E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కొడుకుకు దగ్గరైన రాజేశ్వరి..ఇంట్లో బాంబ్ పేల్చిన పల్లవి.. అవనికి దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: కొడుకుకు దగ్గరైన రాజేశ్వరి..ఇంట్లో బాంబ్ పేల్చిన పల్లవి.. అవనికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode April 25th : భరత్ ఫోన్ చేసి అక్షయ్ ని కొట్టిన విషయాన్ని పల్లవికి చెప్తాడు. ఏమి తప్పు చేయలేదు భరత్ నీ డ్యూటీని నువ్వు మాత్రమే చేసావు. నీకు ఏమీ కాకుండా మేము చూసుకుంటాము అని పల్లవి అంటుంది. నువ్వేమీ ఆలోచించొద్దు. నీకు ఏమి కాకుండా నేను మామ్ చూసుకుంటాను అని అనగానే భరత్ సరే అంటాడు. ఇక రాజేశ్వరి భరత్ దగ్గరికి వెళ్లి ఎందుకు నువ్వు అతని కొట్టావు నీ బావని సంగతి నువ్వు మర్చిపోయావా అని అడుగుతుంది.. నాకు దేవుడితో సమానం మీ కొడుకు లేదా మీ భర్త ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని అనగానే రాజేశ్వరి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది..

ఒక్కటైన తల్లి,కొడుకులు..

భరత్ నీ తన ఇంటికి తీసుకెళ్లిన రాజేశ్వరి నువ్వెందుకు ఇలా చేశావు. భరత్ నీ అక్క భర్తని నువ్వు కొట్టావు. నువ్వు ఇలా చేయడానికి కారణం ఏంటి.. నాకోసం నీ వాళ్ళనే ఎదిరిస్తున్నావు.. వాళ్లు నీ గురించి ఏమనుకుంటారు కొంచమైనా ఆలోచించవా అని రాజేశ్వరి భరత్ ని అడుగుతుంది. నేనేం తప్పు చేయలేదు మేడం నా బాధ్యతను నేను చేశాను అని భరత్ అంటాడు. మిమ్మల్ని అతను కొట్టబోయాడు అందుకే అతని నుంచి మిమ్మల్ని కాపాడటానికి అతని కొట్టాను అని భరత్ చెప్తాడు. నా ప్లేస్ లో మీ భర్త గాని కొడుకు గాని ఉంటే మిమ్మల్ని ఇలానే వదిలేస్తారా అందుకే నేను ఇలా చేశాను అని రాజేశ్వరితో భరత్ అనగానే ఆమె ఎమోషనల్ అయిపోతుంది. కొడుకుగా ఇదంతా చేశానన్నావు కదా మరి నన్ను అమ్మ అని ప్రేమగా పిలవచ్చు కదా అని రాజేశ్వరి అడుగుతుంది.

భానుమతికి అనుమానం..

Advertisement

నాకన్నా కొడుకు లాంటి వాడివే కదా నన్ను మేడం అని పిలవడం ఎందుకు అమ్మ అని పిలువు అని రాజేశ్వరి అడుగుతుంది. నేను కూడా మీ అమ్మ స్థానంలోనే ఉన్నాను కాబట్టి నన్ను కూడా నువ్వు అమ్మ అని పిలవచ్చు కదా ఒక్కసారి అమ్మ అని పిలువు అని రాజేశ్వరి ఎమోషనల్ అయిపోతుంది. భరత్ నాకు మంచి జీవితం ఇచ్చారు మిమ్మల్ని నేను అమ్మ అని పిలవడంలో తప్పులేదు కదా అని రాజేశ్వరిని అమ్మ అని పిలుస్తాడు. ఆ పిలుపు విన్న రాజేశ్వరి తన కొడుకు అమ్మ అని పిలిచాడు అని చాలా సంతోషపడుతుంది. రాజేశ్వరి ప్రవర్తన చూసిన భానుమతికి అనుమానం మొదలవుతుంది. భరత్ ను ఎందుకు నెత్తిన పెట్టుకుంటుందో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది.

పల్లవి ప్లాన్ సక్సెస్..

అక్షయ్ కమల్ ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు అయితే వాళ్ళిద్దరికీ దెబ్బలు తగిలి ఉండడంతో అవని కంగారు పడిపోతుంది. భరత్ కొట్టాడు అన్న విషయం ఇంట్లో తెలిస్తే అవని బాధపడుతుంది అని అక్షయ్ ఏమి జరగనట్టే ఉండమని కమల్ తో చెప్తాడు. అయితే ఇంటికి వచ్చిన వాళ్ళిద్దరిని చూసిన అవని ఏం జరిగింది ఆ దెబ్బలు ఏంటి అని కంగారు పడిపోతుంది. బైకు స్కిడ్ అయ్యి కింద పడిపోయామని కమల్ అబద్ధం చెప్తాడు కానీ పల్లవికి అనుమానం ఇంకాస్త పెరగడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అసలు విషయాన్ని కనుకుంటుంది.

అవనిని రెచ్చగొట్టిన పల్లవి..

Advertisement

ఇంట్లో ఇంత జరుగుతున్న కూడా ఏమి పట్టించుకోనట్లు ఉంటావేంటి అక్క నా భర్తని కొట్టింది మీ తమ్ముడే. అంతకన్నా ముందు నీ భర్తని కొట్టింది కూడా మీ తమ్ముడే. నేను వీళ్ళు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు కాబట్టి సైట్ లో ఉన్న మనవాళ్ళకి ఫోన్ చేసి అసలు విషయాన్ని కనుక్కున్నాను. అక్కడ జరిగిన గొడవ గురించి పల్లవి అంతా అవనీత చెప్తుంది. బావ ఈరోజు నిన్ను కొట్టినోడు రేపు ఇంకేదైనా చేస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు అని పల్లవి కమల్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ మాట విన్న అవని వెంటనే అక్షయ్ ని తీసుకొని తన పుట్టింటికి వెళ్తుంది.

భరత్ ను కొట్టిన అవని..

అవని తన పుట్టింటికి వెళ్ళగానే అక్కడ మీనాక్షి ప్రణతి భరత్ ని ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని పదేపదే అడుగుతారు. భరత్ మాత్రం తనకు ఏమీ తెలియనట్లుగా మౌనంగా ఉంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన అవని నా భర్తనే కొడతావా అని భరత్ ని చెంపలు పగలగొడుతుంది. నీకెంత ధైర్యం రా నా భర్త మీద చెయ్యి ఎత్తుతావా అని అవని కొడుతున్నాడని చూసి మీనాక్షి ప్రణతి ఇద్దరు షాక్ అవుతారు. అక్కడికి వచ్చిన చక్రధర్ కూడా భరత్ ని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు. అవని ఎంతగా కోపని కంట్రోల్ చేసుకోవాలనుకున్న కూడా భరత్ మాటలతో ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది. మొత్తానికి పల్లవి రాజేశ్వరిలు అక్క తమ్ముళ్ల మధ్య చిచ్చు పెడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది సోమవారం ఎపిసోడ్లో శ్రీకర్ ఇంటికి వస్తాడేమో చూడాలి..

Also Read :బిగ్ బాస్ నిఖిల్ గురించి షాకింగ్ నిజాలు.. అస్సలు ఊహించి ఉండరు..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×