E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నర్మద, సాగర్ రొమాన్స్.. ప్రేమ కోసం ధీరజ్ మాస్టర్ ప్లాన్.. రామరాజుకు నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episode: నర్మద, సాగర్ రొమాన్స్.. ప్రేమ కోసం ధీరజ్ మాస్టర్ ప్లాన్.. రామరాజుకు నిజం తెలుస్తుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ పోలీస్ అవ్వడానికి వీళ్లేదు అని రామరాజు కండీషన్ పెడతాడు.. కానీ ధీరజ్ మాత్రం నేను తనని పోలీస్ ను చేస్తానని అంటాడు.. ఆ తరువాత రాత్రి రామరాజు కుటుంబం ఎంతో సంతోషంగా పాటలు పాడుతూ సరదాగా ఉంటారు. వాళ్ళని చూసిన సేన భద్ర ఇద్దరు కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు.. చెల్లెల్ని ఆ పనోడు లేపుకుపోయినప్పటి నుంచి మన ఇంట్లో సంతోషాలు దూరం అయిపోయాయి. త్వరలోనే ఆ సంతోషాల్ని దూరం చేద్దాం అని భద్ర అంటుంది.. సేన మాత్రం ప్రేమను పిలుస్తాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగావు.. బ్రతకవు అన్నారు. కానీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిన్ను పెంచి పెద్ద చేసాము అని అంటాడు. అలాంటిది నువ్వు లేచిపోయి పనోడి కొడుకును పెళ్లి చేసుకున్నావు.. తల్లిదండ్రులను ఎదిరిస్తావని అస్సలు ఊహించలేదు అంటూ.. సేన ఎమోషనల్ అవుతాడు. కూతురు కోసం కన్నీళ్లు పెట్టుకుంటాడు. తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ సీన్ ప్రేమను ఏడ్పిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం నర్మదా రెడీ అవుతూ ఉంటుంది. ఎంతగా లేటునా సరే సాగర్ మాత్రం నిద్రలేవడు.. టైం అవుతుంది లేవు అని చెప్తున్నాను కదా లేవు అని నర్మదా ఎంతగా లేపుతున్న సాగర్ మాత్రం లేవడు.. ఇక నిద్రపోతున్న నన్ను డిస్టర్బ్ చేస్తావ్ ఏంటి పడుకొని ఇవ్వు అని నర్మదపై సీరియస్ అవుతాడు సాగర్.. మొత్తానికి ఇవాళ నువ్వు రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ రాబోతున్నాయి మనం వెళ్లి గుడిలో పూజ చేయించుకోవాలి అని నర్మదా సాగర్ నీ రెడీ చేస్తుంది. ధీరజ్ ప్రేమని ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ని చేయాలి అని పొద్దున్నే వాకింగ్ జాగింగ్ చేయాలి అని లేపుతాడు.. అరె ఐదు గంటలకు లేచి జాగింగ్ అవసరం లేదు అని ప్రేమ ఎంతగా చెప్తున్నా ధీరజ్ వినడు.

Advertisement

నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యేవరకు నేను నిద్ర పోను నిన్ను నిద్రపోనివ్వను అని ధీరజ్ శపదాలు చేస్తారు..నిన్ను పోలీస్ ఆఫీస్ అని చేయాలన్నదే నా బాధ్యత.. ఇలా పడుకుంటే పోలీస్ ఆఫీసర్ ఎలా అవుతావు అని ధీరజ్ అంటాడు.. ఆ మాట వినగానే ప్రేమ ప్రతిసారి బాధ్యత బాధ్యత అని నా తలకాయ తినకు.. ఒక్కడికే బాధ్యత ఉన్నట్టే మాట్లాడుతున్నావే అని అంటుంది ప్రేమ. ఎవరు ఊహించని విధంగా నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేస్తాను అని ధీరజ్అంటాడు.. ఆ మాట వినగానే ప్రేమ నిజంగా పొంగిపోతుంది. వీడికి నా మీద ప్రేమ ఉంది కానీ బయటపడట్లేదు అని అనుకుంటుంది.

అటు సాగర్ కూడా నర్మదతో ఆడుకుంటాడు. కాసేపు ఆ పని కానించి వెళ్దామని అంటాడు. నర్మద మాత్రం క్లాస్ పీకుతుంది. నీ రిజల్ట్స్ వస్తున్నాయి అన్న కూడా నువ్వు ఇలా కేర్ లెస్ గా ఉన్నావ్ అంటే నాకు అర్థం కావట్లేదు అని అంటుంది.. నర్మదా నువ్వు అసలు ఏమీ ఫీల్ అవ్వకు నేను నీతో పాటు గుడికి వస్తానని సాగర్ కూడా వెళ్లి రెడీ అయ్యి వస్తాడు. నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వడం దగ్గర నీకోసం నేను ఏదైనా చేస్తాను అని నర్మదా అంటుంది. నువ్వు ఈ జాబ్ గనుక తెచ్చుకుంటే మా ఇంట్లో గౌరవం ఉంటుంది.. ఇటు అందరిలోనూ నీకు గౌరవం ఉంటుంది అని నర్మద అంటుంది. ఇక నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఉదయం పూజ చేయించుకోవాలని గుడికి బయలుదేరుతారు.

Advertisement

Also Read :

ప్రేమ ధీరజ్ ఇద్దరు రెడీకి జాయిన్ కోసం అని బయటకు వస్తారు.. బయట శ్రీవల్లి ముగ్గు పెడుతూ ఉంటుంది. ఫీవర్ ఏం చూసినా ఈ ఇద్దరు జంటలు ఈమెకు దొరికితే కచ్చితంగా నాన్నకు చెప్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటారు. ధీరజ్ ప్రేమను తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అందరికీ డౌట్ వస్తుంది కదా బట్ ఈ చీర కట్టుకో అనేసి అంటాడు. ప్రేమకు బలవంతంగా చీర కడతాడు. నర్మదా సాగర్ ఇద్దరూ ఏదో ఒకటి చెప్పేసి అక్కడి నుంచి గుడికి వెళ్ళిపోతారు.. ప్రేమదేశం వెళ్తున్న టైంలో తిరుపతి రామరాజు బయట కూర్చునే పేపరు చదువుతూ ఉంటారు. జాగింగ్ షూస్ లో ఉన్న ప్రేమను రామరాజు కనిపెడతాడని ఆడుకుంటారు. అక్కడనుంచి మెల్లగా చారుకుంటున్న టైంలో రామరాజు రేయ్ ఇంత పొద్దున్నే ఎక్కడికి రా అని అడుగుతాడు.. ఏం లేదు నాన్న గుడికి వెళ్దామని అని ధీరజ్ అబద్ధం చెప్తాడు. గుడికి వెళ్లాలంటే ఎవరైనా కలర్ బట్టలు వేసుకుంటారు.కానీ మీరేంటి ఇలా నలుపు రంగు బట్టలు వేసుకున్నారని రామరాజు అడుగుతాడు. ఈ కలర్ బట్టలు వేసుకుని గుడికి వెళ్ళకూడదా నాన్న అని అమాయకంగా అడుగుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×