Hyderabad City: హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్. నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆలయం పరిసర ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు. వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు సిటీ ట్రాఫిక్ పోలీసులు.
వాహనదారులకు బిగ్ అలర్ట్-హైదరాబాద్ సిటీలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జరుగుతోంది. అమ్మవారి కల్యాణానికి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఈ క్రమంలో ఆలయం పరిసర ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు. ఈనెల 21, 22న బల్కంపేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో ట్రాఫిక్ మళ్లించారు. ట్రాఫిక్ సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.
నేటి నుంచి రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు-ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను గమనించాలని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి ఆలయం వైపు, బేగంపేట కట్టమైసమ్మ ఆలయం నుంచి బల్కంపేట వైపు వాహనాలను అనుమతించలేదు. అలాగే ఎస్సార్ నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు లింక్ రోడ్లను మూసి వేశారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం-గ్రీన్‌ల్యాండ్స్, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్సార్ నగర్ టీ జంక్షన్ వద్ద బికె గూడ మీదుగా మళ్లించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను కొత్త బ్రిడ్జి వద్ద అండర్ పాస్ ద్వారా బేగంపేట వైపు మళ్లించారు. బేగంపేట నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బేగంపేట ఫ్లైఓవర్, సత్యం థియేటర్ మీదుగా గ్రీన్‌ల్యాండ్స్ వైపు డైవర్ట్ చేశారు.
బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్ వరల్డ్ నుంచి వచ్చే వాహనాలను సోనాబాయి టెంపుల్, మైత్రీవనం వైపు డైవర్ట్ చేశారు. ఆర్ అండ్ బీ ఆఫీస్, బల్కంపేట జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్, ఫతేనగర్ అండర్ బ్రిడ్జి, నేచర్ క్యూర్ హాస్పిటల్, సనత్‌నగర్ జీహెచ్‌ఎంసీ మైదానంలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు.
ALSO READ: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626 ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆఫీసులకు బయలుదేరే ఉద్యోగులు ముందుగా ప్లాన్ చేసుకోవాలని కోరారు ట్రాఫిక్ పోలీసులు.