E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు దగ్గరవుతున్న ధీరజ్.. కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్న రేవతి.. ధీరజ్ ఎంట్రీతో సీన్ రివర్స్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు దగ్గరవుతున్న ధీరజ్.. కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్న రేవతి.. ధీరజ్ ఎంట్రీతో సీన్ రివర్స్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ నర్మదలు ఆ వల్లిని చూసి తెగ నవ్వేసుకుంటూ ఉంటారు. ఇకమీదట టార్చర్ ఏంటో వల్లికి చూపించాలి అని అనుకుంటారు. తను బ్రతికినంత కాలం మనల్ని గుర్తు తెచ్చుకొని గుక్క పట్టి ఏడుస్తుంది అని ప్రేమ నర్మద ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇద్దరు కూడా వల్లిని ఎంత బాగా ఏడిపించాము అని నవ్వేసుకుంటూ ఉంటారు. అత్తయ్య దెయ్యం పట్టిందని చీపురుతో బాధింది కదా అది మాత్రం హైలెట్ అని ప్రేమ అంటుంది.

ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉండగా ప్రేమకి కడుపులో నొప్పి వస్తుంది.. ఏమైంది ప్రేమ ఇంత సడన్గా ఇలా మారిపోయావ్ ఏంటి అని నర్మదా అడుగుతుంది.. రెండు రోజుల నుంచి నేను ఏమి తినలేదు అక్క అందుకే నాకు కడుపులో నొప్పి వస్తుంది.. ధీరజ్ నాతో మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంటుంది అందుకే తినబుద్ధి కావడం లేదు అని ప్రేమ అంటుంది.. ప్రేమ అన్నం తినలేదని తెలుసుకున్న వేదవతి అన్నం తీసుకువచ్చి పెడుతుంది. మీరిద్దరూ నాకు కోడలు కాదే కూతుర్లు అని వాళ్ళిద్దర్నీ దగ్గరకు తీసుకుంటుంది.. శ్రీవల్లి మాత్రం నా మీద అందరూ కక్ష కట్టారు అని బాధ పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ధీరజుని ఎలాగైనా సరే లోపలికి తీసుకురావాలి అని ప్రేమ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.. వీరిద్దరి మధ్యలో ఒక డ్యూయేట్సాంగ్ కూడా వస్తుంది.. ఇక చేసేదేమీ లేక ప్రేమ కూడా ధీరజ్ పక్కన పడుకుంటుంది.. దాదాపు వీళ్ళిద్దరూ కలిసిపోయారు అని అందరూ అనుకునేలా ఒక్కచోట పడుకొని ఉంటారు.. మధ్యలో మేలుకొన్న ధీరజ్ పక్కన ప్రేమను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ప్రేమను పక్కనుంచి లేచి ప్రేమకు దుప్పటి కప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లేచి చూసిన ప్రేమ ధీరజ్ కి నా మీద కోపం తగ్గింది అని చాలా సంతోష పడిపోతూ ఉంటుంది.. ఇక తర్వాత ప్రేమ ధీరజ్ ఎలాగైనా సరే నన్ను దగ్గర తీసుకుంటాడు అని మురిసిపోతూ ఉంటుంది..

భద్రాసేన ఇద్దరు కూడా విశ్వం తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. పోలీసులు ఇలా అంటున్నారు ఏంట్రా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. మీరిద్దరూ కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. మీ పగలకు నా కొడుకుని వాడుకుంటారా అని రేవతి ఇద్దరిపై రెచ్చిపోయి మాట్లాడుతుంది.. ఇక మీరు నా కొడుకుని బయటకు తీసుకొస్తారా లేదా అని రేవతి అడుగుతుంది. తీసుకురావడం కష్టమేనని పోలీసులు అంటున్నారు కదా ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు మధ్యలో నీదేంది అని సేన అంటాడు.. బయటికి తీసుకురావాలంటే వెళ్లి నీ ముద్దుల కూతురు ప్రేమను బ్రతిమలాడు అది నీ కొడుకును బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అని రేవతిని భద్ర రెచ్చగొట్టి పంపిస్తుంది.

Advertisement

ప్రేమని అడుగుతాను. అవసరమైతే ప్రేమ కాలు కూడా పట్టుకుంటాను. నా కొడుకుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయమని వేడుకుంటాను అని రేవతి బయటకు వెళ్తుంది. శ్రీవల్లి తన గురించి నర్మదా ప్రేమలకు తెలిసిపోయింది అన్న విషయాన్ని ఎలాగైనా సరే వాళ్ళ అమ్మతో చెప్పాలని అనుకుంటుంది.. ఈ విషయాన్ని ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి చెప్పగానే భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇలా జరిగిందేంటి? మీరు ఏమి చేయలేరు అని నాకు అర్థం అయిపోయింది నేను ఏదో ఒకటి చేసి వస్తాను అని శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది.

శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉండగా చందు వచ్చి వెనకాల గట్టిగా హాగ్ చేసుకుంటాడు.. నేను పడిపోతున్న టెన్షన్లో ఈ రొమాన్స్ ఒకటి ఏం చేయాలి రా దేవుడా చచ్చిపోతున్నాను అని శ్రీవల్లి అనుకుంటుంది.. ఏదో ఒకటి చెప్పి చందు ని పంపించేస్తుంది. ఇక నర్మదా ముగ్గు వేస్తుండగా ప్రేమ అక్క అని అరుస్తూ బయటకు వస్తుంది. ధీరజ్ నామీద దుప్పటి కప్పాడు అంటే నాపై కోపం తగ్గినట్లే కదా అని ప్రేమ నర్మద ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.. అప్పుడు అక్కడికి వచ్చిన రేవతి ప్రేమ నీతో ఒక విషయం మాట్లాడాలి అని అడుగుతుంది.. మీ అన్నయ్యని ఎలాగైనా సరే నువ్వే బయటికి తీసుకురావాలి అని రేవతి అడగగానే ప్రేమ సీరియస్ అవుతుంది.. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాడిని.. ఎలా బయటికి తీసుకురావాలమ్మా ఒకవేళ నా చేతుల్లో ఏదైనా ఉన్నా కూడా నేను తీసుకురాను అని ప్రేమ అంటుంది. ఆడపిల్ల జీవితంతో ఆడుకునే వాడికి అలానే జరగాలి అని ప్రేమ రేవతి తో అంటుంది..

Also Read : రాజేశ్వరికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లోంచి బయటకు వెళ్తున్న శ్రీయ.. అల్లుడికి చక్రధర్ సాయం..

అందరూ అక్కడికి వచ్చిన తర్వాత ధీరజ్ ఏంటి పొద్దు పొద్దున్నే మా ఇంటి ముందర డ్రామాలు మొదలు పెట్టారు ఇంకా ఏదైనా చేయాలనుకుంటున్నారా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా కొంచెం అయినా ఆలోచించి మాట్లాడు అని వేదవతి అంటుంది. ఇప్పుడు ఈ డ్రామా ని మొదలుపెట్టడానికి కారణం ఏంటి మీకు ఏం కావాలో చెప్పండి అని ధీరజ్ అడుగుతాడు. నా మేనల్లుని బయటికి తీసుకురావాలి అని భద్ర అడగగానే 10 నిమిషాల్లో నీ మేనల్లుడు నీ ఇంటి ముందు ఉంటారు. కానీ నువ్వు ముందు మా నాన్న కాలు కడిగి ఆ నీళ్ళని నితిన్ చల్లుకోవాలి అని ధీరజ్ కండిషన్ పెడతాడు.. ఆ మాట వినగానే సీరియస్ గా తయారైన భద్ర అవసరమైతే తల తీసేయి నా పగని తీర్చుకుంటాను కానీ ఆడి కాళ్లు నేను కడగడమేంటి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ సీను ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×