E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్దమైన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today December 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్దమైన మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

చంభా మంత్రం వేసి పిలిచిన గద్ద అమ్ము మీద దాడి చేయడంతో అందరూ భయపడతారు. రాథోడ్‌, అమర్‌ కలిసి అమ్మును హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. మిస్సమ్మను పాపను తీసుకుని చంభా రూంలోకి వెళ్తుంది. పిల్లలను తీసుకుని మనోహరి రూంలోకి వెళ్తుంది. మిస్సమ్మ భయంతో వణికిపోతూ ఉంటే చంభా వాటర్‌ ఇస్తుంది. వాటర్‌ తాగినా కూడా మిస్సమ్మ టెన్షన్‌ పడుతూనే ఉంటుంది. అమ్ముకు ఏమవుతుందో ఏమో అని బాధపడుతుంది. చంబా మాత్రం ఏం కాదు మేడం సార్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు కదా..? సేఫ్‌గానే తిరిగి వస్తుంది అయినా మేడం విచిత్రం కాకపోతే అక్కడ అంత మంది ఉండగా ఆ గద్ద అమ్ము మీదే దాడి చేయడం ఏంటి..? అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది చంభా.

దీంతో మిస్సమ్మ ఏడుస్తూ.. అదే నాకు అర్థం కావడం లేదు యాదమ్మ.. ఏదో పగబట్టినట్టు ఆ గద్ద అమ్ము పైనే దాడి చేసింది అంటుంది. దీంతో చంభా అవును మేడం చూస్తుంటే.. ఆ పంతులు గారు చెప్పిందే నిజం అయ్యేలా ఉంది అనగానే.. మిస్సమ్మ భయపడుతూ లేదు యాదమ్మా లేదు అలా జరగడానికి వీల్లేదు అంటుంది. అలాగే జరగాలని విధి రాసి ఉంటే.. మనం ఏం చేయగలం మేడం అంటుంది. వద్దు అలా మాట్లాడకు అంటుంది మిస్సమ్మ.. దీంతో చంభా ఇవి నా మాటలు కాదు మేడం.. అన్నప్రాసన సమయంలో అమ్ము రక్తం చిందించింది. రాత్రి ఆ కుక్క దాడి చేయడం.. ఇప్పుడు గద్ద దాడి చేయడం ఇవన్నీ చూస్తుంటే.. ప్రకృతి ఏదో హెచ్చిరిస్తున్నట్టు ఉంది మేడం అంటూ మిస్సమ్మను ఇంకా భయపెడుతుంది చంభా. దీంతో మిస్సమ్మ మరింత భయంగా ప్రకృతి హెచ్చరికా..? అని అడుగుతుంది. దీంతో చంభా అవును మేడం మనకు ఏదైనా ఆపద రాబోయే ముందు ప్రకృతి మనల్ని జాగ్రత్త పడమని హెచ్చరిస్తుందట.. ఆ రక్తం.. కుక్క వెంటపడటం.. ఇప్పుడు ఈ గద్ద ఇవన్నీ ప్రకృతి చేసే హెచ్చరికలే.. అయినా కూడా మనం జాగ్రత్త పడకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది మేడం అని చంభా చెప్పగానే..

Advertisement

భయంగా మిస్సమ్మ అలా జరగకూడదు. ఆ ప్రమాదం ఎలాగైనా ఆపాలి.. ఏదైనా చేయాలి.. దాన్ని ఎలాగైనా ఆపాలి  అంటుంది మిస్సమ్మ. కానీ అది మన చేతుల్లో లేదు కదా మేడం.. అంటుంది చంబా.. మరి ఎవరి చేతుల్లో ఉంది. ఎవరు ఆపుతారు.. అని మిస్సమ్మ అడగ్గానే.. అది ఆ పంతులు గారే చెప్పాలి మేడం.. ఒకసారి ఆయన్ని కలిస్తే ఏదైనా పరిష్కారం చెప్తారేమో అంటూ చంభా చెప్పగానే.. పంతులు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది మిస్సమ్మ. అమ్మునో నేనో ఈ ఇంటికి దూరం అవ్వాలని అదే ఈ సమస్యకు పరిష్కారం అని పంతులు గారు చెప్పారు అంటుంది మిస్సమ్మ.. దీంతో చంభా కూడా అవును మేడం నిజమే ఆ విషయం పంతులు గారు నాతో కూడా చెప్పారు.. కానీ దూరం అవ్వడం ఒక్కటే పరిష్కారం కాదేమో మేడం ఇంకేదైనా దారి ఉందేమో అడుగుదాం.. అని చెప్పి.. మనసులో నీకు ఈ విషయం పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఈ బిడ్డ ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అవ్వడమే పరిష్కారం అని నీకు అనిపించాలి  అని మనసులో అనుకుని ఇంకేం ఆలోచించకండి మేడం వెంటనే వెళ్లి పంతులును కలుద్దాం.. అమ్ముకు మరే ఆపద రాక ముందే తనను కాపాడుకుందాం.. అమ్మును మీరు కన్న కూతురులా చూసుకున్నారు మేడం తనను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది.. నిన్న కుక్క ఈ రోజు గద్ద రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.. అని చెప్పగానే.. వెళ్దాం యాదమ్మ పంతులు గారి దగ్గరకు వెళ్దాం అని చెప్తుంది మిస్సమ్మ.

ఇద్దరూ కలిసి పంతులును కలిశాక పంతులు మరోసారి మనోహరి డబ్బులకు ఆశపడి అబద్దం చెప్తాడు. ఈ పాప ఆ పెద్ద పాప ఒకే దగ్గర ఉండకూడదు అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ ఏడుస్తుంటే.. తప్పదమ్మా నువ్వు ఏడు సంవత్సరాలు అజ్ఞాతవాసం చేయాలి అని చెప్పడంతో మిస్సమ్మ ఏడుస్తుంది. తర్వాత ఇంటికి వెళ్లి పిల్లలకు అన్ని జాగ్రత్తలు చెప్పి అమ్మును జాగ్రత్తగా ఉండమని చెప్తుంది మిస్సమ్మ. మిస్సమ్మ మాటలకు పిల్లలు ఆశ్చర్యపోతారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×