Illu Illalu Pillalu Today Episode December 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్కులో అమూల్యను విశ్వంతో చూసిన చందు ఇంట్లో చెప్పాలని ఆవేశంగా వస్తాడు. ఈ విషయం గురించి నేను మా నాన్నతో చెప్పకపోతే చాలా గొడవలు జరుగుతాయి అని చెప్పడానికి వెళ్తాడు. ఒకవేళ చందు రామరాజుకి నిజం చెప్తే శ్రీవల్లి వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించినట్లు తెలిసిపోతుందని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆయన్ని మావయ్యతో ఈ విషయం చెప్పకుండా ఆపాలి అని అనుకుంటుంది.. భాగ్యం చెప్పిన ప్లాన్ ప్రకారం చందు ను ఈ విషయం చెప్పకుండా ఆపేందుకు శ్రీవల్లి నాన్న ప్రయత్నాలు చేస్తుంది.. ఈ క్రమంలో కాలుజారి కింద పడినట్లు నాటకం ఆడుతుంది. అందరూ నిజంగానే పడిందేమో అనుకొని కంగారు పడుతుంటారు. నర్మదా ప్రేమ మాత్రం ఇదేదో నాటకం లాగా ఉంది అని శ్రీవల్లి పై అనుమాన పడతారు.. కాళ్ళునొప్పి అని నాటకం ఆడి లోపలికి తీసుకొని వెళ్తుంది శ్రీవల్లి.. హమ్మయ్య ఇప్పటికైతే నేను తప్పించుకున్నాను. ఈ విషయం గురించి బావ పూర్తిగా మర్చిపోయేలా చేయాలి అని అనుకుంటుంది. బావ ఏ విషయం గురించి నువ్వు మీ నాన్నతో చెప్పాలని అనుకున్నావు అని శ్రీవల్లి అడుగుతుంది. ఈ విషయం నీకు చెప్పేది కాదు నాన్నకే చెప్పాలి అని చందు అంటాడు. ఏ విషయం అయినా భర్తలు ముందుగా భార్యతో చెప్పాలి అని అంటారు కానీ నువ్వేంటి బావ నేను ఎంతగా అడుగుతున్నా సరే చెప్పకుండా ఉంటున్నావ్ అంత చెప్పకూడని విషయమా ఏంటి అని శ్రీవల్లి కావాలని చందునీ రెచ్చగొడుతుంది.. ఈ శ్రీవల్లి చందు చేత నిజం చెప్పించడంతో పాటుగా ఆ నిజం ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..మొత్తానికి శ్రీవల్లి చెప్పిన మాట విని చందు కూల్ అవుతాడు. వీళ్ళ కూర్చో బావ నేను వెళ్లి కాఫీ తీసుకొని వస్తానని శ్రీవల్లి వెళ్తుంది. బయటికి రాగానే శ్రీవల్లి నేను బతికిపోయాను అని డాన్స్ చేస్తుంది. చూసావా అక్క నేను చెప్పానా దానికి కాళ్ళు నొప్పి లేదు ఏమి లేదు అని ఖచ్చితంగా ఏదో చేస్తుంది అని ప్రేమ నర్మదా అనుకుంటారు.. ప్రేమ ఇది కచ్చితంగా ఏదో నాటకం మొదలు పెట్టింది అని అనుకుంటుంది. శ్రీవల్లి డాన్స్ వేస్తుండగా చూసి ప్రేమ ఏంటి ఏం చేస్తున్నావని అడుగుతుంది. దీనికి అడ్డంగా దొరికిపోయిన ఏంట్రా దేవుడు అని శ్రీవల్లి అనుకుంటుంది..
ఏంటి బల్లక్క డాన్స్ వేస్తున్నావ్.. కాలు నొప్పి అన్నావ్ కదా మరి నొప్పి ఎలా పోయింది అని అడుగుతుంది ప్రేమ. లోపలికి వెళ్లి బాంబు రాసుకున్నాక చెల్లి అందుకే తగ్గిపోయింది. కానీ నీ మీద నాకు ఏదో అనుమానం ఉంది అక్క నువ్వు ఏదో చేస్తున్నావని నాకు అర్థమవుతుంది అదేంటో చెప్పు అని ప్రేమ ఎంతగా బెదిరించిన సరే శ్రీవల్లి మాత్రం రామ రామ నేను అమాయకురాలని అని అసలు నిజం చెప్పకుండా దాచేస్తుంది. ఈ ప్రేమకి అనుమానం వచ్చిందంటే కచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది అని అనుకుంటుంది. ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా నువ్వు ఇలానే చేస్తున్నావు అయితే నీకు ఇవాళ కాళరాత్రి అని ప్రేమ బెదిరిస్తుంది. శ్రీవల్లి ప్రేమ మాట విని భయపడిపోతుంది.
తిరుపతి తన అల్లుడ్లను పిలుస్తాడు.. ఏంటి మామ ఏంటి అంతగా అరుస్తున్నావు అని అక్కడికి వస్తారు. ముగ్గురు కూడా లుంగీలో రావడంతో తిరుపతి మందు సెటప్ కి లుంగీల గెటప్ భలే ఉంది అనేసి అంటాడు.. ఇంట్లో నాన్న ఉన్నాడు చూశాడంటే మన పని అంతేను అని ముగ్గురు అంటారు.. నీకు బుర్ర లేదురా మీ నాన్న మీ అమ్మ ఇద్దరూ సెకండ్ షో సినిమాకి వెళ్లారు వాళ్ళు వచ్చేదానికి మనం అంత సర్దేసుకొని గుర్రు పెట్టి నిద్రపోవచ్చు. ఎందుకు రండి మొదలు పెట్టేద్దామని అందరూ కలిసి కూర్చొని పార్టీ చేసుకుంటారు..
ఈ పార్టీ ఇవ్వడానికి నాకు ఒక ముఖ్య కారణం ఉంది నా సౌందర్యలహరి నాకు దొరికేసింది. అందుకే మీకు పార్టీ ఇస్తున్నానని తిరుపతి అంటాడు. కానీ నువ్వు దెబ్బవకుండా చూసుకొని సాగర్ అంటాడు. ఇక చందు బాధపడుతూ ఉండడం చూసి ముగ్గురు కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ నీకే ఉంటది రా… ఎవరికీ చెప్పవు ఎలా తీరుతుంది? ఇక నీ ఇష్టం నువ్వు నీ చావు నువ్వు చావు అని ధీరజ్ అంటాడు. శ్రీవల్లి మాత్రం ప్రేమ ఏదో ఒకటి చేస్తుందని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పాటలు పక్కన కూల్ డ్రింక్ బాటిల్ ఉండడం చూసి ఆ బాటిల్ ని తీసుకొని తాగేస్తుంది.
కూల్ డ్రింక్ తాగిన శ్రీవల్లి మందు తాగినంత బిల్డప్ ఇస్తుంది.. ఒసేయ్ ప్రేమ అని పిలుస్తుంది.. ఒసేయ్ ప్రేమనా ఏం వచ్చింది నీకు.. ఏంటి తేడాగా మాట్లాడుతున్నావ్ అనంటే ఇవాళ నీ సంగతి తేల్చేస్తానే ఏమనుకుంటున్నావే అసలు నువ్వు నా గురించి అని శ్రీవల్లి మాట్లాడుతుంది.. అలా చూసిన ప్రేమ షాక్ అవుతుంది.. శ్రీవల్లి ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా నా కూల్డ్రింక్ బాటిల్ కనిపించలేదు ఎవరైనా తీసుకొచ్చారా లేడీస్ అంటూ తిరుపతి వస్తాడు.. ఇది కూల్ డ్రింక్ బాటిల్ నా మందు కాదా అని శ్రీవల్లి అడుగుతుంది.. ఇవాళ బావ లేడు కాబట్టి మందులో కలుపుకోవడానికి కూల్ డ్రింక్ బాటిల్ పెట్టాను మొత్తం తాగేసావా.. ఇంకొంచెం కూడా తాగేసేయ్ నేను వేరేది వెతుక్కుంటాను అని తిరుపతి అంటాడు..
Also Read : పార్వతిని రెచ్చగొట్టిన పల్లవి..చక్రధర్, పల్లవి ప్లాన్.. భానుమతికి నిజం తెలుస్తుందా..?
అది నేను మందు బాటిల్ అనుకున్నాను చెల్లి.. నేను అన్నది అంతా తూచ్ ఊరికే అన్నాను నన్ను క్షమించేసేయని శ్రీవల్లి ప్రేమని అడుగుతుంది. కానీ ప్రేమ మాత్రం నీకు ఇలా కాదే నీకు ఏదైనా చేస్తేనే అప్పుడు ఉంటుంది అని అంటుంది.. కానీ నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని ప్రేమ అనుకుంటుంది. ముందు ఈ బట్టల నిను ఉతికేసేయని ప్రేమ కండిషన్ పెడుతుంది. అంతో శ్రీవల్లి నువ్వు ఎలా చెప్తే అలానే ఉతికేస్తాను అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..