BigTV English

Illu Illalu Pillalu Today Episode: కత్తితో పొడిచేస్తానని విశ్వంకు వార్నింగ్.. సాగర్, నర్మదా కాపురంలో శ్రీవల్లి చిచ్చు..

Illu Illalu Pillalu Today Episode: కత్తితో పొడిచేస్తానని విశ్వంకు వార్నింగ్.. సాగర్, నర్మదా కాపురంలో శ్రీవల్లి చిచ్చు..

Illu Illalu Pillalu Today Episode may 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మద చెప్పిన విషయాన్ని సాగరు ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఉదయం లేవగానే శ్రీవల్లి బాక్స్ పెట్టేసి తన భర్తకు ప్రేమతో ముద్దులు వర్షం కురిపిస్తుంది. దానికి చందు మురిసిపోతూ ఉంటాడు. మా బావకి నేనంటే అంత ప్రేమ అనేసి తనపై ప్రేమను కురిపించేస్తూ ఉంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి ప్రేమకు చందు ఫిదా అయిపోతాడు. ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ యాంగిల్ మొదలవుతుంది. బయట తలుపు వేయలేదు బావ ఎవరైనా వస్తే బాగోదు కదా అనేసి శ్రీవల్లి అంటుంది. సరే నేను ఇంకా ఆఫీస్ కి వెళ్ళొస్తానని చందు శ్రీవల్లితో అంటాడు. సాగరు వాళ్ళ నాన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అయితే నాన్న చెప్పిందానికైనా నేను ఏదో ఒకటి సాధించి చూపించాలంటూ సాగర్ ఆలోచిస్తాడు. అటు నర్మద చెప్పిన ఆలోచన బాగుంది అంటూ సాగర్ మనసులో అనుకుంటూ వస్తాడు.


అయితే చందు ఆఫీస్ కి వెళ్లడం చూసి శ్రీవల్లి విషయాన్ని చందుకు చెప్పడానికి సాగర్ వస్తాడు. వదిన నాన్నతో అలా చెప్పకూడదు కదా అన్నయ్య అనేసి సాగర్ అంటాడు.. దానికి వెంటనే చందు నర్మదా వయసులో పెద్దది అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం తప్పు కదా.. ప్లేస్ లో నువ్వున్నా సరే అలానే ఆలోచిస్తావు.. టెన్షన్ పడకూడదని శ్రీవల్లి అలా చెప్పింది దాంట్లో తప్పేంటి అని సాగర్ ని తిడతాడు.. శ్రీవల్లిని వయసులో పెద్దదని కూడా చూడకుండా మర్యాద ఇవ్వకుండా నర్మదా అలా మాట్లాడటం బాగోదు. మీ ఆవిడకి ఇంకొకసారి ఇలా మాట్లాడితే బాగోదని చెప్పు అని చందు సాగర్ తో అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ ఉన్న ఫుడ్ డెలివరీ ఏంటో తెలుసుకొని ఆర్డర్ పెట్టమని తన ఫ్రెండ్స్ కి అడుగుతాడు. ధీరజ్ చేత ఫుడ్ ని తీసుకొచ్చే ప్రయత్నం సక్సెస్ అయ్యేలా చేస్తాడు. ధీరజ్ ని అడ్రస్ చెప్తూ ఒక ఆట ఆడుకుంటారు విశ్వం అండ్ ఫ్రెండ్స్. చివరికి ధీరజ్ అక్కడికి రాగానే విశ్వం తన విశ్వరూపం చూపిస్తాడు. ధీరజ్ ని ఎలాగైనా సరే దారుణంగా అవమానించాలని కావాలని గెలుకుతాడు. ఫుడ్ ని కింద పడేసి బాడ్ రివ్యూ యువర్ అని చెప్పేసి పెడతానంటూ బెదిరిస్తాడు. ధీరజ్ భయపడి వద్దు సార్ నాదే తప్పు లేట్ అయినందుకు అని రిక్వెస్ట్ చేస్తాడు. మాట వినకుండా ధీరజ్ ను అవమానిస్తారు..  ఇక ఇదంతా చూసిన ప్రేమ విశ్వం ఫ్రెండ్ ని దారుణంగా కొడుతుంది. ధీరజ్ ఇప్పుడు నా భర్త.. తనకి ఇలా అవమానిస్తే మేము అసలు ఒప్పుకోమంటు తిడుతుంది.


ఎక్కువ మాట్లాడాలంటే బ్యాగులో కూరగాయలు కత్తి తెచ్చి కోసేస్తాను అంటూ ప్రేమ విశ్వం ఫ్రెండ్స్ కి వార్నింగ్ ఇస్తుంది.. అయితే అరే విశ్వం నీ చెల్లెలు అనంతపని చేస్తుంది రా మేము వెళ్ళిపోతున్నామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. ప్రేమ విశ్వం కు వార్నింగ్ ఇస్తుంది. ఇంక ఎంతకాలం ఇలా మా మీద పగతో ఉంటావు నువ్వు.. ఇంకా మారవా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ప్రేమ.. ఇప్పటికైనా నువ్వు మారు లేదంటే ఇంకా ఏమేమో చూడాల్సి వస్తుందని ప్రేమ అంటుంది.. మా బ్రతుకు లేవో మేము బ్రతుకుతున్నాము నీకు మా విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని అంటుంది. ఆ తర్వాత ప్రేమ ధీరజ్ని బండి తీయమని చెప్పి కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది..

కాలేజ్ దగ్గర డ్రాప్ చేయగానే.. చీమంత ఉన్నావు ఎగిరెగిరి పడుతున్నావు ఏ ధైర్యం చూసుకొని నువ్వు ఇలా మీ అన్నయ్యతో గొడవకు దిగావు అని ధీరజ్ అడుగుతాడు.. అయితే నువ్వు నా భర్త అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావేమో నేను మర్చిపోవట్లేదని ప్రేమ అంటుంది.. ఏది ఏమైనా కూడా నువ్వు ఇలా వార్నింగ్ ఇవ్వడం మంచిది కాదు అని ప్రేమతో అంటాడు ధీరజ్.. ఇక నర్మదా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. వెనకాల సాగర్ వస్తాడు. కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఏంటి మిల్లులో లేకుండా ఇలా వచ్చారు అని అంటే రైస్ డెలివరీ కోసం వచ్చాను. నువ్వు ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళుతూ ఉంటావు కదా అందుకే నీ దగ్గరికి వచ్చాను అని సాగర్ అంటాడు. అబద్ధాలు చెప్పి ఇట్ట రావడానికి కొంచెం కూడా నీకు సిగ్గు లేదా అని నర్మదా సీరియస్ అవుతుంది.

ఏం చేయమంటావ్ నా పరిస్థితి ఎలా ఉంది అసలే బాధగా ఉన్నాను ఇప్పుడు నువ్వు ఇంకా బాధ పెట్టొద్దు అని సాగర్ రిక్వెస్ట్ చేస్తాడు.. నువ్వు ఇంత వేడిగా ఉన్నావ్ కదా నీకు కాస్త చల్లగాలి తగలాలి పద బండి ఎక్కువ అని నర్మదను బండి ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు.. ఇక చందు దగ్గరికి 10 లక్షలు అప్పు ఇచ్చిన సేటు వస్తాడు. నువ్వు 10 లక్షలు నెలలో ఇస్తానని మాట ఇచ్చావు.. మరి ఇప్పటికీ నాకు డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఇదేదో తేడాగా ఉంది అని సేటు చందు ని తిడతాడు.. అంత కాదు నాకు డబ్బులు ఇస్తానన్నావ్ ఇవ్వలేదు ఇక మీ నాన్నకి ఫోన్ చేసి ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే అని సేటు వార్నింగ్ ఇస్తాడు.. లేదు సేటు నాకు కొంచెం టైం ఇవ్వండి ఆ తర్వాత నేను డబ్బులు ఇవ్వకుంటే మీరు మా నాన్నకి చెప్పండి అని చెందూ రిక్వెస్ట్ చేస్తాడు..

అటు శ్రీవల్లి ఇంట్లో భోజనాల సంగతి చూసుకుంటూ అన్ని అయిపోయాయి ఇక అన్నం ఒకటి చేస్తే సరిపోతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే తన చెల్లెలు బుజ్జి ఇంటికి వస్తుంది. సడన్ గా ఇక్కడికి వచ్చావు అంటే ఇది మా అక్క ఇల్లు నేను రాకుండా ఉంటే బాగోదు కదా.. నా అక్క ఇంటికి నేను రావడానికి పర్మిషన్ తీసుకోవాలి ఏంటి అని అంటుంది.. నీకు ఏం కావాలో చెప్పు నేను చేసి పెడతానని అంటుంది శ్రీ వల్లి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. తన చెల్లితో 10 లక్షల వ్యవహారం గురించి మాట్లాడుతూ ఉండగా నర్మదా ప్రేమ ఇద్దరు వింటారు.. శ్రీవల్లి బండారం మొత్తం బయటపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×