E-Paper
Advertisement

ఎయిర్‌ షోలో విన్యాసాలు.. గాల్లో ఢీ కొన్న రెండు యుద్ధ విమానాలు, పైలెట్లు మాటేంటి? వీడియో వైరల్

ఎయిర్‌ షోలో విన్యాసాలు.. గాల్లో ఢీ కొన్న రెండు యుద్ధ విమానాలు, పైలెట్లు మాటేంటి? వీడియో వైరల్
Advertisement

Fighter Jets Collide: అమెరికాలోని ఇడాహోలోని మౌంటెన్ హోమ్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఘోరం జరిగింది. స్కైస్ ఎయిర్‌షో సందర్భంగా అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు గాలిలో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో జెట్‌లోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

ఎయిర్‌ షోలో విన్యాసాలు.. గాల్లో ఢీ కొన్న రెండు యుద్ధ విమానాలు

Advertisement

అమెరికా ఇడాహోలో గన్‌ ఫైటర్ స్కైస్ ఎయిర్‌ షో‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. EA-18G సిరీస్ గల రెండు ఫైటర్ జెట్ విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. శకలాలు కింద పడటంతో ఎయిర్ బేస్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా పొగ వ్యాపించింది.

అక్కడి దృశ్యాలు భయానకంగా మారాయి. ప్రమాదం నుండి నలుగురు పైలట్లు బయటపడ్డారు. పారాచూట్ సహాయంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో మౌంటేన్ హోమ్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌ను తాత్కాలికంగా మూసి వేశారు అధికారులు.

Advertisement

పైలెట్లు ‌సేఫ్.. వీడియో వైరల్

ఎయిర్ బేస్‌కు రెండు మైళ్ల దూరంలో ఈ విన్యాసాలు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ఘటనకు ముందు జెట్‌లు అత్యంత దగ్గరగా ఎగురుతూ గాలిలో ఒకదానితో ఒకటి చిక్కుకుపోయినట్లు కనిపించాయి. ఆ విమానాలు మళ్లీ నేల వైపు దూసుకు వస్తున్న సమయంలో వాటి నుండి నిప్పురవ్వలు ఎగసిపడటం కనిపించాయి.

ఆ తర్వాత రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇరాన్ యుద్ధంలో ఇప్పటికే అమెరికా చాలా విమానాలు కోల్పోయిందని, దానికితోడు ఈ ఘటనలో రెండు విమానాలు కోల్పోయిందని అంటున్నారు.

ALSO READ: హోటల్‌లో అదే పని.. మహిళా మేనేజర్‌పై యువకుడు దాడి, ఆపై నిందితుడు అరెస్ట్

 

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×