E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: అమూల్యకు షాకిచ్చిన భద్ర.. కన్నీళ్లు పెట్టుకున్న నర్మద.. రామారాజుకు నిజం చెప్పిన ధీరజ్..

Illu Illalu Pillalu Today Episode: అమూల్యకు షాకిచ్చిన భద్ర.. కన్నీళ్లు పెట్టుకున్న నర్మద.. రామారాజుకు నిజం చెప్పిన ధీరజ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా వేదవతి తో ఎంతగా మాట్లాడాలని చూసినా సరే.. వేదవతి మాత్రం నర్మద మాట వినకపోవడంతో పాటుగా వల్లికి అనుకూలంగా ఉంది అని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నాతో ఎవరూ మాట్లాడాల్సిన పనిలేదు అని వల్లితో అంటూనే.. తలకి నూనె పెడతాను తీసుకురా పో అని మళ్లీ నేను పంపిస్తుంది వేదవతి. అయితే వల్లి రాగానే తలకి కొబ్బరి నూనె పెడుతూ వేదవతి నర్మదపై సీరియస్ అవుతుంది.. అటు నర్మదా ఎంతగా మాట్లాడాలి అని అనుకుంటున్నా సరే వేదవతి మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. చేసినంత చేసి ఇప్పుడు అత్తయ్యని నైస్ గా మాట్లాడితే ఎలా కరిగిపోతాను అని అంటుంది. ఇక తర్వాత వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా నర్మదా పిలుస్తుంది. ప్రేమ ఎలాగైనా సరే సెంటిమెంటల్ గా కొట్టాలి అని నర్మదని కావాలని కింద పడేస్తుంది.. ధీరజ చెప్పిన ప్లాన్ ప్రకారం ప్రేమ కాసేపు నన్ను అత్తయ్య అనుకో అక్క ఏం చెప్పాలనుకుంటే అది చెప్పు అనేసి ప్రేమ అంటుంది నర్మదా చెప్పబోతూ ఉండగా ప్రేమను పక్కన పడేసి వేదవతి దగ్గరికి వెళుతుంది నర్మదా.. మొత్తానికి నర్మదా పై వేదవతికి కోపం పోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అమూల్య తో పాటుగా భద్ర అందరు కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు.. భద్ర ఆ రామరాజు మొహం తలుచుకుంటూ అన్నం తింటుంది పొరమాలడంతో అందరూ ఏమైందనుకుంటారు.. ఇది అన్నం గొంతులో అడ్డు పడినప్పుడు వచ్చినా పోరమాలుడు కాదు. ఆ రామరాజు కన్నీళ్లు పెట్టుకున్న మొహానికి గుర్తు చేసుకోవడం వల్ల వచ్చిన ఇది అని భద్ర అంటుంది.. ఆ రామరాజు ఎంతగా అవమానంతో తలదించుకున్నాడు మనం చూశాం కదా అది నాకు ఇప్పటికీ సంతోషాన్ని ఆపుకోలేనంతగా ఇచ్చేసింది అని భద్ర అంటుంది. వాడు అందరి దగ్గర అవమానపాలవ్వడం నేను చూడాలి అనుకున్నాను అది ఇప్పటికి జరిగింది అని చాలా సంతోషంగా ఉంటుంది భద్ర. ఏంటి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నారు అని అమూల్య అంటుంది. మీరు కొంచమైనా ఆలోచించరా ఎందుకు మా నాన్న చెడు కోరుకోవాలి అనుకుంటారు అని అమూల్య అంటుంది.. మీరు ఎంతగా మా నాన్నని ఇబ్బంది పెట్టాలని చూసినా మీరు బాగుండాలని కోరుకునే వాడే మా నాన్న అని తన తండ్రి గురించి గొప్పగా చెప్తుంది అమూల్య..

Advertisement

నా మేనల్లుడు ఒక జమీందారు వంశానికి చెందిన వాడు అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటేనే నీ తల్లిదండ్రులు అవమానంగా ఫీల్ అవుతున్నారు.. మా ఇంట్లో పనోడిని మా చెల్లెలు పెళ్లి చేసుకుందంటే మాకు ఎంత అవమానంగా ఉంటుంది దాంతోనే మా నాన్న చచ్చిపోయాడు అని భద్ర అంటుంది. సేనా నీ భార్య నేను కంట్రోల్లో పెట్టుకోరా అనేసి విశ్వకు చెప్పేస్తాడు. రామరాజు బాధపడిపోతూ ఉంటాడు. అక్కడికొచ్చిన వేదవతి ఏంటండీ దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది… నన్నే ఇంతగా అవమానిస్తున్నారు అంటే అమూల్యని ఇక ఎంతగా అవమానిస్తున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని బాధ పడిపోతుంటాడు రామరాజు.. అమూల్యని మన ఇంటికి వచ్చే మని చెప్పేద్దామని అనుకుంటున్నాను అని రామరాజు అంటాడు.

కానీ వేదవతి మాత్రం ఏం పర్లేదు మనల్ని వదిలేసి వెళ్ళింది కదా అది అక్కడే ఉన్నాను ఇవ్వండి అని అంటుంది. ఇక తర్వాత ప్రేమ నువ్వు కారు కొనాలనుకున్న విషయాన్ని మీ నాన్నకు చెప్పు లేకపోతే మీ అన్నయ్య లాగా నువ్వు కూడా చెప్పలేదని అనుకుంటాడని రామరాజు దగ్గరికి తీసుకొని వెళుతుంది. ధీరజ్ మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు.. ఏంట్రా ఏం చెప్పాలనుకుంటున్నావో అని రామరాజు అడుగుతాడు.. వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర కారుకు డ్రైవర్ గా పనిచేయడం కన్నా నా కాళ్ళ మీద నేను నిలబడాలని ట్రావెల్ ఏజెన్సీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నాన్న ఒక కారుని కూడా కొంటున్నాను అని అంటాడు. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చాను రేపు ఎల్లుండి అక్క కారు కూడా మన దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్తాడు..

Advertisement

ఆ మాట వినగా అన్నానంటే అన్నాను అంటారు గానీ.. అక్కడ ఇక్కడ ఎండకి వానకి అలా చేయడం ఎందుకు రైస్ మిల్లులో ఎంచక్కా పని చేయొచ్చు కదా అని వేదవతి అంటుంది.. ఇక తర్వాత వేదవతి మాట విన్న ప్రేమ రైస్ మిల్ ని ఎవరు చూసుకుంటారు అని అనగానే ధీరజ్ చూసుకుందామని ముందు వచ్చాడు.. అంతలోపే చందు బావ నేను చూసుకుంటాను అని అన్నారు కదా అందుకే ధీరజ్ ఇలా సొంతంగా కారు నడపాలని అనుకుంటున్నాడని ప్రేమ అంటుంది. అయితే ఇప్పుడు రైస్ మిల్ కి వెళ్ళొచ్చు కదా అని వేదవతి అంటుంది. కానీ రామరాజు మాత్రం వాడికి ఇష్టం లేదు కదా బలవంత పెట్టవద్దు. వాడి ఇష్టం వచ్చినట్లు చేయనివ్వు అనేసి అంటాడు.. వీడు ఇంకా చెప్పాడు నడిపోడు లాగా చెప్పకుండా వేరే వాళ్ళ డబ్బులు తీసుకొని జాబ్ కొనుక్కోలేదు కదా అని రామరాజు అనగానే సాగర్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు.

Also Read : పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. పల్లవిని ఇరికించిన చక్రధర్..అవనికి నిజం తెలిసిపోతుందా..?

ఏంటి సాగర్ నువ్వు చేస్తున్నది ఏం చేస్తున్నావు అని నర్మదా అడుగుతుంది.. నాకు ఇష్టమైన జాబును చేయాలి అనుకోవడం కూడా తప్పేనా? మా నాన్న ఇంతే నర్మదా ఇక ఎప్పటికీ మారడు అని సాగర్ అంటాడు. నువ్వు కేవలం మీ నాన్నకి చెప్పాలని అనుకున్నావు అంతే.. ఎవరైనా కూడా ఆయన ప్లేస్ లో ఉంటే అలానే అనుకుంటారు అని నర్మద ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా సరే.. సాగర్ మాత్రం మా నాన్న ఇంతే నన్ను ఇంతే అర్థం చేసుకుంటాడు అని బాధపడిపోతూ ఉంటాడు.. ఆ తర్వాత రాత్రి అవ్వగానే ప్రేమకు ధీరజ్సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాడు.. అందరిని రమ్మని చెప్పి కేక్ కటింగ్ కి పిలుస్తాడు.. అది చూసిన ప్రేమ షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×