E-Paper
Advertisement

ఇంటింటి రామాయణం.. మార్చి 30 : అవనికి షాక్.. చక్రధర్ ను చంపేందుకు పల్లవి ప్లాన్.. గ్రాండ్గా సీతారాముల కళ్యాణం..

ఇంటింటి రామాయణం.. మార్చి 30 : అవనికి షాక్.. చక్రధర్ ను చంపేందుకు పల్లవి ప్లాన్.. గ్రాండ్గా సీతారాముల కళ్యాణం..
Advertisement

Intinti Ramayanam Today Episode March 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్లిన అవని తన తల్లి మొక్కు గురించి ఎంతగా చెప్తున్నా సరే తాను మాత్రం వినకుండా అవనిని దారుణంగా అవమానిస్తుంది.. పిన్ని నేను చెప్పేది ఒకసారి వినండి ఇది మా అమ్మ పాతికేళ్ల కోరిక నేను తీరుస్తానని మాట ఇచ్చాను.  ఒక్కసారి నాన్నను గుడికి పంపించండి అని అవని అంటుంది.. నా మొగుడితో ఇక్కడే ఉండి సంసారం చేస్తుందా నీ అమ్మ అని దారుణంగా మాట్లాడుతుంది. రాజేశ్వరి మాటలకు అవనీ కన్నీళ్లు పెట్టుకొని బయటకు వస్తుంది. అవని బాధని అర్థం చేసుకున్నారు చక్రధర్ అవనికి నేను వస్తాను మీ అమ్మని పూజకు సిద్ధం చేసుకోమను అని మాటిస్తాడు. ఆ మాటతో అవని చాలా సంతోషంగా ఉంటుంది..

మా అమ్మ మొక్కుని తీర్చబోతున్నాను అని చాలా సంతోషంగా ఉంటుంది అవని.. బయట బట్టలు అరేస్తున్న పార్వతి దగ్గరికి అక్షయ్ వస్తాడు.. అమ్మ నాకు ఒక డౌట్ ఉంది అడగొచ్చు అని అంటాడు. దేని గురించి డౌటు ఏం అడగాలి అనుకుంటున్నావు రా అడుగు రా అని పార్వతి అంటుంది. పల్లవి నీ మేమెవరైనా ఒక్క మాటంటే అస్సలు ఒప్పుకునే దానివి కాదు. అలాంటిది ఇప్పుడు పల్లవిని కమల్ అంతగా అరుస్తున్న సరే నువ్వు మాత్రం ఏమి పట్టించుకోవడం లేదు ఏంటి అని అడుగుతాడు. నీకేమైందమ్మా ఎందుకు పల్లవిని కోపంగా చూస్తున్నావు అర్థం కావడం లేదు అని అక్షయ్ అడుగుతాడు. అవని రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్లిన విషయాన్ని పార్వతితో చెప్తుంది.. మళ్లీ రాజేశ్వరి ని నువ్వు తిట్టింటుంది అని అనుకుంటుంది.. మా నాన్నని పూజకు పంపించమంటే పిన్ని దారుణంగా మాట్లాడింది. కానీ మా నాన్న మాత్రం వస్తానని మాట ఇచ్చాడు అని అనగానే పార్వతి అవునా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..రాజేశ్వరి నీ మీద చాలా కోపంగా ఉంది కదా ఏమనింది కచ్చితంగా నేను తిట్టే ఉంటుంది కదా అని పార్వతి అడుగుతుంది.. అవును అత్తయ్య నన్ను దారుణంగా పెట్టింది. కానీ మా నాన్న మాత్రం నన్ను సంతోషపరిచేలా చేశారు. పూజ కోసం నేను వస్తాను అంత సిద్ధం చేసుకోండి అని అన్నారు అని అవని అంటుంది.. పోనీలే మీ అమ్మ కోరిక మీ నాన్న తీర్చాలని అనుకుంటున్నాడు రేపు పూజకి అంతా సిద్ధం చేద్దామని పార్వతి అంటుంది.. ఇక తర్వాత అక్షయ్ ఈ మాత్రం పార్వతిని అడగాలనుకుంటున్న విషయాన్ని అడగకుండా చేస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన పల్లవి ఈ పూజకి డాడ్ ని రాకుండా చేయాలి అప్పుడు అవని తిక్క కుదురుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. పాతికేల్లా నిరీక్షణ తర్వాత మీ అమ్మ కోరిక నెరవేరుతుంది కదా పూజకు సంబంధించిన పనులన్నీ నేను చూసుకుంటాను అని అక్షయ్ అంటాడు..

వీళ్ళు ఇంత సంతోషంగా పూజ చేసుకోవడం నాకు నచ్చడం లేదు.. వీళ్ళు పూజకి ఎలాగైనా ఆటంకం కలిగించాలి అంటే మా నాన్న అనే వాడు లేకుండా చేయాలి అని పల్లవి అనుకుంటుంది.. వీళ్ళ అమ్మకి అవనికి మా నాన్న దగ్గరైతే, నాకు మా మామ కి డాడ్ దూరం అయిపోతాడు.. తర్వాత అందరూ కూడా మమ్మల్ని చూసి నవ్వుకుంటారు.. ఇదంతా జరగకూడదు అంటే మా డాడీ ప్రాణాలతో ఉండకూడదు అని పల్లవి అనుకుంటుంది.. ఇక రాజేశ్వరి భానుమతి ఇద్దరూ కూడా అవని గురించి మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు.. ఎంత ధైర్యం ఉంటే అది మన ఇంటికి వచ్చి మా నాన్నని పంపించండి అని అడుగుతుందా అని రాజేశ్వరి అంటుంది.. ఈయన గారు ఊపుకుంటూ వెళ్లిపోతారేమో అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి ఇంటికి వస్తుంది..

Advertisement

ఏంటి మీ అమ్మని చూడడానికి ఇప్పుడు వచ్చావు అని పల్లవిని భానుమతి అడుగుతుంది.. నాకెక్కడ తీరుకుంది ఆ అవని ఇంటి పని అంతా నా చేత చేయిస్తుంది అని అనగానే భానుమతి రాజేశ్వరి ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఏంటి అవని రెచ్చిపోతుంది ఇంతగా ఎవరు అంట చూసుకుని ఇలా చేస్తుంది అని అనుకుంటుంది.. అన్ని వంటగదిలోనే ఉన్నాయి మీ డాడీ కి అన్నం వడ్డించు అని భానుమతి అంటుంది.. ఇక పల్లవి డాడీ నీకు నేను అన్నం పెడతా రండి అని బలవంతంగా తీసుకొని వెళుతుంది.. ఆవని సంతోషాన్ని దూరం చేయాలంటే మా డాడీ ని చంపేయాలి అని ప్లాన్ చేస్తుంది..

Also Read :‘గుండెనిండా గుడిగంటలు ‘ టీఆర్పీ రేటింగ్.. మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

అనుకున్నట్లుగానే చక్రధర్ ని చంపేందుకు అన్నంలో విషయం కలుపుతుంది.. చక్రధర్ నాకు వద్దు తినాలని లేదు అని ఎంతగా చెప్తున్నా సరే పల్లవి మాత్రం వినకుండా తినిపించాలని అనుకుంటుంది. కానీ అక్కడున్న నీళ్లు చేయి జారీ పడిపోవడంతో చక్రధర్ నాకు వద్దు అని వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఉదయం అవని వాళ్ళ నాన్న ఇచ్చిన చీరని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది.. అయితే అక్షయ్ ఏంటి మీ నాన్న ఇచ్చిన చీరని అంతగా చూసుకుంటున్నావు అని అనగానే అవని తన సంతోషాన్ని కారణమైన విషయాన్ని పంచుకుంటుంది.. మిగిలిన అందరూ కూడా పద్ధతిగా పట్టు వస్త్రాల్లో తయారయ్యి వస్తారు. పార్వతి మిమ్మల్ని ఇలా చూస్తుంటే అందరి దిష్టి తగిలేలా ఉంది నేను దిష్టి తీస్తాను అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో.. శ్రీరామనవమి సందర్భంగా పూజ కోసం అందరూ గుడికి వెళ్తారు. అక్కడ సీతారాముల కళ్యాణం కోసం విగ్రహాలను తెచ్చి అక్కడ పెడతారు.. అయితే మీనాక్షి మాత్రం ఇంకా మీ నాన్న రాలేదు ఏంటమ్మా అని అడుగుతుంది. ఇంట్లో రెడీ అవుతున్న చక్రధారిని గదిలో పెట్టి బ్లాక్ చేస్తుంది రాజేశ్వరి.. ఆ తర్వాత చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడికి రాడు అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Big Stories

Advertisement
×