E-Paper
Advertisement

చుండ్రు సమస్యకు చెక్ పెట్టండి.. వేపతో అద్భుతమైన హెయిర్ ప్యాక్‌లు!

చుండ్రు సమస్యకు చెక్ పెట్టండి.. వేపతో అద్భుతమైన హెయిర్ ప్యాక్‌లు!
Advertisement

Neem hair pack for dandruff: నేటి కాలంలో కాలుష్యం, జుట్టు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘చుండ్రు’. ఇది కేవలం దురదనే కాకుండా.. జుట్టు రాలడానికి, చర్మ సంబంధిత అలర్జీలకు దారి తీస్తుంది. మార్కెట్లో దొరికే.. యాంటీ-డాండ్రఫ్ షాంపూలు తాత్కాలికంగా పనిచేసినా, అందులోని కెమికల్స్ జుట్టును దెబ్బ తీస్తాయి. ఇలాంటి సమయంలో ప్రకృతి మనకు ప్రసాదించిన ‘వేప’ ఒక శక్తి వంతమైన యాంటీ-సెప్టిక్ , యాంటీ-ఫంగల్ ఏజెంట్‌గా పనిచేసి చుండ్రును వేళ్ళతో సహా తొలగిస్తుంది.

చుండ్రు కోసం వేప ప్యాక్‌లు – పూర్తి సమాచారం:
వేపలో ఉండే ‘నింబిడిన్’ , ‘అజాడిరాక్టిన్’ వంటి మూలకాలు శిలీంధ్ర వ్యాధులపై పోరాడి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చుండ్రు నివారణకు వేపను రకరకాలుగా ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం.

Advertisement

1. వేప, పెరుగు ప్యాక్:
పెరుగులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ తల చర్మానికి తేమను ఇస్తాయి. వేప ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.

తయారీ: ఒక కప్పు వేపాకులను మెత్తని పేస్ట్‌లా చేసి.. అందులో రెండు స్పూన్ల పెరుగు కలపండి.

Advertisement

వాడే విధానం: ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇది చుండ్రును తగ్గించడమే.. కాకుండా జుట్టును మృదువుగా చేస్తుంది.

2. వేప, నిమ్మరసం:
నిమ్మరసంలోని విటమిన్ సి, అసిడిక్ స్వభావం చుండ్రు పొరలను తొలగిస్తాయి.

తయారీ: వేప పొడి లేదా పేస్ట్‌లో అర చెక్క నిమ్మరసం కలపండి.

ప్రయోజనం: ఇది తలలో వచ్చే దురదను తక్షణమే తగ్గిస్తుంది. వారానికి ఒక్కసారి వాడితే.. మంచి ఫలితం ఉంటుంది.

3. వేప, కొబ్బరి నూనె:
పొడి చర్మం వల్ల వచ్చే చుండ్రుకు ఇది దివ్యౌషధం.

తయారీ: కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కొన్ని వేపాకులు వేసి మరిగించండి. నూనె ఆకుపచ్చ రంగులోకి.. మారాక వడగట్టండి.

వాడే విధానం: ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి.. ఫంగల్ ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

4. వేప నీటితో శుభ్రం చేయడం:
ప్యాక్ వేసుకోవడానికి సమయం లేని వారికి ఇది సులభమైన పద్ధతి.

పద్ధతి: లీటరు నీటిలో గుప్పెడు వేపాకులు వేసి సగం అయ్యే వరకు మరిగించండి. ఆ నీటిని చల్లార్చి, షాంపూ చేసుకున్న తర్వాత చివరిగా ఆ నీటితో తలను శుభ్రం చేసుకోండి.

లాభం: ఇది తల చర్మంపై రక్షణ కవచంలా పని చేస్తుంది.

5. వేప, మెంతుల ప్యాక్ :
మెంతులు జుట్టు రాలడాన్ని అరికడతాయి.

తయారీ: రాత్రంతా నానబెట్టిన మెంతులను, వేపాకులతో కలిపి మెత్తగా రుబ్బాలి.

ప్రయోజనం: ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడి. చుండ్రు పూర్తిగా మాయమవుతుంది.

Related News

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

Big Stories

Advertisement
×