E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: రామ రాజు కీలక నిర్ణయం.. ధీరజ్, ప్రేమల మధ్య గొడవ.. విశ్వం వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episode: రామ రాజు కీలక నిర్ణయం.. ధీరజ్, ప్రేమల మధ్య గొడవ.. విశ్వం వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ బాధపడుతూ గదిలోకి వెళ్తుంది. అక్కడే ఉన్న ధీరజ్ ని చూసి ప్రేమ తన కన్నీరుని ఒప్పుకోలేక అతనితో మాట్లాడుతుంది. ఎవరన్నా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు కానీ అత్త అంత మాట అనే లోపల నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. నా జీవితం ఎప్పుడూ బాగుండాలని కోరుకునే అత్త ఇలా చేయడం నాకు నచ్చలేదు అని ప్రేమ బాధపడుతుంది. కానీ ధీరజ్ మాత్రం అమ్మ చేసిన దాంట్లో తప్పేంటి అని అంటాడు. ప్రేమ ఎంత చెప్పినా కానీ ధీరజ్ మాత్రం వినడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది..

నువ్వు చేసిన పనికి మీ నాన్నని నేను ఎన్ని మాటలు అనాలి అని ధీర అనగానే ప్రేమ కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ వెళ్తుంది..శ్రీవల్లి మాత్రం ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని తనకు అడ్వాంటేజ్ గా ఉన్నాయని సంతోషంగా ఉంటుంది.. నర్మదా ప్రేమని ఎందుకు దూరం పెట్టాలి తను చేసిన తప్పేంటి అని అనుకుంటుంది.. అయితే ప్రేమ ఏం చేసినా తను తెలియక చేసింది అని ఆలోచించినా నర్మదా ప్రేమతో మాట్లాడాలి అని వెళుతుంది… కానీ నర్మద ప్రేమలు మాత్రం దగ్గరయినా సరే అసలు విషయం గురించి మళ్ళీ గొడవపడతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రామరాజు అందరితో మాట్లాడాలని అనుకుంటాడు.. అందరూ రాదని ఒక్కొక్కరికి పేరుపేరునా క్లాస్ పీకుతాడు..ఇంట్లో ముగ్గురు మొగాళ్ళు ఉన్నారు కానీ ఎవరూ కూడా చెల్లెల్ని పట్టించుకోవట్లేదు అని రామరాజు సీరియస్ అవుతాడు. మీ ఇంట్లో ఒక చెల్లెలు ఉంది దాన్ని ఎలా చూసుకోవాలి. కాలేజీకి వెళ్తుంది అని అన్నగా ఒక్కరు కూడా బాధ్యతగా లేరు.. మీ గొడవలు నీవే కానీ చెల్లెలు గురించి ఆలోచించే బాధ్యత ఒక్కరి కూడా లేదు అని రామరాజు క్లాస్ పీకుతాడు.. అమూల్య జీవితం ఎటువంటి సమస్యలు పడకూడదని నేను మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నామని అంటాడు. అమూల్యకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాము.. మాట వినగానే అందరూ షాక్ అవుతారు..

అమూల్య చదువుకుంటుంది కదా నాన్న అప్పుడే పెళ్లి చేస్తే తన చదువు మధ్యలోనే ఆగిపోతుంది అని అందరూ అంటారు. చదువు ఆగిపోతుంది అని మీరు అనుకుంటున్నారు కానీ కుటుంబం పరువు పోతుంది అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను నా అభిప్రాయాన్ని మీతో చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను.. అంతేకానీ మీ సలహాలు అడగడానికి నేను మిమ్మల్ని పిలవలేదు ఇదేనా నిర్ణయం ఇదే ఫైనల్ అని రామరాజు అంటాడు. ముఖ్యంగా నీకు పెళ్లి ఫిక్స్ అవుతుంది అని ఆలోచించుకో అని రామరాజు అమూల్యకు వార్నింగ్ ఇస్తాడు..

Advertisement

ధీరజ్ రామరాజు చెప్పిన నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ దగ్గరికి వెళ్లి మీ నాన్న అమూల్య విషయంలో చేస్తుంది కరెక్ట్ కాదురా అని అంటుంది.. మా నాన్న ఏం చేయాలో కూడా నువ్వు చెప్తావా మా నాన్నకి ఏం చేయాలో అన్ని తెలుసు. అమూల్యకి పెళ్లి చేయడం మా నాన్నకు నిర్ణయం ఆ నిర్ణయాన్ని నేను అంగీకరిస్తున్నాను ఇందులో ఎటువంటి మార్పు లేదు అని ధీరజ్ అంటాడు.. ఆ తర్వాత ప్రేమ ఇంత చిన్న వయసులో పెళ్లి చేయడం ఎందుకురా చదువు పూర్తవు అని అంటుంది.. ఏంటి ఈ పెళ్లిని ఆపేసి నువ్వు వెళ్లి మీ అన్నయ్య తో పెళ్లి చేయాలని చూస్తున్నావా అని ధీరజ్ అంటాడు..

ప్రేమ ఎంత చెబుతున్నా సరే ధీరజ్ వినకపోవడంతో ప్రేమ గట్టిగా అరుస్తుంది.. నా గురించి ఆలోచించింది నువ్వు ఇంతేనా అని ప్రేమ అనగానే ధీరజ్ కోపంతో కొట్టడానికి చెయ్యెత్తుతాడు. మా నాన్న ఏం చెప్తే అది మా అందరికీ ఓకే నువ్వు ఉచిత సలహాలు ఇవ్వాలని ప్రయత్నించద్దు.. ఈ ఇంట్లో జరుగుతున్న ఏ విషయంలోనూ నువ్వు అధికారం చలాయించాలని అనుకోవద్దు. నీకు కావాల్సింది చేశావు కదా మీ వాళ్లకు సపోర్టుగా నువ్వు ఎన్ని చేశావో మాకు అందరికీ బాగా తెలుసు.. ఇకమీదట నువ్వు నాతో మాట్లాడడానికి ప్రయత్నించదు అని అంటాడు. మాట వినగానే ప్రేమ షాక్ అవుతుంది..

భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.. అప్పుడే శ్రీవల్లి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది.. ఆ తర్వాత ఏం తమ్ముడు ఏదైనా కొంపలు మునిగే పనా అంతగా పరిగెత్తుకుంటూ వచ్చావు అని భాగ్యం అడుగుతుంది.. కాదమ్మా సంతోషకరమైన వార్త అమూల్యకు మా ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. త్వరలోనే అమూల్య పెళ్లి జరగబోతుంది అని శ్రీవల్లి అంటుంది.. మరి ఆ బండ సచ్చినోడు అమూల్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా.. 10 లక్షలు ఇచ్చి అమూల్యను తనతో పెళ్లి జరిగిన చేయమని చెప్పాడు కదా.. వాడి సంగతి ఏంటి అని భాగ్యం అడుగుతుంది.. దానికి శ్రీవల్లి మేము చాలా ప్రయత్నాలు చేసాము కానీ కుదరలేదు అని చెబుదామని అంటుంది..

ఇప్పుడు అక్కడికి వచ్చినా విశ్వం వీళ్ళ మాటలు వింటాడు.. నువ్వు ఎప్పుడు వచ్చావు అని విశ్వం నీ శ్రీవల్లి అడుగుతుంది.. అమూల్య కి పెళ్లి చేయాలని చూస్తున్నారా అయితే ఏ సంబంధం వచ్చినా నువ్వే చెడగొట్టాలి అని విశ్వం వార్నింగ్ ఇస్తాడు.. అలా చేస్తే మా ఇంట్లో నాకు సమాధి చేస్తారు అది ఆలోచించమని శ్రీవల్లి అంటుంది.. ఏం చేస్తావో నాకు తెలీదు వచ్చిన సంబంధాలను చెడగొట్టు లేదంటే మాత్రం మా ఇద్దరిని కలపడానికి ప్రయత్నించింది నువ్వే అని వాళ్ళకి చెప్పేస్తానని విశ్వం శ్రీవల్లికి షాక్ ఇస్తాడు.. ఏం చెప్పదు నాయన నేనే ఏదో ఒకటి చేస్తాను అని శ్రీవల్లి అంటుంది.

Also Read : ఆరాధ్యకు జ్వరం.. ఏకలింగం దెబ్బకు అక్షయ్ కు షాక్.. అవనికి అవమానం..

ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్లి ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా ఆమె సీరియస్ అవుతూ వస్తుంది.. అమూల్యకు ఇప్పుడే పెళ్లి వద్దు అత్త చదువుకొనివు అని అంటుంది.. మా కూతురికి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలియదా నువ్వు చెప్పాలా అని వేదవతి సీరియస్ అవుతుంది.. లేచిపోయి పెళ్లి చేసుకున్నావు నా కూతురు కూడా అలాగే పెళ్లి చేసుకోవాలా అని అనగానే ప్రేమ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వెళ్లిపోతుంది. అది చూసిన నర్మదా వచ్చి వేదవతి తో మాట్లాడుతుంది. లేచిపోయింది అని నువ్వు అంటున్నావు అంతకన్నా ముందు నువ్వు బయటికి వచ్చావు అది ఆలోచించ అత్తయ్య అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Big Stories

Advertisement
×