BigTV English

Intinti Ramayanam Today Episode : అవనికి ఇంట్లో పెరిగిన సానుభూతి .. పల్లవి టార్గెట్.. భరత్ కోసం అవని వేట..?

Intinti Ramayanam Today Episode : అవనికి ఇంట్లో పెరిగిన సానుభూతి .. పల్లవి టార్గెట్.. భరత్ కోసం అవని వేట..?

Intinti Ramayanam Today Episode December 1st :  నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవికి రాజేశ్వరి వార్నింగ్ ఇస్తుంది. నీ బిడ్డను చంపే ప్రయత్నాలు చేస్తే నిన్ను నేను చంపేస్తాను.. కూతురు అని కూడా చూడను.. నువ్వు ఇలా నీ బిడ్డను చంపాలని అనుకుంటే మాత్రం సహించేది లేదు అని నిన్ను ఏమి చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇస్తుంది. అమ్మ కోపాన్ని చూసి షాకైన పల్లవి చక్రధర్ దగ్గరికి వెళుతుంది. ఎందుకు ఏమైంది అనేసి పల్లవిని చక్రధర్ అడుగుతాడు. నీ ఆబార్శన్ ప్లాన్ ఫెయిల్ అవ్వడం తో ఫీల్ అవుతున్నావా అనేసి అడుగుతాడు. ఇకమీదట ఇలాంటి ప్లాన్లు వద్దు డాడీ నా బిడ్డని నేను చంపాలనుకోవట్లేదు అనేసి అంటుంది పల్లవి. ఆ మాట వినగానే చక్రధర్ షాక్ అవుతాడు. అవని అక్షయ్ కూడా ఇంట్లోంచి పంపించేస్తే ఇక నా బిడ్డ కదా ఆ ఇంటికి రా రాజు నేనే కదా ఆ ఇంటికి మహారాణి అని అంటుంది. సరే అమ్మ నీ ఇష్టం అని చక్రధర్ అంటాడు. ఇక ఉదయం ఇంట్లో అందరూ పల్లవి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవని హారతి తీస్తుంటే కమల్ వాళ్ళ బామ్మ హారతి తీయద్దని వాదిస్తుంది. కడుపు పోవడానికి కారణమైన తనతోనే హారతి తీర్చడం ఏంటి అని పార్వతిపై మండిపడుతుంది. అవని బాధ పడుతుంది. కమల్ వదిన హారతి తీస్తేనే లోపలికి వస్తామని అంటాడు. ఇక అవని హారతి తీస్తుంది. పల్లవి, అమ్మమ్మ కలిసి ప్లాన్ వేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ప్రోమో విషయానికొస్తే.. పల్లవి ఇంట్లోకి రాగానే బామ్మ కోపంగా ఉంటుంది. ఏమైంది అమ్మమ్మ కోపంగా ఉన్నావని పల్లవి అడుగుతుంది. ఇకమీదట ఏం కావాలన్నా నన్నే అడుగు ఆ అవనిని అడగకు అనేసి చెప్తుంది. బామ్మ ని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని పల్లవి ప్లాన్ మనసులో అనుకుంటుంది. బామ్మ కు లేనిపోనివి నూరిపోసి అవని పై అనుమానం వచ్చేలా చేస్తుంది. ఇక ఇద్దరు కలిసి అవనీని ఇంట్లోంచి పంపించడం ఎలా అని స్కెచ్ వేస్తారు. అప్పుడే కమల్ వస్తాడు. కమల్ కు తెలియనివ్వకూడదు అని ఏదోకటి సర్ది చెప్తారు.. ఇక కమల్కు బామ్మ చాలెంజ్ విసురుతుంది  అంత మగాడివైతే నీ పెళ్ళానికి చీర గట్టి చూపించు అనేసి అంటుంది. ఇక ఆరాధ్య తన ఫ్రెండు బయట పెయింట్ వేస్తుంటే అవి గోడల మీద పెయింట్ వేస్తారా అనేసి అరిచి లోపలికి పంపిస్తుంది అవని. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆ పెయింట్ ను క్లీన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి ఇంట్లో ఇంత ప్రశాంతంగా ఉంటే బాగోలేదు అసలు ఏదో ఒకటి జరగాలని పైనుంచి ఫ్లవర్ వాస్ ను కింద పడేస్తుంది. కింద కూర్చొని ఉన్న అక్షయ్ పై కాకుండా పక్కన పడుతుంది.

ఆ సౌండ్ కు అందరు అక్కడకు వస్తారు.. ఏమైందని అడుగుతారు. అవని కూడా కిందకు వస్తుంది. ఏమైందని అడుగుతుంది. పైనున్న అవని ఇదంతా చేసిందని బామ్మ తిడుతుంది.  ఇక అక్షయ్ కూడా అవనిని అందరి ముందు తిట్టి వెళ్ళిపోతాడు. ఈ సీన్ చూసి పల్లవి తెగ సంబరపడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ప్రోమోలో అవనిని బామ్మ తిడుతుంది. నిన్ను నా మనువడు తిట్టడంలో తప్పులేదు అని అరుస్తుంది. వినోద్ ఎదో పొరపాటున పడింది అక్క నువ్వు ఫీల్ అవ్వకు అంటారు. అందరు అవనికి సపోర్ట్ గా ఉంటారు. స్వామీజీ వస్తాడు పల్లవి దుష్ట శక్తి అన్నట్లు చెబుతాడు. ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలంటే పల్లవిని దూరంగా ఉంచాలని అంటాడు.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..


Related News

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Big Stories

×