E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: వల్లికి మైండ్ బ్లాక్.. నర్మద మాస్టర్ ప్లాన్.. అడ్డంగా వల్లి ఇరుక్కుంటుందా..?

Illu Illalu Pillalu Today Episode: వల్లికి మైండ్ బ్లాక్.. నర్మద మాస్టర్ ప్లాన్.. అడ్డంగా వల్లి ఇరుక్కుంటుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజుని ఎలాగైనా సరే లోపలికి తీసుకురావాలి అని ప్రేమ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.. వీరిద్దరి మధ్యలో ఒక డ్యూయేట్సాంగ్ కూడా వస్తుంది.. ఇక చేసేదేమీ లేక ప్రేమ కూడా ధీరజ్ పక్కన పడుకుంటుంది.. దాదాపు వీళ్ళిద్దరూ కలిసిపోయారు అని అందరూ అనుకునేలా ఒక్కచోట పడుకొని ఉంటారు.. మధ్యలో మేలుకొన్న ధీరజ్ పక్కన ప్రేమను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ప్రేమను పక్కనుంచి లేచి ప్రేమకు దుప్పటి కప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లేచి చూసిన ప్రేమ ధీరజ్ కి నా మీద కోపం తగ్గింది అని చాలా సంతోష పడిపోతూ ఉంటుంది.. ఇక తర్వాత ప్రేమ ధీరజ్ ఎలాగైనా సరే నన్ను దగ్గర తీసుకుంటాడు అని మురిసిపోతూ ఉంటుంది..భద్రా, సేన ఇద్దరు కూడా విశ్వం తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు.

పోలీసులు ఇలా అంటున్నారు. ఏంట్రా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. మీరిద్దరూ కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. మీ పగలకు నా కొడుకుని వాడుకుంటారా అని రేవతి ఇద్దరిపై రెచ్చిపోయి మాట్లాడుతుంది.. ఇక మీరు నా కొడుకుని బయటకు తీసుకొస్తారా లేదా అని రేవతి అడుగుతుంది. కానీ ధీరజ్ వచ్చి మా నాన్న కాళ్లు కడిగితే అప్పుడు నీ మేనల్లుడిని తీసుకొస్తానని కండిషన్ పెడతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి వేదవతి ఎందుకు కొడుతుందో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరి గురించి ఏం చెప్పినా సరే అత్తయ్య గారు నన్ను తబలా వాయించుకుంటూ వాయించేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని వల్లి లోపలికి వెళ్లి బాధ పడిపోతూ ఉంటుంది.. అత్తయ్య గారు నా గురించి ఏం తెలుసుకున్నారు అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావడమే లేదు. ఎప్పుడు వచ్చినా మీద పడుతుందో అర్థం కావడం లేదు అని శ్రీవల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. వల్లి లోపల ఆలోచిస్తూ ఉండగా రామరాజు నాకు ఆ విషయం తెలియదండి అంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి గెట్టిగా కేకలు వేస్తాడు.. వల్లి అమ్మ వల్లి అంటూ కేకలు వేయడంతో నర్మద ప్రేమలో నిజం ఎక్కడ చెప్పేశారో అని కంగారు పడిపోతూ ఉంటుంది శ్రీవల్లి…

కొంపతీసి మావయ్య గారికి నిజం చెప్పారో ఏంటో అని భయపడుతూ వచ్చిన వల్లి. ఏమైంది మావయ్య గారు ఎందుకలా అరుస్తున్నారు అని అడుగుతుంది. నువ్వు ఇన్ని రోజులు స్కూల్ కి ఎందుకు వెళ్లలేదు అని రామరాజు అడగగానే మీరు దాని గురించి అడిగారా నేను ఇంకా ఏదో దాని గురించి అని అనుకున్నాను అని వల్లి అంటుంది. ఇంక దేని గురించి అనుకున్నావల్లి అక్క అని ప్రేమ అడుగుతుంది. అదేం లేదు ఊరికే అన్నాను అని వల్లి అంటుంది. మరి నువ్వు స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు ప్రిన్సిపల్ గారే మామయ్యకి ఫోన్ చేశారంటే.. మావయ్య గారి మాట పోదు అని ప్రేమ నర్మదా కావాలని వల్లిని అడ్డంగా ఇరికిస్తారు.

Advertisement

నేను స్కూల్ కి వెళ్లడం నాకు ఇష్టం లేదు. నేను స్కూల్ కి వెళ్తే అత్తయ్య గారు ఒక్కరే ఇంట్లో పని అంతా చేసుకోలేరు అని శ్రీవల్లి అంటుంది. ఎవరు చెప్పారే నేను ఒక్కదాన్నే పని చేసుకోలేను అని అంటూ వేదవతి శ్రీవల్లిని చెంపలు వాయిస్తానంటూ ముందుకు వస్తుంది. అది కాదమ్మా వల్లి నువ్వు జాబ్ చేస్తే ఇంటి పరువు నిలబడుతుంది కదా నువ్వు ఎందుకు చేయడం లేదు అని అడుగుతుంది. నువ్వు కచ్చితంగా ఇవాల్టి నుంచి జాబ్ కి వెళ్ళాలి అని రామరాజు కండిషన్ పెడతాడు. దెబ్బకు వల్లి మైండ్ బ్లాక్ అవుతుంది. వెళ్లి రెడీ అయ్యి స్కూల్ కి వెళ్ళాలి అని చెప్పగానే వల్లి లోపలికి వెళ్లి నేను ఇప్పుడు స్కూల్ కి వెళ్తే.. నాకు ఇంగ్లీషు పొట్ట కోసినా ఒక్క ముక్క రాదు అని అందరికీ తెలిసిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది..

మావయ్య గారితో ఎలా చెప్పినా ఆయన వినుడు కాబట్టి నేను అత్తయ్య గారి దగ్గరి నుంచి నరుక్కొని రావాలి అని వల్లి వేదవతి దగ్గరికి వెళుతుంది. అత్తయ్య గారు నేను స్కూలుకు వెళ్ళనండి ఆ నర్మదా ప్రేమ ఇద్దరు కూడా మీకు తోడుగా ఉండరు. మీకు అన్ని పనుల్లో నేను సాయంగా ఉంటానండి అని శ్రీవల్లి ఎంత అమాయకంగా అడిగినా కూడా వేదవతి మాత్రం చంప వాయించేస్తుంది. ఆ నర్మదా గవర్నమెంట్ ఉద్యోగం అని విర్రవీగుతుంది దానికి నువ్వు పోటీ ఇవ్వాల్సిందేనని శ్రీవల్లిని వెళ్లి రెడీ అవ్వు అని అంటుంది.. నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసిన నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అని వేదవతి అనుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి రెడీ అయ్యి బయటకు వస్తుంది శ్రీవల్లి.

నర్మదా ప్రేమలు ఇద్దరు కూడా అక్క అసలు ఇంత సడన్గా ఎందుకు ప్రిన్సిపల్ ఫోన్ చేశారు అని ఫ్రేమ్ అడుగుతుంది. ప్రిన్సిపల్ చేయలేదు నేనే చేయించాను అని చెప్పగానే ఒక్కసారిగా ప్రేమ షాక్ అవుతుంది. ఇప్పుడు ఆ వల్లి అడ్డంగా ఇరుక్కునింది ఏం చేస్తుందో చూద్దాము అని ఇద్దరూ సంతోషంగా ఉంటారు. చందు శ్రీవల్లిని దగ్గరుండి స్కూల్ కి తీసుకొని వెళ్లడంతో మా బావ దగ్గరుండి నన్ను స్కూల్ కి తీసుకొని వెళ్తున్నాడు. నా బంగారం బయటపడితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది శ్రీవల్లి.. అక్కడికి వెళ్ళిన తర్వాత చందు నేను కూడా క్లాస్ కి వస్తాను. నువ్వు ఎలా చెప్తున్నావో వినాలి కదా అని అంటున్న సరే మీరు వెళ్ళండి బావ నేను చూసుకుంటాను అని అంటుంది శ్రీవల్లి..

Also Read :ఆరాధ్య మిస్సింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న అవని.. పల్లవికి వార్నింగ్.. నెక్స్ట్ ట్విస్ట్ ఇదే..

రైస్ మిల్లు మీకు మావయ్య గారు ఇచ్చిన బాధ్యత మీరు దాన్ని చూసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళను ఈరోజు కాకపోతే ఇంకొకసారి వినొచ్చు అని శ్రీవల్లి చందు కి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక చందు అలా వెళ్ళగానే శ్రీవల్లి తన పుట్టింటికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. ఏంటే ఇంత పరిగెత్తుకుంటూ వచ్చావు ఎందుకంత కంగారు పడుతున్నావు అని వాళ్ళు ఎంతగా అడుగుతున్నా సరే.. శ్రీవల్లి మాత్రం నా కొంపని మీరు అడ్డంగా ముంచేశారు. అని వాళ్ళిద్దరుపై సీరియస్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×