E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ షాకింగ్ నిర్ణయం.. వల్లిని రెచ్చగొట్టిన భాగ్యం.. భద్రకు నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ షాకింగ్ నిర్ణయం.. వల్లిని రెచ్చగొట్టిన భాగ్యం.. భద్రకు నిజం తెలుస్తుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 2nd: నువ్వు కడుపుతో ఉన్నావు అమ్మ నువ్వు ఇలాంటి పనులన్నీ చేయకూడదు.. అసలు మీ అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది అని అనగానే మళ్ళీ బయట వాళ్ళు ముగ్గురు గురించి చెప్తుంది.. కడుపుతో ఉన్న కోడలు ఇంట్లో ఉండదా? నువ్వు బయట ఏం చేస్తున్నావ్ అని రామరాజు గట్టిగా కేకలు వేసి వేధవతి నర్మదా ప్రేమలను పిలుస్తాడు.. వల్లి నీ సరిగ్గా చూసుకోవడం లేదు అని రామరాజు ముగ్గురుని తిట్టేస్తాడు.. ఒక బెల్ ఇచ్చి దానిని కొట్టినప్పుడు నీ దగ్గరికి వచ్చి నీకేం కావాలో వాళ్ళు ఇస్తారు అని రామరాజు అనగానే వల్లి రెచ్చిపోతుంది. ఇక మావయ్య గారు చెప్పినట్లుగానే ఆ ముగ్గురు కూడా వల్లికిని ఏం కావాలంటే అది చేసి పెట్టి పీకలు దాకా తినేలా చేస్తారు.. మళ్లీ కావాలని ఇదంతా చేస్తుంది అని అనుకుంటారు కానీ కడుపుతో ఉంది కదా అని తర్వాత సైలెంట్ అవుతారు. మొత్తానికి వల్లి ప్లాన్ అయితే బాగా వర్క్ అవుతుంది..

ధీరజ్ కోసం ప్రేమ త్యాగం..

ధీరజ్ ఒంటరిగా కూర్చుని కారు కొనడానికి ఇంకా డబ్బులు సెట్ అవ్వలేదు అని బాధ పడిపోతూ ఉంటాడు. ధీరజ్ కోపాన్ని ధీరజ్ బాధని ఎలాగైనా సరే పోగొట్టాలి అని ప్రేమ అనుకుంటుంది. అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి తల తుడువు రా అని అడుగుతుంది. ఏంటే నేను తల తుడవడం ఏంటే అని ధీరజ్ ప్రేమని అరుస్తాడు. ఇంక ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండను నువ్వు అర్జెంటుగా మా ఇంటికి బుక్ చెయ్ అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావే మెదడు ఏమైనా దొబ్బిందా ఏంటి.? ఎదురుగా పెట్టుకుని ఉన్న మీ ఇంటికి బస్సు బుక్ చేయడం ఏంటే అని ధీరజ్ అడుగుతాడు. దాని అర్థం నువ్వు మా ఇంటి దగ్గర వదిలిపెట్టు అని అని ప్రేమ అంటుంది. అది సరేగాని ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు అని ధీరజ్ అడుగుతాడు.. మా అమ్మ దగ్గరికి వెళ్లి తల తుడిపించుకుంటాను అని అనగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు..

ధీరజ్ కోసం ప్రేమ నిర్ణయం..

Advertisement

డబ్బులు కుదరలేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. మొన్ననే యాక్సిడెంట్ అయింది నా తలకి నొప్పిగా ఉంటుంది ఏం చేయాలా అని ఆలోచించాలి కాని నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు అని ప్రేమ ధీరజ్ ని అంటుంది. నేనేం చేశాను ఎందుకలా మాట్లాడుతున్నావు అని ధీరజ్ అడుగుతాడు. మొత్తానికి ప్రేమ పంతంతో తన తల తుడిపించుకునేలా చేస్తుంది. నువ్వేం బాధపడకు రా నాకు రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు. రేపు సాయంత్రం లోపల నీకు డబ్బులు ఇస్తాను నువ్వు వెళ్లి కారు తీసుకొని వచ్చి అందరి ముందర గొప్పగా చూపించాలి అని ప్రేమ అంటుంది.

నగలను తాకట్టుపెడుతుందా..?

ప్రేమ తన నగలను తీసుకొని బ్యాంకుకు వెళుతుంది. అక్కడ బ్యాంక్ మేనేజర్ మీరు భద్రావతి మేనకోడలు కదా అని అడగడంతో అవునండి అని అంటుంది మీరు ఇలా నగలు తాకట్టు పెట్టడం ఏంటి అని మేనేజర్ అడుగుతాడు. నాకు పెళ్లయిందండి కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా ఉంటాయి అందుకే నగలను తాకట్టు పెట్టాలని అనుకుంటున్నాను అని ప్రేమ అంటుంది.. సరే అమ్మ కాసేపు వెయిట్ చెయ్యి అని అతను అంటాడు. ఈ విషయాన్ని ఎలాగైనా సరే భద్రావతికి చెప్పాలని మేనేజర్ కాల్ చెయ్యాలని అనుకుంటాడు.

రేపు బయటకు వస్తున్న విశ్వం..

Advertisement

లాయర్ తో తన మేనల్లుడిని బయటికి తీసుకొచ్చేందుకు గొడవ పడుతూ ఉంటుంది భద్ర. ఇంత డబ్బు పలుకుబడి ఉండి కూడా నా మేనల్లుడ్ని బయటికి తీసుకు రాలేకపోతున్నాను అందుకే భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు వచ్చాను అని భద్రావతి లాయర్ తో అంటుంది. మీరు నా మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చారు మీకోసం నేను ఏదో ఒకటి చేయాలి అని లాయరు రేపు సాయంత్రం లోపల మీ మేనల్లుడు మీ ఇంట్లో ఉంటాడు అని చెప్పగానే సేన భద్ర ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. లాయర్ దగ్గర నుంచి బయటికి రాగానే సేనకు బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి ప్రేమ నగలను తాకట్టు పెట్టబోతుంది అని చెప్తాడు. నగలను తాకట్టు పెట్టాల్సిన అవసరం ప్రేమకేమొచ్చింది ఆ తండ్రి కొడుకులని ఇద్దరినీ మనం కడిగి పడేయాలి అని భద్ర అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read:Intinti Ramayanam Today Episode: భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి.. పల్లవి పై ప్రణతికి అనుమానం.. రాజేశ్వరి ప్లాన్ ఏంటి..?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×