E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 21st : ప్రేమని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి పంపించాలి అని శ్రీవల్లి ప్లాన్లు మీద ప్లాన్ వేస్తుంది. మొత్తానికి తన ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇక భాగ్యం దగ్గరికి వెళ్లిన ప్రేమ ఈ విషయం చెప్పగానే నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది. ఆ ప్రేమని శాశ్వతంగా వాళ్ళ పుట్టింటికి పంపించేందుకు ఇది ఒక ప్లాను అని శ్రీవల్లి చెప్పగానే భాగ్యం నీ బుర్రె బుర్ర అని పొగడ్తల వర్షం కురిపిస్తుంది. ఆ పొట్టి మిరపకాయని శాశ్వతంగా దాని పుట్టింటికి పంపించేసి జీవితంలో మళ్ళీ మా ఇంటికి రాకుండా చేస్తాను అని శ్రీవల్లి కంకణం కట్టుకున్నట్లు చెబుతుంది.. శ్రీవల్లి రేపు పుట్టినరోజు రణరంగంగా మారబోతుంది. మీరు ఎవరు ఆ పక్కకి రావద్దు అని శ్రీవల్లి భాగ్యంతో అంటుంది.

తిరుపతికి అడ్డంగా దొరికిపోయిన వల్లి..

శ్రీవల్లి తన పుట్టింట్లో తన ప్లాన్ గురించి చెప్తూ ఉండగా.. తిరుపతి సడన్గా ఇంటర్వడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సీరియస్గా శారదాంబ పుట్టినరోజుని ఎలా చెడగొట్టాలని ప్లాన్ చేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన తిరుపతిని చూసి వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయిపోయాయి చూస్తూ ఉంటారు.. ఏంటబ్బాయి తిరుపతి ఎలా వచ్చావు అని అడగగానే సుకన్య ఎక్కడా మై డియర్ లేడీస్ అని అంటాడు.. భాగ్యం మీతో పట్టే కదా వచ్చింది మరి ఎక్కడ మా సుకన్య అని అడుగుతుంది.. ఇక సుక్కు ఎంట్రీ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. హీరోయిన్ లెవెల్ లో ఎంట్రీ ఇవ్వడంతో మా సుకన్య అనే ఆశ్చర్యపోతారు.. అయితే తిరుపతి వల్లి నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావని మొదట అనుమాన పడతాడు. కానీ నువ్వు ఇక్కడ దొరికే ఉన్న సంగతి నేను చెప్పను నేను ఇక్కడ ఉన్నాను అన్న సంగతి నువ్వు ఎవరికీ చెప్పొద్దు అని తిరుపతి శ్రీవళ్ళిద్దరూ అనుకుంటారు..

నర్మద, ధీరజ్ లకు అనుమానం.. 

Advertisement

నర్మద ధీరజ్ ఇద్దరు కూడా నాకెందుకో వీల మీద అనుమానంగా ఉంది వదిన ఎప్పుడు లేనిది ఇలా ఒక్కసారిగా రావడం నిజంగానే చాలా అనుమానంగా ఉంది అని అనుకుంటారు.. అందులో ఆ బద్రావతి మన మీద ఎప్పుడు కాలు రువ్వుతూనే ఉంటుంది అలాంటిది ఇప్పుడు రావడం నాకు నిజంగానే ఎక్కడో కొడుతుంది అని అనుకుంటూ ఉండగా ప్రేమ సడన్గా ప్రేమ సడెన్గా ఎంట్రీ ఇస్తుంది. ఏమైంది ప్రేమ అని ధీరజ్ అడుగుతాడు.. కానీ ప్రేమ మాత్రం నాకు చాలా టెన్షన్ గా ఉందిరా ఎటూ తేల్చుకోలేకపోతున్నాను అని ఏదేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది. ప్రేమ చెప్పిన మాట విన్న ధీరజ్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. మీ వాళ్ళు ఎందుకు ఇలాంటి ప్లాన్ చేశారు అర్థం కాక మేము జుట్లు పీక్కుంటుంటే నువ్వు మాత్రం డ్రెస్ వేసుకోవాలా చుడిదార్ వేసుకోవాలా అని కన్ఫ్యూషన్ లో ఉన్నావా మాతల్లి అంటూ వెటకారంగా మాట్లాడుతాడు.. ఇన్ని రోజుల తర్వాత పుట్టింటి వాళ్ళు వస్తున్నారు అంటే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది కదా అని ప్రేమ ఫీల్ అవుతుంది.

నర్మద పై అలిగిన ప్రేమ.. 

ఇక ప్రేమ నర్మదా అన్న మాట విని అలుగుతుంది.. మా పుట్టింటి వాళ్ళు ఇక్కడికి రాను నీకు ఇష్టం లేదు కదరా అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని ప్రేమ నర్మదా అలాగే ధీరజులపై కోపంగా వెళ్ళిపోతుంది. తన పుట్టింటి వాళ్ళని ఎవరు ఏమనకపోయినా కూడా ఎలా సపోర్ట్ చేస్తుందో చూడు వదిన అని ధీరజ్ అంటాడు. ఆ విషయంలో మీ వదిన పుట్టింటి వాళ్లకి ఫుల్ ఆపోజిట్ అని సాగర్ అనగానే.. ఎవరిని ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు అని నర్మదా అంటుంది.. మొత్తానికి ధీరజ్ నర్మదా సాగర్ లకు భద్ర వల్ల ఎంట్రీపై అనుమానం పెరుగుతుంది..

వేదవతి ఎమోషనల్..

Advertisement

తన పుట్టింటి వాళ్ళు వస్తున్నారు ఇంకా చందమామ వెళ్ళిపోలేదు ఏంటి..? తెల్లవారు లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటారు వేదవతి.. తొందరగా తెల్లవారితే బాగుండు మా అక్క అన్న మన ఇంటికి వస్తున్నారు కదా ఎప్పుడు ఇప్పుడు వాళ్ళని చూద్దామని ఎదురు చూస్తున్నాను అని రామరాజుతో ధీరజ్ తో అంటుంది. ఇక ప్రేమ తన పుట్టింది వాళ్ళకోసం ఎదురు చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉండగా వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్లి తన బాధని పెట్టి ఇంకా అక్క ఎమోషనల్ అవుతుంది.. వీళ్ళిద్దరూ ఎమోషనల్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. పాతికేళ్ల నా నిరీక్షణ ఇప్పుడు తీరబోతుంది అని వేదవతి ప్రేమతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

వెదవవతి హడావిడి..

ఉదయం లేవగానే వేదవతి మా వాళ్ళు వస్తున్నారు అంటూ తన కుటుంబాన్ని మొత్తాన్ని వంటగదిలోకి తీసుకొని వచ్చి తల ఒక పని చెప్తుంది.. వాళ్ళ అమ్మ సంతోషం చూసిన ముగ్గురు కొడుకులు చాలా సంతోషంగా ఉంటారు.. అందరూ కలిసి ఇలా సంతోషంగా ఉండడం చూసి వేదవతి మా వాళ్ల కోసం నేను ఇన్నేళ్లు వెయిట్ చేసాను నాకు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. నా చేతులతో పాతికేళ్ల తర్వాత నా వాళ్లకి భోజనం చేసి పెడుతున్నాను అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అది చూసిన అందరూ కూడా బాధపడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×