E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: నిజం తెలుసుకున్న భరత్..ఇంట్లోంచి వెళ్లిపోతున్న చక్రధర్.. పల్లవికి అవని నిజం చెప్తుందా..?

Intinti Ramayanam Today Episode: నిజం తెలుసుకున్న భరత్..ఇంట్లోంచి వెళ్లిపోతున్న చక్రధర్.. పల్లవికి అవని నిజం చెప్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode April 6th: చక్రధర్ ఎంత చెప్తున్నా సరే రాజేశ్వరి మాత్రం వినకుండా తనకి ఇంటికి ఏ సంబంధం లేదు అని గట్టిగా తేల్చి చెబుతుంది. దాంతోపాటుగా చక్రధారిని మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని అనడంతో అతను రాత్రంతా బయటే మెట్ల మీద కూర్చుంటారు. అటు భరత్ చక్రధర్ మన ఇంటికి వస్తే నేను ఇంట్లో ఉండను అని తేల్చి చెప్పేస్తాడు. ఇప్పటికే నాకు చాలా అవమానం జరిగింది.. అలాంటి ఆ ఇంట్లో నేను ఆయన వస్తే ఎలా ఉంటాను అని భరత్ అవనితో అంటాడు.. ఇన్నాళ్ళకి అమ్మ నాన్న కలిశారు అన్న సంతోషం నీకు ఎక్కడా కనిపించడం లేదు.. మీకు అమ్మ అంత బరువు కనిపిస్తే నాతో పాటు నేను తీసుకొని వెళ్ళిపోతాను అని అవని అంటుంది. కానీ భరత్ మాత్రం అమ్మ లేకపోతే నేను ఎలా ఉంటాను అక్క అని అంటాడు. ఇవాళ ఎపిసోడ్ కి ఇదే ఎమోషనల్ సీన్…

రాజేశ్వరి, చక్రధర్ మధ్య గొడవ..

బయట కూర్చుని ఉన్న చక్రధర్దగ్గరికి భానుమతి అల్లుడు గారు ఎక్కడున్నారు ఏంటో అని వెతుక్కుంటూ వస్తుంది.. బయట మెట్ల మీద కూర్చుని ఉన్న చక్రధాన్ని చూసి ఏంటి అల్లుడు గారు మీరు ఇక్కడ కూర్చున్నారు. మీరిక్కడ కూర్చొని ఉంటే నాకు బాధగా ఉంది లోపలికి రండి తను ఏదో ఒక పిచ్చిగా వాగింది అని భానుమతి బలవంతంగా చక్రధర్ ని లోపలికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది.. లోపలికి రాగానే భానుమతి అల్లుడు గారు వచ్చారే ఆయనకు టీ పెట్టి తీసుకురా అని చెప్తున్నా సరే రాజేశ్వరి మాత్రం సీరియస్ గా ఉంటుంది. ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడద్దమ్మా అని తనపై కోపాన్ని తెచ్చుకుంటుంది..

ఆస్తి కాగితాలతో వచ్చిన లాయర్..

Advertisement

అప్పుడే ఇంట్లోకి లాయర్ రావడంతో భానుమతి ఏంటి లాయర్ గారు వచ్చారు అని అనుకుంటుంది.. లాయర్ గారిని పిలిపించావంటే నాకు విడాకులు ఇచ్చి ఆ మీనాక్షితో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాం అన్నమాట అని రాజేశ్వరి అంటుంది. ఇప్పటికైనా నువ్వు మారతావు అని నేను అనుకున్నాను. కానీ నువ్వు మారలేదు లాయర్ గారు మీరు ఎందుకు వచ్చారు ఆ విషయాన్ని చెప్పండి అని చక్రధర్ అంటాడు.. తన యావదస్తుని మీ పేరు మీద రాశారు అని చెప్పగానే రాజేశ్వరి మౌనంగా ఉంటుంది.. నీకెంత హక్కుందో మీనాక్షికి నా మీద అంతే హక్కు ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చక్రధరంటాడు.. రాజేష్శ్వరి మాత్రం భర్త వెళ్ళిపోతున్న సరే మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది..

అవని పల్లవికి నిజం చెప్తుందా..?

బయట మార్కెట్ కోసం వెళ్ళిన పల్లవి అక్కడ ఒక చోట కింద పడిపోతుంది. అందరూ జనం భూమి కూడా ఉండడంతో మీనాక్షి కూడా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని వస్తుంది. అయితే పల్లవి నేను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీనాక్షి పల్లవికి వాటర్ ఇచ్చి లేపుతుంది. నువ్వు ఎవరు నన్ను ముట్టుకోవడానికి అని పల్లవి దారుణంగా మాట్లాడుతుంది. అది చూసిన ఆవని పల్లవి నీ పక్కకి తీసుకొని వెళ్లి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావో.. ఈమె ఎవరో తెలుసా నీకు కన్న తల్లి అని నిజం చెప్తుంది. ఆ మాట వినగానే పల్లవి ఫ్యూజులు ఎగిరిపోతాయి.. నాకు కన్నతల్లి అంటే ఏంటి అదే నీకు కన్న తల్లి లాంటిది అని పల్లవికి చెప్పబోతుంది. మా డాడీ ఎన్నమన్నుతో ఉంటే వాళ్ళందరూ నాకు తల్లులు అయిపోతారు అని దారుణంగా మాట్లాడడంతో అవని షాక్ అవుతుంది.

శ్రీయా దెబ్బకు అంతా షాక్..

Advertisement

శ్రేయ శ్రీకర్ రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాలి అని వెళుతుండగా.. ఎప్పుడు చూసినా ఆఫీసు అదేనా ఇంకేం పని లేదా నీకు అని అడుగుతుంది.. నాకు ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలని ఉంది తీసుకెళ్తావా లేదా అని శ్రేయ పెద్ద రచ్చ చేస్తుంది.. అయితే శ్రీకర్ వెళ్లకుండా ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది.. తనకు హాస్పిటల్కి ఇంకా రెండు రోజులు ఉంది.. అప్పుడు తీసుకెళ్తాను ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఎంత చెప్తున్నా సరే తను గోల చేస్తుంది అని అందరితో చెప్తాడు.. నా మొగుడుని నాతో రానివ్వకుండా మీరందరూ ప్రయత్నాలు చేస్తున్నారా అని పెద్ద రచ్చ చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో పల్లవి పార్వతి అవనీలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటుంది. మరి పల్లవికి నిజాలు తెలుస్తాయా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి..

Also Read :Podarillu Today Episode : మాధవ్ నవ్వుకు శైలు ఫిదా.. ప్రేమలో పడుతుందా..? మహా ప్లాన్ వర్కౌట్ అవుద్దా..?

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×