Illu Illalu Pillalu Today Episode March 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ఫోన్ ను కొట్టేసిన శ్రీవల్లి నర్మద, ప్రేమలకు అడ్డంగా దొరికిపోతుంది.. నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వాయిస్ రికార్డింగ్ లో వాళ్ళందరికీ వినిపించేస్తాము అని ప్రేమ నర్మదా ఇద్దరు కూడా వల్లిని కంగారు పెట్టిచేస్తారు. ఇక వల్లిని డాన్స్ వేయమని ఇద్దరు కూడా ఫోర్స్ చేస్తారు. కచేరి బాగా చేయాలి లేదంటే మాత్రం ఈ వీడియో అందరికీ పంపించేస్తాను అని ప్రేమ బెదిరిస్తుంది. వల్లి మాత్రం ఇక చచ్చినట్టు వాళ్ళు చెప్పినట్లు చేస్తుంది.. ఆ తర్వాత శ్రీవల్లి చచ్చినట్లు డాన్స్ చేయడంతో వాళ్ళిద్దరూ తెగ నవ్వేసుకుంటారు. బిందు పై నిలబడి శ్రీవల్లి చేసిన నాట్యాన్ని చూసి ప్రేమ నర్మద ఇద్దరు కూడా తెగ నవ్వేసుకుంటూ ఉంటారు. కిందకు దిగావ్ అనుకో ఈ వీడియో కచ్చితంగా అందరికీ వెళ్ళిపోతుంది అని బెదిరిస్తారు. శ్రీవల్లి చేసేదేమీ లేక ఆ బిందె పై నాట్యం చేస్తుంది.. వీళ్ళిద్దరూ నన్ను ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరి జుట్టు నాకు దొరక్కపోదు అని శ్రీవల్లి ఆలోచిస్తూ భిన్న పై డాన్స్ చేస్తూ ఉంటుంది. మా అమ్మ ఫోన్ కొట్టేస్తే ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుందని చెప్పింది. కానీ నా నెత్తిన ఇంకొక ప్రాబ్లం తెచ్చి పెట్టింది.
ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంకా రెచ్చిపోతున్నారు అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి బల్లి అక్క నువ్వు చేసే వాటికి అన్నిటికీ నోరు మూసుకొని ఉంటున్నాం కదా అని మమ్మల్ని చేతకాని వాళ్ళని అనుకుంటున్నావా అని నర్మదా అంటుంది.. నీకు ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా కూడా నువ్వు ఇలానే తప్పుల మీద తప్పులు చేస్తూ పోతావు. ఇక నీకు ఏ విషయం చెప్పకూడదు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా నువ్వు ఇంతే కాబట్టి నీ గురించి ఇప్పుడు తప్పక చెప్పాల్సిందేనని నర్మదా అంటుంది.. ఆ మాట వినగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఇక డాన్స్ వేస్తూ జారిపోయి కింద పడిపోతుంది. ఎంత లేపిన సరే శ్రీవల్లి లేవకపోవడంతో ఆ ఇద్దరు కూడా మన ప్లాన్స్ సక్సెస్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సాగర్ తర్వాత రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు.. అయితే తన పర్సులో డబ్బులు లేకపోవడంతో పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎంత చేసినా కూడా నా దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు కదా ఇప్పుడు ఎవరిని అడగాలి అని ఆలోచిస్తాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా ఏంటి రెడీ అయిపోయావా? ఇదిగో నీ లంచ్ బాక్స్ అని అంటుంది. కానీ సాగరు డబ్బులు గురించి అడగడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. నర్మద మాత్రం తనకి కావాల్సినవన్నీ దగ్గరుండి చేస్తుంది. నేను కలవాలి ప్రయత్నించడం కాదు నువ్వు కూడా ప్రయత్నించాలి అని అంటుంది. రెండు వైపులా ఉంటేనే ప్రయత్నించాలి అని నర్మదా అంటుంది. కానీ సాగరు నా పర్స్ ఎక్కడ అని అడిగితే ఆ పర్సు ఇస్తుంది. ఏంటి ఈ పర్సులో ఏమైనా నా ఫోటో పెట్టుకున్నావా ఏంటి అని నర్మదా అడుగుతుంది. అందులో డబ్బులు లేకపోవడంతో సాగరు బాధ పడిపోతూ ఉంటాడు.. ఏంటి ఇందులో డబ్బులు లేవా అని నర్మదా అంటుంది. అప్పటి నుంచి అందుకేనేమో సార్ గారు అడగడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని నర్మదా అనుకుంటుంది..
ఇందాక నీ షర్టు ఉతుకుతుంటే అందులో 1000 రూపాయలు కనిపించాయి అని నర్మదా పర్సులో పెడుతుంది. నా జీతం వచ్చిన తర్వాత ఆ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని సాగర్ అంటాడు. ఈ పర్సన్ నీకు ఇవ్వాలంటే నువ్వు రాజి కొస్తావా నాకు ఒక ముద్దు ఇస్తావా అని నర్మదా అడుగుతుంది.. కానీ సాగర్ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత వల్లిని చందు స్కూల్లో డ్రాప్ చేసి వస్తాడు.. ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆ వల్లి అక్కకి ఎలాగైనా సరే చెక్ పెట్టాలి అని అనుకుంటారు. అయితే వల్లిని ఇరికించడానికి నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను అని నర్మదా అంటుంది.
వల్లి స్కూల్ లో నుంచి వెనకనుంచి పారిపోయి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అయితే నర్మదా చందు కి ఫోన్ చేసి బావ వల్లి యొక్క కళ్ళు తిరిగి పడిపోయింది అంట. ఒకసారి స్కూల్ కి వెళ్లి చూడవా.. అసలే మళ్ళీ ఒక్క బొద్దుగా ఉంటుంది పడిపోయే ఉంటుంది అని అంటుంది.. అయితే చందు అక్కడికి వెళ్లి చూడగానే వల్లి అనేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అని అక్కడ ఒక టీచర్ చెప్తుంది.. ఇక ప్రిన్సిపల్ ని పిలవగానే ఆమె ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా ఫేక్ అని చెప్తాడు. ఈపాటికి వల్లి అక్క ఎంఏ ఇంగ్లీష్ గురించి చందు బావకి తెలిసిపోయి ఉంటుంది అని నర్మదా అనుకుంటుంది.. ఇక చందు నర్మదకు ఫోన్ చేయడంతో ఏంటి నర్మదా నాకు ఇక్కడ ఏం అర్థం కావడం లేదు. వల్లి ఇక్కడ జాయిన్ అవ్వలేదని ప్రిన్సిపల్ చెప్తున్నారు నువ్వేమో బల్లి యొక్క కళ్ళు తిరిగి కిందపడిపోయింది అని చెప్తున్నావు. ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కావడం లేదు అని చందు అడుగుతాడు.
వల్లి ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ టు ఫేక్ అని ప్రిన్సిపల్ అంటున్నాడు అందులో నిజం ఎంత ఉందో నాకు అర్థం కావడం లేదు అని చందు అంటాడు. ఆ సర్టిఫికెట్ల గురించి మాకు ఎప్పుడో తెలుసు బాబు గారు మీకే తెలియాలని అలా చేసాము అని వాళ్ళ అంటారు. ఇప్పుడు మళ్లీ అక్క స్కూల్కి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లి ఉంటుంది. మీరు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి చూడండి అక్కడే ఉంటుంది అని చందు కి నర్మదా చెప్పగానే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. శ్రీవల్లి వాళ్ళ అమ్మానాన్న ప్రేమతో తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటుంది అది చూసిన చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక తర్వాత చందు ఫోన్ చేసి వల్లిని అడగ్గానే.. నేను ఇక్కడే స్కూల్లో ఉన్న బావ అని కవరింగ్ చేస్తుంది కానీ చందు కి అడ్డంగా దొరికిపోతుంది.
Also Read : అవనికి షాక్.. చక్రధర్ ను చంపేందుకు పల్లవి ప్లాన్.. గ్రాండ్గా సీతారాముల కళ్యాణం..
నువ్వు చదువు చెప్తుంది ఇక్కడేనా ఎవరు స్టూడెంట్స్ వీల్లేనా.. అని ఒక్కసారిగా చందు ఎంట్రీ ఇవ్వడంతో శ్రీవల్లి షాక్ అయిపోతుంది.. నువ్వు అంత బాగోలేనప్పుడు స్కూల్ కి వెళ్లి నీ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి జాబ్ మానేయద్దు పదా అనేసి తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళగానే మళ్లీ నీ సర్టిఫికెట్ తీసుకురా అని ఎంత చెప్తున్నా సరే వినకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది. వల్లి ఎంఏ ఇంగ్లీషు ఫేక్ అని తెలుసుకున్న చందు ఒక్కసారిగా చెంప పగలగొడతాడు. దాంతో శ్రీవల్లి మైండ్ బ్లాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…