసుకుందాం అన్నావు నాకు చాలా సంతోషంగా ఉంది రా అని ప్రేమ తను జీవితంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడుతుంది. కానీ ధీరజ్ మాత్రం నువ్వు నన్ను దారుణంగా మోసం చేశావు అని అనగానే ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ధీరజ్ ను తిట్టిన నర్మద..

ప్రేమ తను మనసులోని ప్రేమను బయటపెట్టిన విషయం నీ గుర్తు చేసుకొని నా మనసులోని ప్రేమను కూడా నీకు చెప్పాలని ఈ అద్భుతమైన గిఫ్ట్ ని తీసుకుని వచ్చాను అని అంటుంది.. గుర్తుగా మిగిలిన ఈ పావురాలని నీకు గిఫ్ట్ ఇవ్వాలని నేను ఎంతో ఆశగా వచ్చాను రా అని ఎమోషనల్ అవుతుంది.. కానీ ధీరజ్ మాత్రం ఆ గిఫ్ట్ ని తీసుకొని నేలకే విసిరి కొట్టేస్తాడు.. అది చూసిన ప్రేమ ఒక్కసారిగా గుండె ఆగిపోయినంతగా బాధపడుతుంది.. పావురాల గురించి నీకు తెలిసే ఈ గిఫ్ట్ ఇచ్చావా నాకు అని అంటాడు.. హేమ చేతికి గాయమైన కూడా ధీరజ్ మనసు కరగదు.. అక్కడికి వచ్చి నన్ను నర్మదా ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు అని క్లాస్ పీకుతుంది.. నీకు తెలియదు వదిన నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని ధీరజ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

భాగ్యంను చీపురుతో కొట్టిన శ్రీవల్లి.. 

Advertisement

భాగ్యం ఆనంద్ రావు ప్రేమ పక్షుల్లాగా వయసు కూడా మర్చిపోయి చాలా సరదాగా ఉంటారు.. శ్రీవల్లి మాత్రం వాళ్ళిద్దరు అలా చూసి కోపంతో కట్టలు తెచ్చుకుంటుంది.. ఒకవైపు తన భర్త తనకి దూరమైనందుకు కారణం తన తల్లి అని ఆ కోపాన్ని ఇంకాస్త పెంచుకుంటుంది. ఆనందరావు భాగ్యం ఇద్దరు కూడా బజ్జీలు తినిపించుకుంటూ ప్రేమగా ఉండడం చూసి శ్రీవల్లి ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి ఎంట్రీ ఇచ్చి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. నేను ఆ నర్మదా ప్రేమల కాళ్ళ వేళ్ళ పడి నా భర్తకు దగ్గర చేయమని కోరుకుంటుంటే మీరు వచ్చి చెడగొట్టారు ఇప్పుడు మీరు ఇద్దరు బజ్జీలు తినిపించుకుంటున్నారా? అని చీపురు తీసుకొని చితకబాదిస్తుంది.. ఆ ప్రేమ నర్మదలు నిన్ను వచ్చి తీసుకుని వెళ్లేలా నేను చేస్తాను అని భాగ్యం మాట ఇవ్వడంతో శ్రీవల్లి కూల్ అవుతుంది.

ఇంటికి తాగొచ్చిన చందు..

చందు వల్లి చేసిన మోసాన్ని బయట పెట్టలేక బాధతో తాగి ఇంటికి వస్తాడు.. నాన్న నేను నీకు నమ్మకం అని నాకు తెలుసు. నన్ను ఎలాగైతే ఆ వల్లి మోసం చేస్తుందో దాన్ని మీకు ఈ రోజు చెప్పాల్సిందే.. మామూలుగా అయితే మీ ముందర మాట్లాడడానికి నాకు ధైర్యం సరిపోదు అందుకే తాగి ఇంటికి వచ్చాను అనుకొని తనలో తానే చందు మాట్లాడుకుంటూ ఇంట్లోకి వస్తాడు. అది చూసిన ప్రేమ అన్నారు మొదలు చందు బావ ఇలా అవ్వడానికి అవన్నీ అక్కే కారణమని బాధ పడిపోతుంటారు.. ఇక తర్వాత తిరుపతి తో పాటుగా మిగిలిన తమ్ముళ్లు కూడా వచ్చి చంద్రుని ఎంతగా కంట్రోల్ చేయాలని చూసినా కూడా చందు మాత్రం మాట వినడు.

రామారాజుకు నిజం చెప్తాడా..? 

Advertisement

చందు ఇవాళ ఎలాగైనా సరే నాన్న తో మాట్లాడాలి అని అనుకుంటాడు.. నాన్న బయటికి రా బయటికి రా అని గట్టిగా కేకలు వేయడంతో రామరాజు ఏమైందని బయటికి వస్తాడు.. అయితే అక్కడ చందు తాగేసి ఉండడం చూసి రామరాజు షాక్ అవుతాడు. నువ్విలా తాగేసి రావడానికి కారణమేంటిరా..? ఇలా నువ్వు తాగేసి వచ్చావని తెలిస్తే నీ భార్య ఎంత బాధ పడిపోతుందో ఆలోచించవని రామరాజు అంటాడు. మీకు వల్లి గురించి ఓ నిజం చెప్పాలి నాన్న అని ఎంత చెప్తున్నా సరే నర్మదా ప్రేమలు మాత్రం చంద్రుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చందు లోపలికి వెళ్తుంటే సాగరు నాన్నకి కొడుకులు మీద ఎంత ప్రేమ ఉందో చూసావా అని నర్మదా తో చెప్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: నిజం తెలుసుకున్న భరత్..ఇంట్లోంచి వెళ్లిపోతున్న చక్రధర్.. పల్లవికి అవని నిజం చెప్తుందా..?

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×