E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ రొమాన్స్.. అమూల్యకు టెన్షన్.. నర్మద అనుమానమే నిజమా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ రొమాన్స్.. అమూల్యకు టెన్షన్.. నర్మద అనుమానమే నిజమా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 18th:ధీరజ్ ప్రేమని దగ్గరికి తీసుకొని నువ్వు నా ప్రాణం ప్రేమ నిన్ను ఎలా నేను వదిలేస్తాను అని అనుకుంటున్నావు అని ఎమోషనల్ గా తనతో మాట్లాడతాడు. మన పెళ్లి ఎలా జరిగిందో నీకు బాగా తెలుసు. మా అమ్మ నీ మెడలో తాళికట్టు అంటే మా అమ్మ మాటకి గౌరవం వచ్చి నీకు నా భార్య స్థానాన్ని ఇచ్చాను. కానీ నిన్ను నేను ప్రేమించడం మొదలు పెట్టాను. నువ్వు నా ప్రాణం ప్రేమ నిన్ను ఎప్పటికీ నేను వదిలిపెట్టను అని ధీరజ్ ప్రేమకే ప్రామిస్ చేస్తాడు.ధీరజ్ ప్రేమకు ఎలాగైనా సరే ప్రపోజ్ చేయాలి అని అనుకుంటాడు. ప్రేమ కోసం ఒక అందమైన బొకే ని తీసుకొని వచ్చి ధీరజ్ ఎంతో ప్రేమగా ప్రపోజ్ చేస్తాడు. తన ప్రపోజల్కి ప్రేమ ఫిదా అయిపోతుంది. ఇవాళ మనకు మర్చిపోలేని రోజు.. ఇప్పటినుంచి మనం కొత్త జీవితాన్ని మొదలు.. రొమాంటిక్ నైట్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. ప్రేమ ధీరజుల మనసులో కలయిక మాత్రమే కాదు.. తనువుల కలయిక కూడా జరుగుతుంది. ఈ సీన్ హైలెట్ అవుతుంది.

విశ్వం ఎంట్రీతో అమూల్యకు భయం..

విశ్వం పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యాడు.. నన్ను ఏదైన చేస్తాడు అని అమూల్య కంగారు పడిపోతూ ఉంటుంది. నన్ను ఇంకా ఏదైనా చేస్తాడేమో నేను అస్సలు ఊహించలేకపోతున్నాను అని భయపడిపోతూ ఉంటుంది.. వాడు నా మీద కోపంగా ఉన్నాడు ఏదైనా చేస్తాడేమో అని భయపడిపోతూ ఉంటుంది. అటు విశ్వం కూడా అమూల్యకి ఎలాగైనా సరే గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు.. విశ్వం రివేంజ్ తీర్చుకునే సమయం వచ్చేసింది అంటూ అనుకుంటాడు. కాలేజీకి టైం అవుతుంటే ఇంకా రాలేదేంటి అని వేదవతి పిలుస్తుంది.. బయటికి వెళ్లిన అమూల్య నేను కాలేజీకి వెళ్ళను నాన్న అని చెప్తుంది. వాడి కోసం నువ్వు భయపడుతున్నావా? నీకోసం మేము అందరం ఉన్నాం అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు అని రామరాజు ధైర్యం చెప్తాడు. అమూల్యక కాలేజీకి వెళ్తుంది.

వల్లి, సుకన్యకు ప్రేమ పై అనుమానం..

Advertisement

అమూల్య కాలేజీకి వెళ్లగానే ఇటు సుకన్య బయట గాల్లో లెక్కలు వేస్తూ కనిపిస్తుంది. అది చూసిన వల్లి ఇంకా గాల్లో లెక్కలు వేస్తున్నావ్ ఏంటి అమూల్య కాలేజీకి వెళ్తుంది. అమూల్య ఆ విశ్వం ని కలపడానికి కారణం నేనే అని చాలామందికి తెలుసు. అడ్డంగా నన్ను ఇరికించద్దె బాబు అని మాట్లాడుకుంటూ ఉంటుంది. సుకన్య మాత్రం గాల్లో లెక్కలు వేస్తూ ఉండడంతో నేను ఈ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు లెక్క ఇప్పటికి తేలడం లేదు అని అంటుంది. మన పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలుసా అని ప్రేమ అనింది కదా మరి వాళ్ళ పెళ్లి వెనకాల ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అని అంటుంది. అయితే నేను కూడా ఈ సంగతి గురించి మర్చిపోయాను నిజంగానే వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకుంటే మనకు పనికొస్తుంది అని వల్లి కూడా అంటుంది..

సుక్కు కోసం తిరుపతి ప్లాన్..

సుకన్య ఎలా పడిపోతుంది. తనని ఎలా ప్రేమలో పడేయాలి అని తిరుపతి తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ ధీరధులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కదా వీళ్ళని ఏదైనా సలహా అడిగితే బాగుంటుంది అని తిరుపతి ఆలోచిస్తాడు. అయితే తిరుపతి వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని సీన్లు చూపిస్తారు. అందులో ఒకటి బాగా నచ్చడంతో తిరుపతి ఇలా చేస్తే సుకన్య నా ఒళ్ళు పడుతుంది అని అనుకుంటాడు . సుకన్యను వెతికిన తిరుపతి ఎలాగైనా సరే కాలు అడ్డుపెట్టి సుఖని నా మీద పడేలా చేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ అక్కడ జరిగింది వేరేది కావడంతో తిరుపతికి నడుములు విరుగుతాయి. సుకన్య అంకుల్ అని పిలవడంతో తిరుపతి చాలా బాధపడతాడు.

కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. 

Advertisement

రామరాజు బయటికి వెళ్లి కొన్ని బొమ్మలను తీసుకొని వస్తాడు. వేదవతిని కేకలు వేసి మరీ పిలుస్తాడు.. ఏంటి ఏమైంది మీ రూమ్ రైస్ మిల్లు కు వెళ్లకుండా ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చుని బొమ్మలు తీసుకొచ్చారా అని అడుగుతుంది వేదవతి.. ఇవి బొమ్మలు కాదు మన ఫ్యామిలీ అని చెప్పగానే వేదవతి ఆలోచనలో పడుతుంది కానీ రామరాజు మాత్రం అనాధగా వచ్చిన నాకు నువ్వు నాకు ధైర్యంగా నిలబడ్డావు. అయితే ఇప్పుడు నాకు కుటుంబం ఉంది నా పిల్లలు కోడలు అందరూ నా ఇంటి గౌరవం అని పెంచుతున్నారు.. ఇప్పుడు నా పెద్ద కోడలు వల్లి కడుపుతో ఉంది. అంటే ఆమెకు పిల్లలు పుట్టబోతారు. నా ఇంటికి మనవడు మనవరాలు వస్తారని చాలా సంతోషంగా ఉంటాడు రామరాజు. వళ్లీ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు.. వల్లి కడుపు నిజమో అబద్దమో తెలుసుకోవాలని నర్మదా హాస్పిటల్ కి వెళ్దామా అక్క ఒకసారి చెక్ అప్ చేయిద్దామని అడుగుతుంది. ఆ మాట వినగానే కంగారు పడిపోతుంది వల్లి. సుకన్య కూడా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తే నీ బండారం బయట పడిపోతుంది అని అనగానే టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శ్రీవల్లి కడుపుతో లేదన్న విషయం బయట పడుతుందేమో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి అవనికి అనుమానం.. దారుణంగా అవమానించిన ఫైనాన్షియర్.. పల్లవి అవుట్…

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×