E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రాజేశ్వరికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లోంచి బయటకు వెళ్తున్న శ్రీయ.. అల్లుడికి చక్రధర్ సాయం..

Intinti Ramayanam Today Episode: రాజేశ్వరికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లోంచి బయటకు వెళ్తున్న శ్రీయ.. అల్లుడికి చక్రధర్ సాయం..
Advertisement

Intinti Ramayanam Today Episode March 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేశ్వరికి వాటర్ తీసుకురమ్మని చెప్పగానే రాజేశ్వరి పని మనిషికి నీళ్లు ఇవ్వమని చెప్తుంది.. చుట్టాలకి ఇచ్చినట్టు ఇంట్లో వాళ్లకి ఇంటి ఓనర్ కి పనిమనిషితో ఇలా మర్యాదలు చేయించకూడదు అని చక్రధర్ సీరియస్ అవుతాడు. నా తప్పు తెలుసుకొని నేను చాలా మారిపోయాను కానీ నాకు కోపం ఆవేశం అలానే ఉన్నాయి. ఏం చేయాలో అది చేస్తాను అని చక్రధర్ అంటాడు. నీ అంతటి నువ్వు నాకు భోజనం వడ్డించేంతవరకు నేను మెతుకు కూడా ముట్టను అని చక్రధర్ భీష్మించుకుని కూర్చుంటాడు. ఆయన నా కళ్ళ ముందర చచ్చిపోయిన పర్వాలేదు కానీ నేను మాత్రం ఆయన దగ్గరికి పోను అని రాజేశ్వరి కూడా పంతం పడుతుంది. భానుమతి ఎంత చెప్పాలని చూసినా కూడా రాజేశ్వరి కూడా మొండిగా ఉండడంతో ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక పార్వతి రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్లి అవని కన్న తండ్రి ఎవరో చక్రధర్ చెప్పేసాడు అండి అని అంటుంది . వాళ్ళిద్దరూ ఇన్ని రోజులు ఎన్నో అవమానాలు పడ్డారు ఇప్పుడు వాళ్ళ తండ్రి ఎవరో తెలిసి చాలా సంతోషంగా ఉన్నారు. అవని కూడా తన తండ్రిని నాన్న అని పిలుస్తుంది అని పార్వతి అంటుంది. పల్లవి నేనే తండ్రి కూతుర్లను ఒక్కటి చేసానా? అని ఫీల్ అవుతూ.. అవనిని ఎలాగైన చంపాలని ఫిక్స్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. తండ్రికి భోజనం తీసుకుని వెళ్లి ప్రేమగా వడ్డించాలని అనుకుంటుంది. ఏంటమ్మా నువ్వు ఈ టైంలో అల్లుడుగారు వచ్చారా ఏంటి అని అడుగుతాడు చక్రధర్.. లేదు నాన్నా మీరు భోజనం చేయలేదని అన్నారు అందుకే నేను నా చేతులతో నేను వండి తీసుకొని వచ్చాను అని అవని అంటుంది. మీ పిన్ని ఎంత మొండిగా ఉందో మారడం లేదు అని చక్రధర కూడా అంటాడు. పిన్నికి మీరంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిమ్మల్ని జైలు నుంచి తీసుకురాలేదని నన్ను ఆయన్ని రోజు వచ్చి తిట్టేది మీ మీద అంత ప్రేమ ఉంది అని అవని అంటుంది.

Advertisement

తను మొండిగా ఉంది ఎప్పుడు మారుతుందో అర్థం కావడం లేదు అని చక్రధర్ బాధపడతాడు. సరే నాన్న మీరు అవన్నీ పక్కన పెట్టేసేయండి టైం కి తిని మందులు వేసుకోవాలి కదా అందుకే మీకు నేను భోజనం తీసుకొచ్చాను అని అవని అంటుంది.. ఇక తన తండ్రికి గోరుముద్దలు పెడుతుంది. తన తండ్రికి అవని గోరుముద్దలు తినిపిస్తుండగా రాజేశ్వరి అక్కడికి వచ్చి ఆ ప్లేటును విసిరి కొడుతుంది. కన్న తండ్రికి ఆకలితో ఉన్నాడని భోజనం తీసుకొచ్చి గోరుముద్దలు తినిపిస్తున్నావా అని రాజేశ్వరి అంటుంది. ఇవాళ గోరుముద్దలు తినిపించావు రేపు ఈ ఇంట్లోకి వచ్చి నాకు నా కూతురికి అన్యాయం చేయాలని అనుకుంటున్నారా..? మీరు ఎలాగూ మీ తండ్రికి దూరమయ్యారు.

నన్ను నా కూతుర్ని కూడా అలాగే ఈ ఇంటికి దూరం చేయాలని చూస్తున్నారా అని రాజేశ్వరి కఠినంగా మాట్లాడుతుంది. మీ కోపంలో అర్థం ఉంది పిన్ని కానీ మీకు మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను. మాకు మా నాన్న ఎవరు అన్నది తెలుసుకోవాలని తప్ప. మాకు మీ ఆస్తిలో వాటని మీ ఇంట్లో హక్కుని అడగాలని ఎప్పుడూ లేదు అని అవని అంటుంది. మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు నా తండ్రి తినలేదు అని భోజనం తీసుకొచ్చాను అంతే తప్ప మాకు ఎటువంటి హక్కులు మీ నుంచి అవసరం లేదు అని రాజేశ్వరితో కఠినంగా మాట్లాడుతుంది అవని.

Advertisement

ఇక భానుమతి ఏవే నేను పార్వతితో నా బాధని వెళ్ళబోసుకుంటే నువ్వు భోజనం తీసుకొని వచ్చావా అని అంటుంది. తప్పులేదు బాబు గారు కన్న తండ్రి భోజనం తినకుండా ఇలా ఉన్నాడు అని అనుకోగానే నా మనసు ఉండలేకపోయింది అందుకే భోజనం తీసుకుని వచ్చాను అని అంటుంది భానుమతి. ఇక అక్కడి నుంచి వచ్చేసిన అవనీని ఇంట్లో ఎదురుగా ఉన్న పల్లవి ఆపుతుంది. ఎందుకు ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నావో నాకు అర్థం అయిపోయింది నీ తండ్రికి భోజనం తీసుకుని వెళ్లాను అని మీ అమ్మ నీకు ఆల్రెడీ చెప్పే ఉంటుంది. నీ తండ్రి నా తండ్రి అని చెప్పుకోవడం నువ్వు సహించ లేకపోతున్నావు అని పల్లవిని అడుగుతుంది అవని.

Also Read :జబర్దస్త్ రోహిణి నెలకు సంపాదన ఎంతో తెలుసా..? నోర్లు వెల్లబెట్టాల్సిందే..

నువ్వు ఏం చేసినా కూడా నీ ఆటలు సాగుతున్నాయి అని విర్రవీగుతున్నావేమో.. నువ్వు నా గురించి ఎక్కడ బయటపెడతావో అని ఆలోచిస్తున్నాను తప్ప నీ గురించి ఏం చేస్తావో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆరోజు అనవసరంగా మావయ్యగాన్ని చంపాలని చూసాను. అదే అవనీని చంపాలని చూసింది అంటే సరిపోయేది అని పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రేయ ఏసీ కోసం మరోసారి ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని పెద్ద గొడవే చేస్తుంది. ఇక అక్షయ్ వచ్చి మీ గదిలో రేపు ఏసి పెట్టిస్తాను అని మాట ఇవ్వడంతో మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఆఫీస్ కి వెళ్ళిన అక్షయ్, శ్రీకర్, కమల్ బోర్డు మీటింగ్ ఉంది కదా అన్నయ్య వెళ్దాం పదనేసి అంటాడు అయితే మనకి ఇప్పుడు ఫైనాన్స్ చాలా అవసరం లేదంటే మాత్రం కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది అని అక్షయ్ అనగానే.. తమకు లోన్ ఇస్తామని అడిగినా బ్యాంకు వాళ్లు వచ్చి మీరు లాస్ట్ టైం చాలా నష్టపోయారు. అందుకే మీకు లోన్ ఇవ్వము అని చెప్తారు..

అయితే మరో ఫైనాన్సర్స్ లు అక్కడికి వచ్చి చక్రధర పంపించారండి అని అంటారు. అక్షయ్ అతని సాయం మాకు ఏం అవసరం లేదని ఎంత చెప్తున్నా సరే ఆ తర్వాత అవని వచ్చి మా నాన్న మారిపోయాడు మీరు సంతకం పెట్టించుకోవడమే కదా అనేసి అంటుంది.. అవని మాట విన్న అక్షయ్ ఆ లోన్ తీసుకోవడానికి ఒప్పుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×