E-Paper
Advertisement

TG Municipal Elections: పోల్ మేనేజ్ మెంట్ పై పార్టీల దృష్టి.. ఇక ఆశలన్నీ అటువైపే..?

TG Municipal Elections: పోల్ మేనేజ్ మెంట్ పై పార్టీల దృష్టి.. ఇక ఆశలన్నీ అటువైపే..?
Advertisement

TG Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో ప్రచారం ముగియడంతో మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిసారించారు. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టిసారించాయి. ఎదురుపార్టీ అభ్యర్థి ఎంతఖర్చు చేస్తున్నాడు.. ఓటర్ కు ఎంత ఇస్తున్నాడు..అనేదానిపై ఫోకస్ పెట్టి దానికంటే ఎక్కువగా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా.. ఎంత ఖర్చుఅయినా ఫర్వాలేదు కానీ గెలిచి తీరాల్సిందేనని అభ్యర్థులు బావించి పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిసారించారు.

అభ్యర్థుల గుండెల్లో రైళ్లు

మున్సిపల్ వార్డుల్లో గెలిస్తే మేయర్ గానీ డిప్యూటీ మేయర్ లేకుంటే చైర్మన్ లేదా వైస్ చైర్మన్ వస్తుందని భావించిన అభ్యర్థులు భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. వార్డుల్లో లేదా డివిజన్లలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిచేందుకు ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు.. మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. ఓటుకు ప్రజలు ఎంత ఆశిస్తున్నారు.. అవతలి పార్టీ ఎంత ఇద్దామనుకుంటోంది.. మన పార్టీ గెలుపుపై ఏమైనా సందేహాలు ఉన్నాయా.. ప్రత్యర్థి ఎత్తులను ఎప్పటికప్పుడు గమనించాలి.. బూత్‌స్థాయిలో నిఘా పెంచండి.. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరును కలవండి.. ఇదీ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల్లోని అభ్యర్ధులు భావిస్తున్నారు. పోలింగ్‌కు ఒకరోజే సమయం ఉండడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రధానంగా పార్టీలు పోల్‌ మేనేజ్‌మెం ట్‌పై ఫోకస్‌ పెట్టాయి. ఈసారి ఎన్నికలను గతం కంటే చాలెంజ్‌గా తీసుకుని ఓటుకు ఎంతైనా ఇచ్చి ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

Advertisement

Also Read: MLA Malreddy Rangareddy: మంత్రి పదవి రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాల్సిందే.. ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు!

ఓటుకు 1500 నుంచి 3వేలవరకు..

మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఇప్పటికే పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రతి ఓటర్ మందు బాటిలు, మహిళకు కూల్ డ్రింక్స్ పంపణీ చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు మాంసం సైతం కొన్ని చోట్ల పంపిణీ చేస్తున్నారు. ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే ఓటుకు 1500 నుంచి 3వేలవరకు పంపిణీ స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఓటర్లు అందుబాటులో లేకుంటే వారికి గూగల్ పే, ఫోన్ పే చేస్తున్నారు. అంతేకాదు వారికి సన్నిహితులతో ఫోన్ చేయిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటే వారిని రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు యువతకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కాలనీల వారీగా యువతకు దావత్ లు, సంఘాలు ఉంటే వారికి ఫండింగ్, అభివృద్ధికి హామీలు సైతం గుప్పిస్తున్నారు. అందుబాటులో ఉంటామని హామీలు ఇస్తున్నారు.

పది మంది ఉంటే వాహనం

Advertisement

బీఆర్ఎస్ పార్టీ తో పాటు ఇతర పార్టీలు సైతం 30మంది ఓటర్లకు ఒకరిని ఇన్ చార్జీగా నియమించారు. ప్రతి ఓటర్ ను పోలింగ్ బూత్ కు తీసుకొచ్చేవరకు వారికే బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు వారికి మంచిచెడ్డా చూసే బాధ్యతలు ఇచ్చారు. ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉంటే మాత్రం వారు వచ్చేందుకు రవాణా ఖర్చులు.. పది మంది ఉంటే వాహనం ఏర్పాటు చేస్తున్నారు. ఓటు వేసి తిరిగి వారి నివాసా ప్రాంతాలకు చేర్చే బాధ్యతను తీసుకుంటున్నారు. ఓటుకు ఇంతా అని చెప్పి అది సఫరేట్ గా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది ఇతర ప్రాంతాల్లో ఉంటే వారికి సైతం ఒక ఇన్ చార్జీని నియమించినట్లు ఓ పార్టీ నేత తెలిపారు.

ఎవరికి పట్టం..

పోలింగ్ కు ఒక్క రోజూ మాత్రమే గడువు ఉండటంతో ముఖ్య నేతలకు పంపకాల బాధ్యతను చేపట్టారు. ఇప్పటికే వార్డులేదా డివిజన్ లోని ప్రతి ఓటర్ ను ఇప్పటికే రెండుమూడు సార్లు కలిశారు. అయితే మళ్లీ ఒక్కొక్కరుగా గడపగడపకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులపైనా దృష్టిసారించారు. ఏది ఏమైనా అన్నిపార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నవారంతా పోల్ మేనేజ్ మెంట్ పైనే దృష్టిసారించారు. అయితే ఎవరికి పట్టం కడతారోనని విస్తృత చర్చజరుగుతుంది.

Also Read: Bigg Boss Soniya : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. ఆస్తులు విలువ ఎంతంటే..?

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×