E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: పుట్టింటికి వెళ్లిన ప్రేమ.. భద్రకు స్ట్రాంగ్ వార్నింగ్.. నర్మదా ప్లాన్ తో శ్రీవల్లికి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: పుట్టింటికి వెళ్లిన ప్రేమ.. భద్రకు స్ట్రాంగ్ వార్నింగ్.. నర్మదా ప్లాన్ తో శ్రీవల్లికి షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 9th ప్రేమ ఇదంతా తన వల్లే జరిగింది అని బాధ పడిపోతూ ఉంటుంది. నేనే గనక వాడి దగ్గర లేకున్నా అంటే వాడు సంతోషంగా ఉంటాడు కదా అని ఉదయం లేవగానే ప్రేమ రెడీ అయ్యి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది.. బయట సుకన్య అది చూసి ప్రేమ వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతుంది అని వల్లితో చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వల్లితో చెప్పగానే వల్లి నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచి సంతోషంగా ఉంటుంది. ప్రేమ కోసం వెతుకుతూ వెళ్ళిన నర్మదా ప్రేమ తన పుట్టింటికి వెళ్లడంతో అక్కడికి వెళుతుంది.. తన పుట్టింట్లోకి అడుగుపెట్టిన ప్రేమ నేను వచ్చేసాను అత్త అని అనగానే.. భద్ర చాలా సంతోషంగా ఉంటుంది నర్మద మాత్రం షాక్ అవుతుంది..

ప్రేమ వచ్చిందిరా.. రండి..

అత్త నేను ఆ ఇంటిని వదిలేసి శాశ్వతంగా ఇక్కడికి వచ్చేసాను అని ప్రేమ చెప్పగానే భద్ర సంతోషంతో గాల్లో తేలిపోతుంది.. అరె సేన విశ్వం రేవతి అందరూ రండి ప్రేమ మన ఇంటికి శాశ్వతంగా వచ్చేసింది అని అంటుంది భద్ర.. ఏంటి ప్రేమ వచ్చేసిందా ఏంటి అక్క నువ్వు చెప్పేది అని సేన చాలా సంతోషంగా అక్కడికి వస్తాడు.. అయితే రేవతి అలాగే వాళ్ళ అత్తయ్య ఇద్దరు ఏంటి ప్రేమ వచ్చేసిందా అని షాక్ అవుతారు.. నేను మీ ఇంటికి శాశ్వతంగా వచ్చేస్తే ధీరజ్ని వదిలేస్తారు అని చెప్పావు కదా మరి ఇప్పుడు వచ్చేసాను కదా అత్త వాణ్ని విడిచి పెట్టమని చెప్పు అని ప్రేమ అంటుంది.

దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రేమ..

Advertisement

ప్రేమ ఇక్కడికి వచ్చేసావు కదా ఇంకా వాడు కట్టిన తాళి నీ మెడలో ఎందుకు అని భద్ర దాన్ని తీసి అవతల పడేయమని తీస్తుంది. నేను వచ్చేసాను అంటే నువ్వు నమ్మేసావా అత్త అని పగలబడిన నవ్వుతుంది ప్రేమ.. అయితే ఏంటి నువ్వే కదా వచ్చేసాను అని చెప్పావు మళ్లీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రేమని అడుగుతుంది భద్ర. మీరు మమ్మల్ని ఎంత దూరం చేయాలనే చూస్తే మేము అంత దగ్గరవుతాము. ఇది మీకు చెప్పడానికే నేను వచ్చాను అని ప్రేమ భద్రకి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తుంది. వాడు జైల్ నుంచి బయటికి రావడం జరగదు జీవితాంతం జైల్లోనే ఉండిపోతాడు అనే సేన అనగానే మరి కాసేపట్లో ధీరజ్ ని బయటకి తీసుకొని వస్తాను అని ప్రేమ వార్నింగ్ ఇస్తుంది..

నర్మదా హ్యాపీ.. వల్లి షాక్..

ప్రేమ ఆ మాట అనగానే నర్మదా చప్పట్లు కొడుతూ విజిల్ వేస్తుంది.. రామరాజు కోడలుగా మేము ధీరజ్ని బయటికి తీసుకుని వస్తాము అని ఛాలెంజ్ చేసి ఇద్దరు బయటికి వస్తారు.. ఇక తర్వాత బయటకు రాగానే శ్రీవల్లి సుకన్య ఇద్దరు కూడా నిజంగానే వీళ్ళు అన్నట్లుగా ధీరజ్ ని బయటకు తీసుకొస్తారేమో అని కంగారు పడిపోతూ ఉంటారు. నర్మదా లాయర్ కి ఫోన్ చేసి అడిగిన తర్వాత అతను కష్టమని చెప్పగానే మళ్లీ శ్రీవల్లి సుకన్య ఇద్దరు చాలా సంతోషంగా డాన్సులు వేస్తూ ఉంటారు. ధీరజ్ ఇక జీవితాంతం జైల్లోనే ఉంటాడు బయటికి రాడు అని ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఉంటారు..

సీసిటీవీ పుటేజ్ తో హ్యాపీ..

Advertisement

నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఎక్కడైతే పోలీసులు ధీరజ్ని అరెస్ట్ చేశారు అక్కడికి వెళ్తారు. అక్కడ ఉన్న షాప్ దగ్గర సీసీటీవీ కెమెరాలు ఉండడం చూసి వాళ్ళు లోపలికి వెళ్లి అతని బలవంతంగా భయపెట్టి మరి ఫుటేజ్ని చూస్తారు. అయితే ఇందులో ధీరజ్ తప్పేమీ లేదు అని తెలుసుకోవడానికి అతని పట్టుకోవాలి అని అనుకుంటారు. దాంతో ప్రేమ నర్మదలు ఈ ఫుటేజ్ ని పోలీసులకు చూపిస్తే వాళ్లే ధీరజ్ ని వదిలిపెడతారు అని అనుకుంటారు. నర్మదకు సీసీటీవీ ఫుటేజ్ లోని బండి నెంబర్ దొరికిందని ట్రాఫిక్ కానిస్టేబుల్ తో డీటెయిల్స్ కోసం పంపిస్తుంది. వేదవతి మాత్రం తన కొడుకు అరెస్టు చేయడం బాధ పడిపోతూ ఉంటుంది. అమూల్య చిన్నన్నయ్యకు ఏమి కాదమ్మా అన్నయ్య త్వరగా బయటికి వస్తాడు నువ్వేమీ బాధపడకమ్మా అని ఓదారుస్తూ ఉంటుంది.. అటు రామరాజు తన కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.    అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ధీరజ్ రిలీజ్ అవుతాడా? లేదా? అన్నది చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణిని చితక్కొట్టిన స్వామీజీ.. బాలుకు షాకిచ్చిన పోలీస్.. అయ్యో పాపం రోహిణి..

Related News

Ninnu kori Serial Today Episode September 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జగదీశ్వరికి ఫోన్ చేసిన విరాట్ – షాక్ అయిన షాలిని

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అడ్డంగా దొరికిన పల్లవి.. చివరిలో ట్విస్ట్..

Thursday Movies in Tv : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

ఆటో రాంప్రసాద్ కు ఓటు వేయద్దు.. ఫాన్స్ కు రిక్వెస్ట్ అంత పగేంటి ఉప్పల్ బాలు!

యాంకర్ గా తొక్కేయడంతోనే ఉదయభాను నిర్మాత అయ్యారా?

యూట్యూబర్ నందన కేసులో బాధితుడు చెప్పిన నిజాలు!

సామాన్యుడిపై సెలబ్రిటీస్ ప్రతాపం.. కప్పు కొట్టేస్తాడని భయమా?

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాద ఉండదు .. నాగార్జునకు బిగ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×