E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: అమూల్య ప్రేమ వల్ల రామరాజు కన్నీళ్లు.. విశ్వంను కొట్టిన ధీరజ్..రామరాజుకు దారుణమైన అవమానం..

Illu Illalu Pillalu Today Episode: అమూల్య ప్రేమ వల్ల రామరాజు కన్నీళ్లు.. విశ్వంను కొట్టిన ధీరజ్..రామరాజుకు దారుణమైన అవమానం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 26th : నిన్నటి ఎపిసోడ్ లో..  ఎంత వద్దని చెప్తున్న సరే అమూల్య మాత్రం నన్నే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టింది అని రివర్స్ చేసి చెప్తాడు. దాంతో ప్రేమ షాక్ అవుతుంది. ప్రేమ విశ్వబ్ని చూసిన ధీరజ్ ఆవేశంగా వచ్చి విశ్వం ను కొడతాడు. ప్రేమ ఎంతగా అడ్డుపడుతున్నా సరే ధీరజ్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా విశ్వబ్నీ కొడతాడు. మరి ఈ విషయం గురించి ప్రేమ, ధీరజ్ మాట్లాడుకుంటారా లేదా అన్నది చూడాలి.. అటు నర్మదాకి అమూల్య విశ్వం బండిమీద కనిపించడం చూసి షాక్ అవుతుంది.. సాగర్ కి ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది.. సాగర్ ని లొకేషన్ పంపించి అక్కడికి రమ్మని నర్మదా అంటుంది. భాగ్యం శ్రీవల్లి ఆనందరావు ఈ స్టోరీ సాగర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందని చెప్తుంటారు.. శ్రీవల్లి మాత్రం ప్రేమ ధీరజ్ ఒకరినొకరు కొట్టుకున్నారు కదా అక్కడ స్టోరీ ఎలా ఉంటుందో చూద్దామని అంటుంది. మొత్తానికి అమూల్య, విశ్వం ల ప్రేమ వ్యవహారం బయటపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. విశ్వం అమూల్య ను చూసి సాగర్ ధీరజ్ ఇద్దరు కూడా కొట్టడానికి వస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన చందు నాకు ఈ విషయం రెండు రోజుల క్రితమే తెలిసింది రా అని అంటాడు.. రెండు రోజుల క్రితమే తెలిస్తే నువ్వెందుకు చెప్పలేదు రా అప్పుడే వాడిని మేము చంపేసేవాళ్లం కదా అని ధీరజ్ అంటారు.. ఈ విషయాన్ని నాన్న దగ్గరికి వెళ్లి తేల్చుకుందాం అని చందు అంటాడు. తన కూతురు చేసిన పనికి బాధపడుతూ వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమాయకపు తల్లి అని నన్ను అందరికీ చెప్పినట్లే అమాయకురాలని చేసేసావు వారిని నువ్వెలా ప్రేమించావే అని బాధపడుతుంది. ఇక రామరాజు కూడా వాడిని ప్రేమించే ముందు ఈ తండ్రి నీకు గుర్తుకు రాలేదా అని ఎమోషనల్ అవుతాడు. ఎవరైనా పిల్లల్ని మంచిగా పెంచాలని అనుకుంటారు నేను మీకు ఏం తక్కువ చేసాను నన్ను ఎందుకు ఇలా రోడ్డుమీదకి లాగుతున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు రామరాజు.

Advertisement

కన్నీళ్లు పెట్టుకోవాల్సింది నువ్వు కాదు నాన్న అమూల్యని ట్రాప్ చేసి అమాయకురాలని తన బుట్టలో వేసుకున్న వాణ్ని బ్రతకనివ్వకూడదు అని ధీరజ్, సాగర్ లు ఇద్దరు విశ్వంను కొట్టడానికి వెళ్తారు. ఇంట్లోని వాళ్లంతా కూడా వాళ్లను ఆపుతున్నా సరే వినకుండా ధీరజ్, సాగర్ ఇద్దరు కూడా సేన ఇంటికి వెళ్లి విశ్వం కోసం వెతుకుతారు.. ఇంట్లో రచ్చ చేసి విశ్వం గాడు ఎక్కడ అని ఇద్దరు కూడా హడావిడి చేసేస్తారు.. అడ్డుగా వచ్చినా సేనాని ధీరజ్ అలాగే సాగర్లు కొట్టడానికి ప్రయత్నిస్తారు.. విశ్వం దొరకగానే వాడిని తీసుకొని కిందకి వచ్చేస్తారు.. నా చెల్లెల్ని ట్రాప్ చేస్తావా రా అని ఇద్దరు కొడతారు.. తన్ని లాక్కొని వచ్చి బయట పడేస్తారు..

అమూల్య విశ్వంలో ప్రేమ వ్యవహారం ఇద్దరి కుటుంబాల మధ్య మరోసారి పెద్ద గొడవని సృష్టిస్తుంది. అందరూ కలిసి విశ్వం ని దారుణంగా కొట్టేస్తారు. ఎంత చెప్తున్నా సరే వినకుండా వాళ్లు కొట్టడంతో ప్రేమ అడ్డుగా వెళ్లి వాళ్ళని తిడుతుంది.. ప్రేమ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా పక్కకు వెళ్లి నీకు సంబంధం లేదు అని ధీరజ్ అంటాడు. కానీ ప్రేమ మాత్రం మా అన్నయ్య మీద ఎందుకు చేయి చేసుకుంటున్నారు అని అడ్డుగా వస్తుంది. ఆ మాట వినగానే ధీరజ్ షాక్ అవుతాడు. ఏ తప్పు చేయని మా అన్నయ్యని ఎందుకు కొడుతున్నారు అని ప్రేమ అనగానే రామరాజు ఏంటమ్మా మీ అన్నయ్య ఏ తప్పు చేయలేదా ఏం మాట్లాడుతున్నావ్ అని అరుస్తాడు.

Advertisement

మా అన్న ఇది ఇందులో ఏ తప్పు లేదు ఎందుకు మా అన్నయ్యని కొడుతున్నారు అని ప్రేమ అడుగుతుంది. మా అన్నయ్య అమూల్య వెనకాల పడలేదు అమూల్యనే మా అన్నయ్యని ప్రేమించింది. కావాలంటే మీరు అమూల్యను అడిగి తెలుసుకోండి అని ప్రేమ అంటుంది.. రామరాజు అరవగానే అమూల్యను వేదవతి వెళ్లి తీసుకొని వస్తుంది.. చెప్పవే ఎవరు ప్రేమించారు? నువ్వు ప్రేమించవా? ఆ విశ్వం గాడు ప్రేమించాడు చెప్పవే అని వేదవతి అడుగుతుంది.. ఎంత చెప్తున్నా సరే అమూల్య మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటుంది. కొట్టగానే అమూల్య నేనే ప్రేమించాను అని చెప్తుంది. ఏదో జరుగుతుందని ముందుగానే విశ్వం ప్లాన్ ప్రకారం అమూల్యను ట్రాప్ చేసి చేప్తాడు..

ఇకపోతే అమూల్య చెప్పిన మాట విని సేన రెచ్చిపోతాడు.. ఇన్ని రోజులు నీ కొడుకులకి బుద్ధులు లేవు అనుకున్నాను. ఆఖరికి నీ కూతురికి కూడా అలాంటి బుద్ధిలేని నేర్పించావా అని రామరాజును సేన తిడతాడు. నువ్వు ఏం పెంపకం పెంచావు రా పిల్లల్ని కొంచెం కూడా బుద్ధి లేదా నీకు అని సేన రామరాజు ని దారుణంగా అవమానిస్తూ మాట్లాడుతాడు.. నీ కూతుర్ని నా కొడుకు పై ఉసిగొలిపావా ఎవరైనా మనిషన్న వాడు కొంచెమైనా బుద్ధి ఉంటుంది. నీకు ఏమాత్రం సిగ్గు శరం లేవా అని రామరాజును కడిగిపడేసాడు.. ఆ మాట వినగానే రామరాజు అక్కడి నుంచి వచ్చేస్తాడు.

Also Read : ఆస్తి కోసం పల్లవి, శ్రీయాలు కష్టాలు.. ఏకలింగం పై రాజేంద్రకు అనుమానం.. బయటపడ్డ నిజాలు..

భద్రా, విశ్వం తమ ప్లాన్ వర్కౌట్ అయిందని చాలా సంతోషంగా ఉంటారు.. ఆ రామరాజు మొదటిసారి తలదించుకున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని భద్ర అంటుంది. ఇంకొన్ని రోజులు పోతే ప్రేమ కూడా మన దగ్గరికి వచ్చేస్తుంది అని విశ్వం అంటాడు.. అమూల్యతో పెళ్లయితే ఆ రామరాజు కచ్చితంగా చచ్చిపోతాడు అని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు.. ఇక నర్మద దగ్గరికి వెళ్లిన ప్రేమ తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే నర్మద మాత్రం మాట్లాడదు. గుడిలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ నర్మదా నాతో మాట్లాడ్డానికి నువ్వెవరు నీకు చెప్పడానికి నేనెవరు అని అంటుంది.. ఆ మాట వినగానే ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది అని శ్రీవల్లి డాన్స్ వేస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×