E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: తాగి రచ్చ చేసిన సాగర్.. ప్రేమకు ముద్దుపెట్టేసిన ధీరజ్.. వణికిపోయిన శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode: తాగి రచ్చ చేసిన సాగర్.. ప్రేమకు ముద్దుపెట్టేసిన ధీరజ్.. వణికిపోయిన శ్రీవల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. మొత్తానికి శ్రీవల్లి చెప్పిన మాట విని చందు కూల్ అవుతాడు. వీళ్ళ కూర్చో బావ నేను వెళ్లి కాఫీ తీసుకొని వస్తానని శ్రీవల్లి వెళ్తుంది. బయటికి రాగానే శ్రీవల్లి నేను బతికిపోయాను అని డాన్స్ చేస్తుంది. చూసావా అక్క నేను చెప్పానా దానికి కాళ్ళు నొప్పి లేదు ఏమి లేదు అని ఖచ్చితంగా ఏదో చేస్తుంది అని ప్రేమ నర్మదా అనుకుంటారు.. ప్రేమ ఇది కచ్చితంగా ఏదో నాటకం మొదలు పెట్టింది అని అనుకుంటుంది. శ్రీవల్లి డాన్స్ వేస్తుండగా చూసి ప్రేమ ఏంటి ఏం చేస్తున్నావని అడుగుతుంది. దీనికి అడ్డంగా దొరికిపోయిన ఏంట్రా దేవుడు అని శ్రీవల్లి అనుకుంటుంది.. కాలు నొప్పి అన్నావ్ కదా మరి నొప్పి ఎలా పోయింది అని అడుగుతుంది ప్రేమ.

లోపలికి వెళ్లి బాంబు రాసుకున్నాక చెల్లి అందుకే తగ్గిపోయింది. కానీ నీ మీద నాకు ఏదో అనుమానం ఉంది అక్క నువ్వు ఏదో చేస్తున్నావని నాకు అర్థమవుతుంది అదేంటో చెప్పు అని ప్రేమ ఎంతగా బెదిరించిన సరే శ్రీవల్లి మాత్రం రామ రామ నేను అమాయకురాలని అని అసలు నిజం చెప్పకుండా దాచేస్తుంది. ఈ ప్రేమకి అనుమానం వచ్చిందంటే కచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది అని అనుకుంటుంది. ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా నువ్వు ఇలానే చేస్తున్నావు అయితే నీకు ఇవాళ కాళరాత్రి అని ప్రేమ బెదిరిస్తుంది. శ్రీవల్లి ప్రేమ మాట విని భయపడిపోతుంది. శ్రీవల్లి కూల్ డ్రింక్ తాగేసి పెద్ద నాటకాలు ఆడడంతో ప్రేమ శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. కూల్ డ్రింక్ తాగేసి శ్రీవల్లి అడ్డంగా దొరికిపోతుంది. అది నేను మందు బాటిల్ అనుకున్నాను చెల్లి.. నేను అన్నది  అంతా తూచ్ ఊరికే అన్నాను నన్ను క్షమించేసేయని శ్రీవల్లి ప్రేమని అడుగుతుంది. కానీ ప్రేమ మాత్రం నీకు ఇలా కాదే నీకు ఏదైనా చేస్తేనే అప్పుడు ఉంటుంది అని అంటుంది.. కానీ నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని ప్రేమ అనుకుంటుంది.  ముందు ఈ బట్టల నిను ఉతికేసేయని ప్రేమ కండిషన్ పెడుతుంది. అంతో శ్రీవల్లి నువ్వు ఎలా చెప్తే అలానే ఉతికేస్తాను అని అంటుంది.

సాగర్ నర్మదని వెతుక్కుంటూ లోపలికి వస్తాడు.. ఏంటి ఇవాళ చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. నర్మదా ఏంటి మల్లెపూలు తీసుకొని వచ్చావా అని అంటుంది.. సైంటిస్ట్ కన్నా గొప్పదానివే అందుకే నువ్వంటే నాకు అంత లవ్వు అని సాగర్ అంటాడు.. ఏంటి తాగొచ్చావా తేడాగా ఉంది అని నర్మదా అడుగుతుంది.. నేనేం తాగి రాలేదు అని అలాగే కుప్పకూలి పడిపోతాడు.. అటు ధీరజ్ తాగేసి లోపలికి వెళ్లి తేడాగా ప్రవర్తిస్తాడు.. తాగిన మత్తులో ప్రేమపై ఉన్న ప్రేమను బయట పెడతాడు. మనసులో ఉన్న నిజాన్ని కక్కెస్తాడు.. ఏంటి తేడాగా ఉన్నావు తాగొచ్చావా ఏంటి అని అడుగుతుంది ప్రేమ.. కానీ ధీరజ్ మాత్రం ప్రేమని ఎంత ప్రేమిస్తున్నానన్న విషయాన్ని పదేపదే చెప్తూ తన వెంట పడుతూ ఉంటాడు..

Advertisement

ఈ రెండు జంటలు కలిపి డ్యూయెట్ సాంగ్ కి డాన్సులు వేస్తారు.. నాకేమో బట్టలు ఉతకమని చెప్పి ఈ చలిలో నన్ను చంపేస్తున్నారు అని శ్రీవల్లి బాధ పడిపోతూ ఉంటుంది.. అంతే కాదు శ్రీవల్లి వాళ్ళిద్దరి డాన్సులు చూసి మీ ఇద్దరు బాగా మీ ఆయనతో రొమాన్స్ లు డాన్స్ లు చేసుకుంటున్నారా? నేను కూడా మా ఇంట్లో చేసుకుంటాను అని గదిలోకి ఓ సాంగ్ తో వెళ్తుంది.. అక్కడ చందు మాత్రం అమూల్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.. అందరూ బాగానే ఉన్నారు నేను మాత్రమే ఇంత దరిద్రంగా ఉన్నాను అని శ్రీవల్లి బాధపడుతూ తలని బాధపడుతుంది.

ఆ ఇద్దరు జంటలు తిరుగుతూ డాన్సులు వేస్తూ ఉంటారు.. ఎవరికివారు డాన్సులు వేసుకుంటూ రొమాన్స్ చేసుకుంటూ బాగానే ఉన్నారు నా పరిస్థితి ఏంట్రా దేవుడా ఇలా మారిపోయింది అని బాధపడుతూ వెళ్తూ ఉంటుంది.. అమూల్య ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది అప్పుడే శ్రీవల్లిని గుద్దుకుంటుంది. అయినా కూడా శ్రీవల్లి ఏం మాట్లాడుతుందని వింటూ ఉంటుంది.. తర్వాత తిరుపతి కూడా తన స్టైల్ లో ముద్దులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.. అందరూ బాగానే ఉన్నారు నాకు మాత్రం దరిద్ర దేవత డాన్స్ చేస్తుంది. అందుకే ఎప్పుడూ నా భర్తకు దూరమైపోతున్నానని బాధపడుతుంది శ్రీవల్లి..

Also Read : భానుమతికి షాకిచ్చిన అక్షయ్.. మీనాక్షిని లేపేసేందుకు పల్లవి ప్లాన్.. నెక్స్ట్ ట్విస్ట్ ఏంటి..?

ఉదయం లేవగానే చందు అమూల్య విషయం తెలిసి కూడా నేను మా నాన్నకు చెప్పకపోతే చాలా తప్పు చేసిన వాడిని అవుతాను ఎలాగైనా ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పాలి అని అనుకుంటాడు. అయితే అప్పుడే అమూల్య నేను కాలేజీకి వెళ్తున్నాను అని విశ్వం కు హింట్ ఇవ్వడం చూసి షాక్ అవుతాడు.. ఇవాళ ఎలాగైనా సరే నాన్నకు చెప్పాల్సిందేనని చందు ఫిక్స్ అయిపోతాడు. వేదవతిని అమ్మ నాన్న ఎక్కడా అని అడుగుతాడు.. రాత్రి కొంచెం లేట్ అయింది కదరా పేపర్ తెచ్చుకోవడానికి ఇప్పుడు వెళ్ళాడు అని వేదవతి అంటుంది. ఎదురుగా రామరాజు రావడం చూసిన చందు ఎలాగైనా ఈ విషయం చెప్పాలని ముందుకు వెళ్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రామరాజుకు అసలు నిజాన్ని చందు చెప్పేస్తాడా..? విశ్వం కుటుంబంతో రామరాజు కుటుంబం గొడవ పడతారా? ఇంకా ఏమైనా గొడవలు జరుగుతాయా చూడాలి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×