BigTV English

Intinti Ramayanam Serial Today Episode September 25th : కోర్టుకు వచ్చి నిజం చెప్పిన స్వాతి..నిర్దోషిగా అక్షయ్.. పల్లవి మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Serial Today Episode September 25th : కోర్టుకు వచ్చి నిజం చెప్పిన స్వాతి..నిర్దోషిగా అక్షయ్.. పల్లవి మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Serial Today Episode September 25th : నిన్నటి ఎపిసోడ్ లో పల్లవి పై అవని అనుమానం ఉంటుంది. పల్లవి నే ఇది చేసిందనీ ఆలోచిస్తుంది. ఇక శ్రీకర్ కోర్టుకు స్వాతిని చూపించాలని చెబుతాడు. ఆమె కోమాలో ఉంది మరి ఎలా వస్తుంది అంటే ఆమె రాకుంటే మాత్రం అన్నయ్య జైల్లోనే ఉండాలని చెబుతాడు. అందరు టెన్షన్ పడతారు. ఇక ఈ విషయాన్ని పల్లవి వాళ్ల నాన్నకు చెబుతుంది. స్వాతి స్పృహలోకి రాకుంటే మనకే మంచిది కదా అని అంటాడు. ఇక అక్షయ్ నేను చెయ్యని తప్పుకు దోషి అవుతున్నా. ఇంట్లో వాళ్ల ముందు తల ఎత్తుకొలేకున్నా.. ఈ కేసు నుంచి ఎలా బయట పడాలి అని టెన్షన్ పడతాడు. అప్పుడే అవని వస్తుంది.. భోజనం చేద్దాం రండి అంటుంది. నాకొద్దు అని కోపంగా అంటాడు. అటు వాళ్ల నాన్న కూడా అమ్మను తిడతారు. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది.


Intinti Ramayanam Serial Today Episode September 25th :
Intinti Ramayanam Serial Today Episode September 25th :

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని అక్షయ్ దగ్గరకు వెళ్లి భోజనం చెయ్యడానికి రండి అని అడుగుతుంది. నాకొద్దు అని అంటాడు. మనసులోనే బాధ పడుతూ కడుపు మాడ్చుకుంటే ఈ సమస్య నుంచి బయట పడతార అని అంటుంది.. మీరు ఇలాంటి ఉంటే ఇంట్లో అందరు బాధ పడతారు అని అంటుంది. ఆ తర్వాత అవినీ వాళ్ల అత్తయ్య బాధ పడుతుంటే అక్కడకు వస్తుంది. భాద పడుతున్నారా అత్తయ్య అని అడుగుతుంది. నీ మాత్రం బాధగా లేదా అని అడుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉన్నావని మేము అంతా ధైర్యంగా ఉన్నాం అని ఆమె అంటుంది. ఒక నిర్దోషికి శిక్ష పడుతుందని బాధ పడాలా.. లేక అమాయకుడును ఇరికించాలని చూసిన వారిని చూసి కోపడ్డాలా అనేది తెలియలేదు అత్తయ్య అని అంటుంది. అక్షయ్ ఏ తప్పు చెయ్యలేదు బయట పడతాడు. నాకు ఆ నమ్మకం ఉందని అంటుంది.

ఇకపోతే వీరిద్దరూ మాట్లాడుకోవడం పైనుంచి పల్లవి చూస్తుంది. మీరు అంతా ఇలా బాధ పడటమే నాకు కావలి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు కోర్టు సీన్.. అందరు టెన్షన్ పడుతూ ఉంటారు. శ్రీకర్ తన అన్న అక్షయ్ కాపాడుకోవడం కోసం కోర్టులో వాదిస్తాడు.. అవతల లాయర్ కోర్టును తప్పు ద్రోవ పట్టిస్తున్నారు అని వాదిస్తాడు.. ఇద్దరి వాదనలను జడ్జి వింటారు. నా క్లయింట్ అక్షయ్ ఎవరిని లైంగికంగా వేదించలేదు అంటాడు శ్రీకర్.. అందుకు ప్రూఫ్ ఎక్కడ అని జడ్జి అడుగుతాడు. ఈ కేసులో లైంగిక ఆరోపణలు చేసిన వ్యక్తి స్పృహలోనే ఉందని అంటాడు. పల్లవి, చక్రదర్ ముఖాలు షాక్ లో ఉండి పోతాయి.. అప్పుడే శ్రీకర్ ఫోన్ చేసి లోపలికి రమ్మని చెబుతాడు. స్వాతి లోపలికి రావడం చూసి అక్కడ ఉన్న వారంతా షాక్ అవుతారు..


Intinti Ramayanam Serial Today Episode September 25th
Intinti Ramayanam Serial Today Episode September 25th

ఇక శ్రీకర్ మీ పేరు అని అడుగుతాడు. స్వాతి నేను పది రోజుల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాను నాకు ఏమి గుర్తుకు రాలేదు అంటుంది. అక్షయ్ ఎవరో తెలియదు అని అంటాడు. ఆమె వాదన విన్న జడ్జి అక్షయ్ నిర్దోషి అని తీర్పు చెబుతుంది. ఇక అతన్ని విడుదల చేశాక బయటకు రాగానే మీడియా వస్తుంది. మీడియాకు అక్షయ్ వాళ్ల నాన్న, అవని గట్టిగా వార్నింగ్ ఇస్తారు. నిజాలు తెలుసుకొని చెప్పండి అంటూ చెప్పి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళగానే అందరు అక్షయ్ రావడం చూసి సంతోష పడతారు. అవని శ్రీకర్ జూనియర్ అన్నావు పల్లవి చూడు ఎలా కేసు గెలిచాడో అని అంటుంది. ఇక మామయ్య గారు మీకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్లే ఈ కేసును గెలిపించలేక పోయారు శ్రీకర్ గెలిపించారు అని చెబుతుంది.

ఇక కట్ చేస్తే అన్నయ్య నిర్దోషి గా బయట పడినందుకు పార్టీ చేసుకోవాలని అంటారు. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. కేసు గెలిచినా ఆనందంలో అందరు ఫ్యామిలీ పార్టీ చేసుకుంటారు. స్వాతి వచ్చి పల్లవికి ఫోన్ చేస్తుంది. పల్లవి ఏదో పెట్టే తీసుకొని కంగారుగా బయటకు వస్తుంది. అది గమనించిన అవని పల్లవి వెనకాలే వెళ్తుంది. ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు అని ఇస్తుంది. అప్పుడే అవని ఎంట్రీ ఇచ్చి స్వాతి అంటుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో పల్లవి గురించి ఇంట్లో తెలిసిపోతుందేమో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవిపై కమల్ సీరియస్.. అవనిని అవమానించిన అక్షయ్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్..

Brahmamudi Serial Today August 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: యామిని చెంప పగులగొట్టిన కావ్య – అపర్ణకు వార్నింగ్ ఇచ్చిన రాజ్‌  

GudiGantalu Today episode: బాలు కోసం మీనా త్యాగం.. బయటపడ్డ నిజం..జైలుకు వెళ్లిన గుణ..

Gundeninda Gudigantalu Vs Illu illaalu Pillalu : ఈ వారం దారుణంగా పడిపోయిన రేటింగ్..  గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Today Movies in TV :  సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్

Mahesh Babu -Sandra: ఘనంగా బుల్లితెర నటుడు మహేష్ బాబు నిశ్చితార్థం..ఫోటో వైరల్!

Big Stories

×