E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నోరు జారిన శ్రీవల్లి.. ఇలా బుక్కయ్యిందేంటిరా బాబు..ప్రేమ కోసం ధీరజ్ పోలీస్ డ్రెస్..

Illu Illalu Pillalu Today Episode: నోరు జారిన శ్రీవల్లి.. ఇలా బుక్కయ్యిందేంటిరా బాబు..ప్రేమ కోసం ధీరజ్ పోలీస్ డ్రెస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో కార్తీక నోముల కారణంగా పెట్టుకున్న పూజలకు అందరూ కలిసి పూజకు సిద్ధం చేస్తారు. అందంగా ముస్తాబయి దంపతులు పూజలు కూర్చుంటారు. ప్రేమ మాత్రం ధీరజ్ అన్న మాటలు తలుచుకొని దూరంగా వెళ్లిపోతుంది.. వీరిద్దరిని చూసినా నర్మదా ఏదో జరుగుతుందని అనుకుంటుంది. ప్రేమ చీరని పట్టుకుంటాడు. పట్టుకుంది మధ్యలో విడిచి పెట్టడానికి కాదు. తిరుపతి మీరు పూజ ఉన్నామని అనుకుంటున్నారా? మీ రూమ్ లో ఉన్నారని అనుకుంటున్నారా? ఆ రొమాన్స్ ఏంటి రా అనేసి అంటాడు.. ఇంట్లో అందరూ కూడా వీళ్ళిద్దరిని ఏం చేస్తున్నారు అని అడుగుతారు. మాత్రం వీరిద్దరూ ఏదో చేస్తున్నారు అని అర్థమవుతుంది అంటూ అంటాడు. మీ భర్తల ఆశీర్వాదం తీసుకోండి అని పూజారి అంటాడు..

ప్రేమ కోసం ధీరజ్ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ప్రేమ దగ్గరికి ఒక పేపర్ తీసుకొని వచ్చి ఇస్తాడు.. ఏంట్రా ఇది అని ప్రేమ అడుగుతుంది.. ఏముందో చూడవే మళ్లీ అడగడం ఎందుకు అని ధీరజ్ అంటాడు.. ఎస్సై పోస్ట్ కు ప్రేమ కోసం అప్లై చేసి హాల్ టికెట్ ని తీసుకొస్తాడు ధీరజ్ అది చూసి ప్రేమ సంతోషంతో పొంగిపోతుంది.. సాగర్ తాను ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం చేయలేను అని బాధపడుతూ ఉంటాడు. ప్రేమ నర్మద ఇద్దరూ శ్రీవల్లిని ఇరికించేందుకు భారీ స్కెచ్ వేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఎలాగైనా సరే శ్రీవల్లిని జాబ్ చేయమని అందరి చేత ఒప్పించాలి అని నర్మదా శ్రీవల్లి ప్లాన్ చేసుకుంటారు. రాత్రి భోజనం చేస్తున్న టైంలో శ్రీవల్లిని కావాలని నర్మదా రెచ్చగొడుతుంది. నువ్వు ఉద్యోగం చేయకుండా ఇలా ఖాళీగా ఉండి నీ చదువుకి ఎందుకు అన్యాయం చేస్తావని అంటారు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా జాబ్ చేయాలని కోరుకుంటారు.. నేను జాబ్ చేస్తే అత్తయ్య గారికి సాయం ఎవరు చేస్తారు అని రివర్స్లో అంటుంది.. అత్తయ్య గారికి సాయంగా అన్ని పనులు చేయాలి లేకుంటే ఆవిడ చేసుకోలేదు. వీరిద్దరు కూడా ఎవరి పనిలో వాళ్ళు వెళ్లిపోతారు. దేవత లాంటి అత్తయ్య ఈ వయసులో పనిచేయడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఆవిడకి సాయంగా ఉంటాను అని అంటుంది…

వేదవతి వద్దమ్మా నువ్వు ఉద్యోగానికి వెళ్ళు అనేసి అంటుంది.. మామగారు అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు అంటే ఐదు మందిని కన్న నేను ఇన్ని రోజులు చేసుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నేను చేసుకోలేనా ఏంటి అనేసి అంటుంది. నువ్వు ఇంత చదువు చదివి ఇప్పుడు ఇలా అనడం బాగోలేదమ్మా నువ్వు కూడా రేపటి నుంచి జాబ్ కి వెళ్ళు అని వేదవతి షాక్ ఇస్తుంది.. అందరూ కూడా నీ చదువుకి నువ్వు ఇంట్లో పని చేసుకోవడం బాగోలేదు నువ్వు జాబ్ చేయాల్సిందేనని ఆమోదం చెప్తారు. ఇంట్లో ఆడవాళ్లు ఉద్యోగం చేయడం మావయ్యకి ఇష్టం లేదు ఆయన చెప్తే సరిపోతుంది కదా అని శ్రీవల్లి అనుకుంటుంది..

Advertisement

దేవుడు లాంటి మావయ్య గారు చెప్తే నేను రేపటి నుంచే ఉద్యోగానికి వెళ్తాను అని శ్రీవల్లి అంటుంది.. రామరాజు శ్రీవల్లికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చేస్తాడు. నువ్వు ఉద్యోగం చేసుకో అమ్మ.. రేపు ఒకసారి నీ కల నీ కోరికని ఎందుకు చంపుకోవడం నీ ఇష్టం అమ్మ అనేసి అంటాడు ఆ మాట వినగానే శ్రీవల్లి ముఖంలో రంగులు మారుతాయి. అదేంటి మావయ్య గారు మొన్న ప్రేమ జాబ్ చేస్తుంటే వద్దు అన్నారు.. ఇప్పుడేమో ఇలా అంటున్నారు అని అంటే.. ప్రేమ చదువుకుంటూ జాబ్ చేయడం వద్దు అని అన్నాను.. అది కాక ప్రేమ జాబ్ చేయడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి అని రామరాజు అంటాడు.

Also Read: శ్రీయ పై అక్షయ్ సీరియస్.. షాకైన రాజేంద్రప్రసాద్.. శ్రీకర్ కీలక నిర్ణయం..

ప్రేమ మావయ్య గారే ఆమోదం తెలిపారు.. మరి ఇంకా ఆలస్యం ఎందుకు నీవు రేపు సర్టిఫికెట్లు తీసుకురా ఎంఏ ఇంగ్లీష్ వి.. అలాగే అని శ్రీవల్లి అనుకుంటుంది.. ఇక తర్వాత రోజు శ్రీవల్లి భాగ్యం ఆనందరావుకి చుక్కలు చూపిస్తుంది.. ఐస్మీద నిల్చబెట్టి నన్ను అత్తారింటికి కాదు ఐసియుకి పంపించారు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. వాళ్ళిద్దరూ ఏం జరిగిందని ఎంత చెప్పినా సరే శ్రీవల్లి మాత్రం నా చదువు గురించి అబద్ధం చెప్పి నన్ను ఇరికించేశారు అని అంటుంది. ఏ మాత్రం ఆ సర్టిఫికెట్ రాకుండా నేను చేస్తాను అని అంటుంది. ఇక సాగర్ గదిలో లేకపోవడంతో నర్మదా ఎక్కడికి వెళ్లాడని వెతుక్కుంటూ బయటికి వెళుతుంది. సాగర్ వర్షంలో తడుస్తూ కూర్చో ఉండడం చూసి నర్మదా ఏమైందని అతని తీసుకొని లోపలికి వస్తుంది.. సాగర్ ఎందుకు బాధపడుతున్నావని అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×