Road Accident: అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందంగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని మెరుగైన వైద్యం కోసం బళ్లారి తరలించారు. డ్రైవర్ మినహా మిగిలిన వారంతా వైద్యులుగా తెలుస్తోంది. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బెంగళూరు నుంచి బళ్లారికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చెట్టును కారు వేగంగా ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రంలో 42 వ జాతీయ రహదారిపై.. ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి బళ్లారి వెళ్తుండగా కారు అదుపుతప్పు చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో స్పాట్ లోనే ముగ్గురు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం బళ్లారి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు డాక్టర్లు గోవిందరాజులు, యోగేష్ , డ్రైవర్ వెంకట నాయుడుగా పోలీసులు తెలిపారు. వీరందరు హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రమైన మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో నలుగురు మృతి
ఇదిలా ఉంటే..హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, ఆటోను స్విఫ్ట్ కారు ఢీకొన్న ఘటనలో దంపతులు దుర్మరణం చెందారు. కారు డ్రైవర్.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.