E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: నువ్వు నీ మొగుడిని రెచ్చగొట్టావ్.. బావ నా కాళ్ళు పట్టుకోవాలి.. పుట్టింటికి వెళ్లిన ప్రణతి..

Intinti Ramayanam Today Episode: నువ్వు నీ మొగుడిని రెచ్చగొట్టావ్.. బావ నా కాళ్ళు పట్టుకోవాలి.. పుట్టింటికి వెళ్లిన ప్రణతి..
Advertisement

Intinti Ramayanam Today Episode April 30th : భరత్ ఆఫీస్ కి వెళ్లకుండా అప్పుడు ఇంటికి రావడంతో మీనాక్షి ఏమైంది రా అని అడుగుతుంది. నేను ఆఫీస్ కి వెళ్ళలేదు పోలీస్ స్టేషన్ వెళ్లాను అని భరత్ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఏంటి నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లడమేంట్రా ఎందుకు వెళ్లావు అని అడగగానే కమల్ నన్ను కొట్టాడు కదా తన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను అని అంటాడు. అవని ఆశలు అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతారు.

నువ్వు నీ మొగుడిని రెచ్చగొట్టావా..? 

నువ్వు ఇంతగా మారిపోతావని అస్సలు అనుకోలేదు.. నీకు ఏమైందిరా భరత్ అని అవని ఎంతగా అడుగుతున్నా సరే భరత్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు.. ప్రణతి అన్నయ్య కమల్ అన్నయ్య మీద భరత్ కేసు పెట్టాడు అన్నయ్య అని అనగానే.. అక్షయ్ అసలు నువ్వేంటి నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు అని అంటాడు. కమల్ మీద నువ్వెందుకు కేసు పెట్టావు రా కొంచమైనా నీకు బుద్ధుందా అని అవని భరత్ ని అడుగుతుంది. నువ్వు నీ మొగుణ్ణి రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకొచ్చావా..? నీ మొగుడిని నువ్వు ఎలా నీ మాటలతో ఇక్కడికి తీసుకొచ్చావో అర్థం చేసుకోలేనంత పిచ్చివాణ్ణి అయితే కాదు అని భరత్ అనగానే అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది..

కమల్ నన్ను కొట్టాడు జైల్లో ఉండాలి.. 

Advertisement

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం కామన్.. అయినా కూడా నా భార్య మీద నేను చేయి చేసుకోవడం తప్పయిందా..? చిన్న చిన్న వాటికి ఎందుకు ఇలా పోలీస్ కేసుల వరకు వెళ్లాలి. ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అని భరత్ ను అక్షయ్ అడుగుతాడు.. మరి మీరు ఈ చక్రధర్ మీద ఎందుకు పోలీస్ కేసు పెట్టారు. కూర్చొని మాట్లాడుకుని ఉంటే సరిపోయేది కదా..? మరి ఈ చక్రధాన్ని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేసేలా చేశారు అని భరత్ అడుగుతాడు.. ప్రతిదీ ఇలా మాట్లాడతావ్ ఏంట్రా నువ్వు ఏమనుకుంటున్నావు అని అవని అడుగుతుంది. నా మీద దెబ్బ పడినందుకు కమల్ కి పోలీసులు దెబ్బ పడాల్సిందే అప్పుడే బయటికి తీసుకొస్తాను అని భరత్ అంటాడు.

అక్షయ్ నా కాళ్ళు పట్టుకోవాలి.. 

భరత్ ఎందుకురా ఇలా మారిపోయావు..? నీ కాళ్లు పట్టుకుంటాను రా నువ్వు కమల్ మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకోరా అని మీనాక్షి ఎంత బతిమిలాడినా కూడా భరత్ మాత్రం అస్సలు వినడు.. చక్రధర్ఎందుకు భరత్ ఇలా చేస్తున్నావు అని అడిగినా సరే నువ్వు మధ్యలో రావద్దు అని వార్నింగ్ ఇస్తాడు.. చెప్పిన మాట వినరా నువ్వు నా కొడుకువి రా అని మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే నువ్వు నా కాళ్లు పట్టుకోవడం కాదమ్మా ఈ అక్షయ్ నా కాళ్లు పట్టుకోవాలి అప్పుడే నేను కమల్ని బయటికి తీసుకుని వస్తాను అని అంటాడు..

కమల్ పై అటెంప్ట్ టూ మర్డర్ కేసు..

Advertisement

మీరు వాడి కాళ్లు పట్టుకోవడం ఏంటండీ.. మనం వెళ్లి కమల్ ని ఏదో ఒక రకంగా బయటకి తీసుకొని వద్దాం పదండి అని అవని అక్షయ్ ని తీసుకుని వెళుతూ ఉండగా… భరత్ నేను పెట్టింది మామూలు కేసు కాదు అటెంప్ట్ టు మర్డర్ కేసు. మీరు అక్కడికి వెళ్లినా కూడా కమల్ ని బయటికి తీసుకురాలేరు అని భరత్ అనగానే అక్షయ అవని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆగు నాకు ఇవన్నీ కాదు నా తమ్ముడు బయటికి రావడం నాకు ముఖ్యం అందుకు ఏదైనా చేస్తాను అని అక్షయ్ భరత్ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమవుతాడు… మొత్తానికి భరత్ కాలనీ అక్షయ పట్టుకొని నన్ను క్షమించు నా తమ్ముడిని విడిపించు అని అడుగుతాడు.

పార్వతికి నిజం చెప్పిన కమల్..

మనం అనుకున్న ప్లాను పక్కాగా పూర్తయింది అని రాజేశ్వరి పల్లవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అవును ఇంత త్వరగా పూర్తవుతుందని అస్సలు అనుకోలేదు.. అనుకున్న దాని కంటే భరత్ ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడు. దానివల్లే అక్షయ్ భరత్ కాళ్లు పట్టుకున్నాడు.. అవని అక్షయ లకు ఇది ఘోర అవమానమే.. ప్రతిసారి ఇది గుర్తుచేసే అవమానమే అని పల్లవి కూడా సంతోషపడుతుంది. ఇక కమల్ ని అక్షయ అవనీలు ఇంటికి తీసుకొస్తారు. కమల్ ఇంటికి రావడం చూసిన పార్వతి ఎమోషనల్ అయిపోతుంది.. కమల్ అక్షయ్ భరత్ కాల్ పట్టుకున్నాడు అని చెప్పగానే కన్నీళ్లు పెట్టుకుంటుంది పార్వతి. ఇక ప్రణతి నీతో బతకడం వేస్ట్ అని అక్కడినుంచి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ హైలెట్ ఎపిసోడ్స్..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×