E-Paper
Advertisement

OTT Movie : చేతబడితో వణికించే హర్రర్ మూవీ… కల్లోనూ వెంటాడే పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా

OTT Movie : చేతబడితో వణికించే హర్రర్ మూవీ… కల్లోనూ వెంటాడే పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా
Advertisement

OTT Movie : పృథ్వీరాజ్ సుకుమార్ మలయాళంలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన తెలుగు తమిళ హిందీ భాషల్లో కూడా నటిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హీరో నటించిన ‘ఆనందభద్రం’ సినిమా ఇప్పటికీ మలయాళంలో చెరగని ముద్ర వేసింది. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా, కేరళ స్టేట్ అవార్డ్స్‌లో 5 అవార్డులను కూడా గెలుచుకుంది. దీనినే తెలుగులో ‘శివపురం’ అనే పేరుతో విడుదల చేశారు. మలయాళం సినిమాల్లో హారర్ జానర్‌కి మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం, తెలుగులో కూడా పాపులర్ అయింది. మలయాళం సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఓ లుక్ వేయాల్సిన సినిమా ఇది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

స్టోరీలోకి వెళ్తే

సంతోష్ సివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, 2005 నవంబర్ 4న దీపావళి సందర్భంగా రిలీజ్ అయింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమార్, కవ్య మాధవన్, మనోజ్ కె. జయన్, రియా సెన్, రేవతి, మాముక్కు ఇందులో నటించారు. ఐయండిబిలో దీనికి 7.7/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం జీ 5, జియో హాట్ స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అనంతన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే యువకుడు అమెరికా నుండి కేరళలోని తన పూర్వీకుల గ్రామమైన శివపురంకి తిరిగి వస్తాడు. తన తల్లి చివరి కోరిక మేరకు, కుటుంబ ఆలయంలో దీపాలను వెలిగించడానికి అతను గ్రామానికి చేరుకుంటాడు. అనంతన్‌కు తన తల్లి చిన్నతనంలో చెప్పిన ఆత్మలు, వాటి శక్తుల కథలు గుర్తుంటాయి. గ్రామానికి వచ్చిన తర్వాత, ఆ కథలన్నీ నిజమని అతనికి అనుభవం అవుతుంది. ఈ మర్మమైన ప్రదేశంలో అడుగుపెట్టిన అనంతన్ జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. గ్రామంలోకి వచ్చిన తర్వాత, అనంతన్ భద్ర అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.

Read Also : ట్యూషన్ టీచర్‌పై ప్రేమ… ప్రేమించిన వాడు దక్కలేదని ఆ పిల్ల చేసే పనికి ఫ్యూజులు అవుట్

అదే సమయంలో దిగంబరన్ అనే క్రూరమైన మాంత్రికుడి గురించి తెలుసుకుంటాడు. దిగంబరన్ ఎన్నో శతాబ్దాలుగా ఒక పురాణ నాగ మణి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ నాగమాణి కోసం దిగంబరన్ చేసే దుష్ట పనుల కారణంగా గ్రామంలో అశాంతి నెలకొంటుంది. అనంతన్ అనుకోకుండా, ఈ దుష్ట శక్తుల మధ్య జరిగే ఈ యుద్ధంలో చిక్కుకుంటాడు. దిగంబరన్ ఆరాచకాలను అనంతన్ ఎలా అడ్డుకుంటాడు ? ఆ గ్రామాన్ని ఎలా కాపాడుతాడు ? అనేది క్లైమాక్స్ లో ఉత్కంఠతను పెంచుతుంది. మలయాళం హారర్ ఫ్యాన్స్ మరో మారు ఈ సినిమాపై ఓ లుక్ వేసి హారర్ థ్రిల్ ని ఎంచక్కా పొందండి.
Advertisement

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×