BigTV English

Harsha Sai: ప్రేమ పేరుతో రూ.2కోట్లు మోసం.. పరారీలో హర్ష సాయి..!

Harsha Sai: ప్రేమ పేరుతో రూ.2కోట్లు మోసం.. పరారీలో హర్ష సాయి..!

Harsha Sai.. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి(Harsha Sai) గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు .కష్టాల్లో ఉన్నవారికి సర్ప్రైజ్ లు ఇస్తూ.. వారితో చిన్నాచితక గేమ్స్ ఆడిస్తూ.. లక్షల రూపాయలను వారికి ఇచ్చి ఆర్థికంగా అండగా నిలబడుతూ ఉంటారు. అందుకే ఎంతోమంది పేద ప్రజల గుండెల్లో దేవుడిగా పేరు సొంతం చేసుకున్నారు హర్ష సాయి. అయితే ఇదంతా ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఇలా ఇతరులకు దానం చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉంటాయి.


ప్రేమ పేరుతో రూ.2 కోట్లు మోసం..

ముఖ్యంగా ఇతరులకు డబ్బు ఆర్థికంగా ఆదుకోవడమే కాదు రకరకాల ఫుడ్ ఐటమ్స్ ని కూడా టేస్ట్ చేస్తూ మంచి ఫుడిస్ట్ అని కూడా అనిపించుకున్నారు. అలాంటి ఈయనపై తాజాగా ఒక అమ్మాయి మోసపోయాను అంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ప్రేమ పేరుతో రూ.2 కోట్లు తీసుకొని పెళ్లి చేసుకోకుండానే మోసం చేశాడంటూ వాపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు హర్ష సాయిని అదుపు లోకి తీసుకోవాలని వెళ్లగా .. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..మరి అసలు విషయం ఏమైందో ఇప్పుడు చూద్దాం.


Harsha Sai: Rs. 2 crore fraud in the name of love.. Harsha Sai is on the run..!
Harsha Sai: Rs. 2 crore fraud in the name of love.. Harsha Sai is on the run..!

హర్షసాయి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

హర్ష సాయి విషయానికి వస్తే.. రోడ్డుపై కరెన్సీ నోట్లు వెదజల్లుతూ జనాల్ని పిచ్చోళ్లను చేస్తూ అదే క్రేజ్ తో ఏకంగా పాన్ ఇండియా మూవీలో నటించే స్థాయికి ఎదిగిన హర్ష సాయి పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రేప్ కేస్ తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. నమ్మించి మోసం చేశాడని , బిగ్ బాస్ ఓటీటీ మాజీ కంటెస్టెంట్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని, ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడని, అడ్వకేట్ తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. తన పర్సనల్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని హర్ష సాయి అలాగే అతని తండ్రి రాధాకృష్ణపై ఆమె ఫిర్యాదు ఇవ్వడంతో ఈ మేరకు సెక్షన్ 376, 354 కింద కేసు నమోదు చేశారు రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్.

పరారీ లో హర్ష సాయి..

ఆధారాలు సమర్పించాలని , బాధిత యువతిని పోలీసులు కోరగా వైద్య పరీక్షల కోసం బాధితురాలని హాస్పిటల్ కి పంపించారు. సామాన్యులకు ఆర్థిక సహాయం చేస్తూ మానవత్వం పరిమళించే మార్పు వీడియోలతో యూట్యూబర్ గా పాపులారిటీ సంపాదించుకున్న హర్ష సాయికి అంత డబ్బు ఎక్కడిదనే చర్చతో పాటు అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని ఆరోపణల రచ్చ కూడా అప్పుడే జరిగిపోయింది. రీసెంట్ గా ఒక పాన్ ఇండియా సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు. దీనికి తోడు ఈ సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మోసం చేశాడని , కేస్ ఫైల్ చేయించడంతో అసలు వీరిద్దరికి ఎలా పరిచయం..? ఎక్కడ పరిచయం..? ఈ కంప్లైంట్ వెనుక ఉన్న కథ ఏంటి..? అనే కోణంలో ట్రోల్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే యువతి ఫిర్యాదుతో కేస్ ఫైల్ అయింది కానీ ఈ విషయంపై హర్ష సాయి స్పందించలేదు. ప్రస్తుతం ఎంక్వయిరీ కోసం వెళ్లగా.. పరారీలో ఉన్నట్లు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×