E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు కోపం తెప్పించిన ధీరజ్.. భాగ్యం కొత్త ప్లాన్.. వల్లి సేఫ్ అవుతుందా..?

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు కోపం తెప్పించిన ధీరజ్.. భాగ్యం కొత్త ప్లాన్.. వల్లి సేఫ్ అవుతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్ వర్షంలో తడుస్తూ కూర్చో ఉండడం చూసి నర్మదా ఏమైందని అతని తీసుకొని లోపలికి వస్తుంది.. సాగర్ ఎందుకు బాధపడుతున్నావని అడుగుతుంది.. గవర్నమెంట్ జాబ్ చేయాల నాకు నా కోరిక తీరదు అని నాకు అర్థం అవుతుంది అని బాధపడుతూ ఉంటాడు. నువ్వు చాలా మంచి వాడివి.. భార్యను ఎప్పుడూ సంతోషంగా చూడాలని అనుకుంటావు. నీలాంటి మంచి మనసున్న వ్యక్తికి ఏదో ఒక రోజు ఆ దేవుడు కరుణించి మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తాడు నువ్వేమీ బాధ పడవద్దు అని నర్మదా సాగర్ కు పదే పదే చెప్పిన సరే తను మాత్రం మనసులో బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టి చూపించాలి అని అనుకుంటాడు. సాగర్ బాధను ఎలాగైనా సరిపోగొట్టాలి అని నర్మదా అనుకుంటుంది.. ప్రేమ పోలీస్ ఉద్యోగం ఎలాగైనా సరే సాధించాలి అని తెగ కష్టపడి చదువుతూ ఉంటుంది..

అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ నువ్వు బాగానే కష్టపడుతున్నావు. కచ్చితంగా నీకు ఈ జాబ్ వస్తుంది అని అంటాడు. జాబ్ అప్లికేషన్ అయితే తెచ్చావు కానీ కనీసం ఒక ఎంకరేజ్మెంట్ కూడా లేదు. నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు నీకోసం ఇది చేయాలి అని నీకు కనీసం లేదు. నాకు లేకపోవడమేంటి నిన్ను పోలీస్గా చూడాలని నాకు కల అని ధీరజ్ అంటాడు. సరే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అనేసి ధీరజ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ ప్రేమకు ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. ఇందులో ఏముందో చెప్పరా అని అంటే అని ప్రేమ అడుగుతుంది. అందులో ఏముందో నువ్వే ఓపెన్ చేసి చూడు అని ధీరజ్ అంటాడు.. ఆ గిఫ్ట్ బాక్స్ లో పోలీస్ డ్రెస్ ఉండడం చూసి ప్రేమ ఆశ్చర్యంతో షాక్ అవుతుంది.. నేను ఇంకా ఎగ్జామ్ ఏ రాయలేదు కానీ నువ్వేంటి రా అప్పుడే డ్రెస్ కూడా తీసుకొని వచ్చావు అని ప్రేమ అడుగుతుంది. నువ్వు వెళ్లి ఈ డ్రెస్ ని వేసుకోరా ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది అని ధీరజ్ అంటాడు. ప్రేమ ధీరజ్ కోరిక మేరకు వెళ్లి డ్రెస్ ను వేసుకుని వస్తుంది. అది చూసిన ధీరజ్ సంతోష్ పడతాడు.. ఏంట్రా నువ్వు ఈ డ్రెస్సుతో నన్ను చూసి షాక్ అవుతున్నావా..? డ్రెస్ నేను బయటికి వేసుకొని వెళ్తే కచ్చితంగా పోలీస్ అని అనుకుంటారు కదా అని ప్రేమ ఉంటుంది. ఆ మాట వినగానే ధీరజ్ పక్కున నవ్వుతాడు..

నువ్వు ఈ డ్రెస్ లో పొట్టి పోలీసు లాగా ఉన్నావు అని కావాలని ప్రేమకు కోపం తెప్పించేలా చేస్తాడు.. నిజంగానే అలా ఉన్నావు అని అంటాడు.. దానికి సీరియస్ అయినా ప్రేమ ధీరజ్ నీ కొడుతుంది.. తర్వాత భాగ్యం, ఆనంద్ రావు శ్రీవల్లి సర్టిఫికెట్ గురించి ప్లాంటో ఇంటికి వస్తారు.. ఈ ప్లాన్ తో ఇంట్లో వాళ్ళందరినీ మనం బుట్టలో వేసుకోవాలి అని భాగ్యం అనుకుంటుంది. మీరు ఇచ్చిన డబ్బులతో మేము వ్యాపారం పెట్టాము అది బాగా సాగుతుంది అని ఆనందరావు భాగ్యం అంటారు. అంతే కాదు స్వీట్ లిచ్చి వాళ్ళని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తారు..

Advertisement

అయితే మేము డబ్బులు అన్ని పోగొట్టుకొని ఇల్లు మారాం కదా అప్పుడు మా అమ్మాయి వల్లి సర్టిఫికెట్ ఎక్కడ పోయింది వెతికినా కనిపించలేదు అని భాగ్యం అంటుంది.. అదేంటమ్మా మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎలా నన్ను మావయ్య గారు జాబ్ చేయమని చెప్పారు నాకు చేయాలని అనిపించింది. కానీ మీరిద్దరు చేసిన దానివల్ల మావయ్య గారికి కోడలుగా ఆయన కోరిక తీర్చలేకకోడలుగా ఆయన కోరిక తీర్చలేకపోతున్నానని శ్రీవల్లి అనుకుంటుంది.. అక్క వీళ్లు వచ్చిన ప్లాను ఇది అని ప్రేమ అంటుంది.. అర్థమైంది ప్రేమ వీళ్ళకి దిమ్మ తిరిగిపోయే షాక్ నేను ఇస్తాను కదా అనేసి నర్మదా అంటుంది..

ఒరిజినల్ సర్టిఫికెట్ పోయిన ఆన్లైన్ లో డూప్లికేట్ సర్టిఫికేట్ ఇట్లే ఇచ్చేస్తారు నీ చేత సర్టిఫికెట్ తెప్పించి ఉద్యోగం చేపిస్తాము నువ్వేం బాధపడొద్దు అని నర్మదా ప్రేమలు అంటారు.. అవునమ్మా ఏ యూనివర్సిటీలో చదివావో చెప్పు వాళ్ళిద్దరూ చూసుకుంటారు అనేసి రామరాజు అంటాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది.. మీకెందుకమ్మా శ్రమ మా అమ్మాయి చదివిన కాలేజీలో మాస్టర్ మాకు బాగా తెలుసు ఆయన చేత సర్టిఫికెట్ ని తెప్పిస్తాము అని భాగ్యం అంటుంది.. ప్రేమ, నర్మదా మీరు ఏమీ బాధపడకు అక్క నువ్వు కచ్చితంగా ఉద్యోగం చేస్తావు అని అంటారు..

సాగర్ నర్మదా వల్ల నాన్న దగ్గరికి వెళ్లి నాకు ఉద్యోగం రాలేదు అని బాధపడతాడు. మీరు మీ అమ్మాయిని ఇంటికి రానివ్వాలి..నన్ను అల్లుడు అంగీకరించాలంటే ఏం చేయాలో చెప్పండి నేను అది చేస్తాను అని అంటాడు.. నాకోసం అన్ని దూరం చేసుకునే నర్మద కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను చెప్పండి మామయ్య ఏం చేయమంటారు అని అంటాడు.. నువ్వు రైస్ మిల్ లో పని చేస్తున్నావని తప్ప నాకు ఏం కోపం లేదు.. నీకు జాబు ని కొనుక్కునే ఆఫర్ ఒకటి ఉంది.. డబ్బులుతో నీకు ఉద్యోగం వచ్చేలా చేసుకో.. నీ జాబ్ విషయంలో నేను ఇన్వాల్వ్ అయితే నా కూతురు దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను అని అంటాడు.

Also Read : శ్రీకర్ వల్ల బాధపడ్డ రాజేంద్ర..పల్లవికి వార్నింగ్ ఇచ్చిన చక్రధర్.. మీనాక్షి అరెస్ట్..?

ఇక భోజనానికి ఇంటికి వచ్చిన రామరాజుకు ఒక ఫోన్ వస్తుంది.. అతను ఇంగ్లీషులో మాట్లాడటంతో నాకు తెలుగు తప్ప ఏది రాదు అని రామరాజు అంటాడు.. అక్కడే ఉన్న శ్రీవల్లిని చూసిన రామరాజు అమ్మ శ్రీవల్లి ఇటు రా.. మామ్ కోడలు ఎం ఏ ఇంగ్లీషు బాగా మాట్లాడుతుంది ఒక నిమిషం లైన్లో ఉండండి ఇస్తాను అని అంటాడు.. ఆ మాట వినగానే శ్రీవల్లి ఓరి నాయనో అడ్డంగా దొరికిపోయిన సత్యాన్ని దేవుడు అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×