E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: విశ్వం పై అమూల్య రివేంజ్.. వల్లికి, విశ్వంకు మైండ్ బ్లాక్.. సాగర్ దొరికిపోతాడా..?

Illu Illalu Pillalu Today Episode: విశ్వం పై అమూల్య రివేంజ్.. వల్లికి, విశ్వంకు మైండ్ బ్లాక్.. సాగర్ దొరికిపోతాడా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు అమ్మ నర్మదా సాగర్ ఎక్కడ కనిపించలేదు అని అడుగుతాడు.. ఏదో పని ఉందని బయటికి వెళ్లాడు మామయ్య వచ్చేస్తాడు అని నర్మదా అంటుంది.. తనకు జాబ్ వచ్చిన విషయాన్ని చెప్పాలని సాగర్ నర్మదతో చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతుందని అనుకుంటాడు.. కానీ రామరాజు ఎక్కడికి వెళ్లావు అని అడగడంతో ఆ విషయం గురించి చెప్తే తిడతాడు అని భయపడతాడు.. రైస్ మిల్లులో చాలా పనులు ఉన్నాయి అందుకే బయటకు వెళ్లాను అని అంటాడు..

రైస్ మిల్లు పనిమీద వెళ్లావా నేను ఇంకా ఎక్కడికో వెళ్ళావని కంగారు పడ్డాను అని రామరాజు అంటాడు.. అయితే ఏంటి నాన్న ఇందాకటి నుంచి నన్ను వెతుకుతూ పిలుస్తున్నావు ఏదైనా కావాలా అని సాగర్ అడుగుతాడు. వనజ గారు ఇచ్చిన 20 లక్షలు మనం ఇచ్చేయాలి కదరా నువ్వు బ్యాంకులోనే వేసావా అని అడుగుతాడు. ఆ 20 లక్షలు వాళ్ళు ఇప్పుడు అడగలేదు కదా నాన్న మనం ఎందుకు ఇప్పుడు ఇవ్వాలి అని సాగర్ అడుగుతాడు.. ప్రేమ నర్మదా ఇద్దరు కూడా ముగ్గు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది…

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఉదయం నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ముగ్గు వేయడానికి బయటకి వస్తారు.. అయితే నర్మదా ముందుగా రావడం చూసి ప్రేమ ఇద్దరం కలిసి వెళ్తామని అంటుంది. నీకు ఒక న్యూస్ చెప్పాలి ప్రేమా అని నర్మదా అంటుంది.. అలాగే ప్రేమ కూడా నీకు ఒక న్యూస్ చెప్పాలి అక్క అని అంటుంది. ఏంటి ఆ న్యూస్ అని అడగ్గా నాకు ఎస్సై ఎగ్జామ్ కి హాల్ టికెట్ వచ్చింది అని చెప్పగానే నర్మదా సంతోషిస్తుంది. ఇక నర్మదా సాగర్ కి జాబ్ వచ్చింది అని చెప్పగానే ప్రేమ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. ఇతర సంతోషాన్ని చూసిన అమూల్య సంతోషంగా ఉండడం నర్మదా ప్రేమలు చూస్తారు..

అదేంటి అలా దొంగతనంగా చూడడం ఏంటి మామూలుగా వచ్చి చూడొచ్చు కదా అని అడుగుతారు.. నాకు మామూలుగా చూసే అంత ధైర్యం లేదు వదినా అందుకే ఇలా మీ సంతోషాన్ని చూసి నేను సంతోషపడుతున్నాను అని అమూల్య అంటుంది.. నేను చేసిన ఒక చిన్న పొరపాటే ఇప్పుడు ఇలా అందరికీ దూరం చేసింది అదే నాకు బాధగా ఉంది అని అమూల్య బాధపడుతుంది.. ఏం జరగలేదు నిన్ను త్వరలోనే ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అని నర్మదా మాటిస్తుంది. అయితే అమూల్యను విశ్వం బాగా చూసుకుంటున్నారా అని అడుగుతారు. ఇంట్లో రేవతి అత్తయ్య జానకి అమ్మమ్మ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు నన్ను మనిషిగా కూడా చూడడం లేదు ఇక విశ్వక్ అయితే నన్ను ఒక పని మనిషి లాగా చూస్తున్నాడు అని అమూల్య కన్నీళ్లు పెట్టుకుంటుంది..

Advertisement

నువ్వు వాడికి భయపడుతూ ఉంటే నిన్ను ఇంకా వాడు భయపెడతాడు. మాటకు మాట సమాధానం చెబుతూ వాడికి నువ్వు బుద్ధి చెప్పాలి అప్పుడే వాడు నీ దారిలోకి వస్తాడు అని ప్రేమ అంటుంది. నువ్వేం బాధపడకు అమూల్య నీ గురించి మెల్లగా ఇంట్లో వాళ్లకి చెప్పి ఇంటికి తీసుకొస్తామని నర్మదా ప్రేమలు ధైర్యం చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత అమూల్య లోపలికి వెళ్ళగానే విశ్వక్ టిఫిన్ కోసం అరుస్తూ ఉంటాడు.. ఏయ్ పనిమనిషి టిఫిన్ పెడుతూ రా అని అడుగుతాడు.. అమూల్య చాలా కోపంగా తనపై రెవెన్యూ తీర్చుకోవాలని టిఫిన్ పెడుతుంది. సాంబార్ వేడిగా ఉందా లేదా ఒకసారి చూసి వెయ్యు అని అనగానే.. సాంబార్ వేడిగా ఉందో లేదో నువ్వే చూసుకో అని చెయ్యి మీద పోస్తుంది అమూల్య..

అయితే నాకు చెయ్యి కాల్చేసింది అని చాలా గోల గోల చేస్తాడు విశ్వం.. అందరూ విశ్వందే తప్పు అని అంటారు. అమూల్య కావాలనే ఇలా చేస్తుంది అని విశ్వం అనుకుంటాడు.. తర్వాత ఇంకా అలానే ఉంటావ్ ఏంట్రా బర్రె లాగా.. గుడికి వస్తానని మొక్కుకున్నాను. మిమ్మల్ని తీసుకుని గుడికి వెళ్ళాలి అని జానకమ్మ చెప్తుంది.. ఇక తర్వాత రామరాజు కుటుంబం కూడా రామరాజు కోల్కున్నందుకు మొక్కు తీర్చుకోవడానికి అందరూ గుడికి వెళ్తారు. నర్మద చేసిన పనికి ప్రేమ ధీరజ్లు ఇద్దరూ కూడా రొమాంటిక్గా దగ్గరవుతారు.. ఇక గుళ్లోకి వెళ్ళిన తర్వాత మా ఆయన కోలుకొని ఇంటికి వచ్చాడు అందుకే పూజ చేస్తున్నాము మా పేర్ల మీద అర్చన చేయించండి అని వేదవతి అడుగుతుంది.

Also Read : తండ్రి కోసం కొడుకులు ప్రయత్నాలు.. రాజేంద్రను చంపేందుకు ప్లాన్..పల్లవి పై అవనికి అనుమానం..

నర్మదా పూజ కోసం ఇంట్లోని వల్ల పేర్లందరినీ చెప్తుంది. అలాగే అమూల్య పేరు కూడా చెప్పడంతో వేదవతి సీరియస్ అవుతుంది.. ఇక శ్రీవల్లి పొర్లు దండాలు పెడితే దేవుడు కరుణించి మన కష్టాలను తీరుస్తాడు అని భాగ్యం ఆనందరావు అతి కష్టంగా పొర్లు దండాలు పెట్టిస్తారు.. అప్పుడే గుడి లోకి ఎంటర్ అయిన విశ్వక్ అమూల్యలతో పూజ చేయించాలని జానకమ్మ విశ్వక్ని మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు చేయమని అంటుంది.. ఇక అమ్మమ్మ ఏది చెప్తే అది చేయాలి అని విశ్వక్ కూడా ఏమీ మాట్లాడకుండా ప్రదర్శనలు చేస్తాడు. అటు పొర్లు దండాలు పెడుతున్న శ్రీవల్లిని విశ్వక్ గుద్దుకుంటాడు.. ఇదంతా నీ వల్లే జరిగింది రా దొంగ సచ్చినోడా అని శ్రీవల్లి విశ్వక్ని దారుణంగా తిట్టేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు గొడవ పడుతుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ ధీరజ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Big Stories

Advertisement
×